'తనిఖీల్లో పట్టుబడిన రూ.2కోట్ల 25లక్షల నగదు': ఆదాయపన్ను శాఖకు అప్పగింత

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 4:58 PM IST

thumbnail

2 Crore Money Seized During Inspection: ఎటువంటి ఆధారాలు లేకుండా కారులో భారీగా నగదును తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి విజయవాడకి వెళ్తున్న కారును తనిఖీ చేయగా బ్యాగుల్లో రూ. 2కోట్ల 25లక్షల నగదు గుర్తించారు. ఈ నగదుకి వ్యక్తులు సరైన పత్రాలు చూపించకపోవటంతో ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని డీఎస్పీ తెలిపారు. కారులో ఉన్న శ్రీనివాసరెడ్డి, డ్రైవర్​ను అదుపులోకి తీసుకొని మార్టూరు పోలీస్ స్టేషన్​కు తరలించామని పోలీసులు తరలించారు. 

ఇటీవల ప్రొద్దుటూరు మనీ సీజ్: ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బిల్లులు లేని డబ్బును పోలీసులు సీజ్ చేస్తున్నారని, పోలీసుల తీరును నిరసిస్తూ ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి బంగారం వ్యాపారులతో కలిసి నిరసనకు చేశారు. పోలీసులు తనిఖీలు చేస్తుండటంతో వ్యాపారం భయంభయంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాచమల్లు అభిప్రాయపడ్డారు. బంగారం కొనడానికి వచ్చిన ప్రజల వద్ద బిల్లులు లేవని డబ్బును సీజ్ చేయటం అన్యాయమని రాచమల్లు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.