ETV Bharat / technology

మీ ఫోన్ పోయిందా? డోంట్​ వర్రీ - ఇకపై మీరే దాన్ని బ్లాక్ చేయవచ్చు! - How To Block Stolen Phone

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 11:07 AM IST

How To Block Stolen Phone With Sanchar Saathi : మీ ఫోన్​ను పోయిందా? ఎవరైనా దొంగిలించి ఉంటారని అనుమానంగా ఉందా? డోంట్ వర్రీ. సంచార్​ సాథీ సాయంతో మీరు పొగొట్టుకున్న ఫోన్​ను ట్రాక్ చేయవచ్చు. అవసరమైతే మీరే స్వయంగా దానిని బ్లాక్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Block Stolen Phone
How to track your lost or stolen mobile phone

How To Block Stolen Phone With Sanchar Saathi : మన నిత్యజీవితంగా మొబైల్ ఫోన్స్​ ఒక భాగం అయిపోయాయి. వీటిలో మన కాంటాక్ట్ నంబర్స్​ మాత్రమే కాదు, ఎంతో సున్నితమైన సమాచారాన్ని (డేటా)ను కూడా సేవ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ మన మొబైల్​ను ఎవరైనా దొంగిలించినా, లేదా మనమే పొరపాటున పోగొట్టుకున్నా, తరువాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి 'సంచార్ సాథి' ఒక సులువైన పరిష్కారం చూపిస్తోంది. అది ఏమిటంటే?

సీఈఐఆర్‌ CEIR
మీ ఫోన్​ పోయినా లేదా అపహరణకు గురైనా, సెంట్రల్​ ఎక్విప్​మెంట్​ ఐడెంటిటీ రిజిస్టర్​ (సీఈఐఆర్​) ద్వారా వెంటనే దాన్ని బ్లాక్‌ చేసి పనిచేయకుండా చేయవచ్చు. అంతే కాదు మీ ఫోన్​ తిరిగి దొరికితే, దానిని అన్​బ్లాక్​ చేసుకుని వాడుకోవచ్చు. ఇందుకోసం ఫోన్‌ పోగొట్టుకున్న బాధితులు ఐఎంఈఐ, ఇతర వివరాలు ఇచ్చి సంచార్ సాథి పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బాధితులు పోగొట్టుకున్న 15,43,666 ఫోన్లను బ్లాక్‌ చేశారు. వాటిల్లో 8,47,140 ఫోన్లను తిరిగి బాధితులకు అప్పగించారు.

సైబర్ నేరగాళ్లకు చెక్​
నేడు సైబర్​ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్​ కేటుగాళ్లు లింక్‌ల ద్వారా మాల్‌వేర్లు పంపించడం, బ్యాంకు అధికారుల ముసుగులో ఫోన్‌ చేయడం, ఓటీపీలు తెలుసుకుని పలు నేరాలకు పాల్పడుతున్నారు. వీటన్నింటికీ మూలం మొబైల్ ఫోన్స్​, సిమ్‌కార్డులే. అందుకే సైబర్‌ నేరాల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్స్‌ ఆధ్వర్యంలో 'సంచార్‌ సాథి' అనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కనుక బాధితులు ఎవరైనా https://sancharsaathi.gov.in పోర్టల్‌లోకి వెళ్లి సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అంతేకాదు సైబర్‌ నేరాల గురించి అవగాహన పెంచుకోవచ్చు. నేరగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకునేందుకు అవసరమైన మెలకువల్ని తెలుసుకోవచ్చు.

చక్షు
సైబర్‌ నేరగాళ్లు - కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, వాట్సప్‌ల ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తిస్తే, వెంటనే 'చక్షు' పోర్టల్​లో ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకు ఖాతా, పేమెంట్‌ వ్యాలెట్‌, సిమ్‌, గ్యాస్‌ కనెక్షన్‌, ఎలక్ట్రిసిటీ కనెక్షన్‌, కేవైసీ అప్‌డేట్‌, ఎక్స్‌పైరీ, డీయాక్టివేషన్‌, ఇంపర్సనేషన్‌ (ప్రభుత్వ అధికారుల ముసుగులో మోసానికి పాల్పడటం), సెక్స్‌టార్షన్‌ లాంటి మోసాల గురించి చక్షులో ఫిర్యాదు చేయవచ్చు.

నో యువర్‌ మొబైల్‌(కేవైఎం)
తక్కువ ధరకు వస్తుందని సెకండ్‌ హ్యాండ్‌ మొబైల్‌ ఫోన్లు కొని అమాయకులు చిక్కులపాలవుతున్నారు. ఈ నేపథ్యంలో మొబైల్‌ కొనేముందు దాని పూర్వాపరాల గురించి తెలుసుకునేలా ‘నో యువర్‌ మొబైల్‌(కేవైఎం) ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా ఫోన్‌ వ్యాలిడిటీని దాని ఐఎంఈఐ నంబర్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఫోన్‌లో *#06# డయల్‌ చేయడం ద్వారా ఐఎంఈఐ నంబర్‌ వస్తుంది. దాన్ని పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆ ఫోన్‌ ‘బ్లాక్‌లిస్టెడ్‌’, ‘డూప్లికేట్‌’, ‘ఆల్‌రెడీ ఇన్‌ యూజ్‌’ అని గనక వస్తే కొనకుండా ఉండటం మంచిది.

నో యువర్‌ మొబైల్‌ కనెక్షన్‌(టాఫ్‌కాప్‌)
సైబర్‌ నేరగాళ్లు ఇతరుల పేర్లతో సిమ్​ కార్డులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. అందుకే ఇలాంటి నేరగాళ్లకు చెక్​ పెట్టేందుకు, టెలికాం అనలిటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌(టాఫ్‌కాప్‌) ఫీచర్‌ను డీవోటీ తీసుకువచ్చింది. దీని ద్వారా మనకు తెలియకుండానే, మన పేరుపై ఎవరైనా సిమ్​ కార్డు ఉపయోగిస్తున్నారా? లేదా? అనేది చాలా సులువుగా తెలుసుకోవచ్చు.

ముందుగా టాఫ్​కాప్​ను ఓపెన్ చేసి, మొబైల్‌నంబర్‌ను ఎంటర్​ చేయాలి. వెంటనే మీకొక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసి లాగిన్‌ అయితే, మీ పేరుగా మొత్తంగా ఎన్ని సిమ్‌కార్డులు జారీ అయ్యాయో తెలుస్తుంది. మీకు తెలయని సిమ్​కార్డులు ఉంటే, వాటిపై రిపోర్ట్‌ చేసి బ్లాక్‌ చేయించవచ్చు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 65,23,541 రిక్వెస్ట్‌లు రాగా, వాటిలో 55,57,507 కేసులను పరిష్కరించారు.

రిక్‌విన్‌
సైబర్ నేరగాళ్లు విదేశాల నుంచి ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు మనం తరచూ చూస్తున్నాం. వాస్తవానికి ఈ నేరగాళ్లు విదేశాల నుంచి ఫోన్‌ చేస్తున్నా, నంబర్‌ మాత్రం భారత్‌ కోడ్‌తోనే ఉంటోంది. అయితే సైబర్​ నేరగాళ్లు మాట్లాడే భాషను బట్టి, వారు విదేశీయులని సులువుగా గుర్తించవచ్చు. అలాంటి మోసపూరిత కాల్స్‌ గురించి ‘రిపోర్ట్‌ ఇన్‌కమింగ్‌ ఇంటర్నేషనల్‌ కాల్‌ విత్‌ ఇండియన్‌ నంబర్‌(రిక్‌విన్‌)’ ఫీచర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దీనితో సదరు నంబర్లపై డీవోటీ నిఘా ఉంచుతుంది.

వాట్సాప్​, ఇన్​స్టా యూజర్ల కోసం - మెటా​ న్యూ AI అసిస్టెంట్ - ఏం అడిగినా క్షణాల్లో రిప్లై! - WhatsApp AI Features

మంచి ఇయర్​ఫోన్స్ కొనాలా? రూ.1000 బడ్జెట్లోని టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Earphones

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.