ETV Bharat / state

జగన్​ సభకు రాను - టీడీపీ సానుభూతిపరుడిపై వైసీపీ నేతల దాడి - Ycp Leaders Attacks

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 4:48 PM IST

Updated : Apr 10, 2024, 4:59 PM IST

YCP Leaders Attacked a Person for not Coming to Jagan Meeting: సీఎం జగన్ సిద్ధం సభకు రానందుకు ఓ వ్యక్తిపై వైసీపీ నాయకులు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని టీడీపీ నేతలు పరామర్శించి దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ycp_leaders_attacks
ycp_leaders_attacks

YCP Leaders Attacked on Person for not Coming to Jagan Meeting: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినా వైసీపీ నేతల దాడులు ఆగట్లేదు. సీఎం జగన్ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభకు రావాలని వైసీపీ నేతల దౌర్జన్యం చేస్తున్నారు. సభకు రాలేనని చెప్పినందుకు వైసీపీ నేతలు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు.

పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఆచ్చమ్మకుంట తండాలో టీడీపీ సానుభూతిపరునిపై వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచారు. గ్రామానికి చెందిన బానవత్ ఛత్రియా నాయక్ వద్దకు అదే గ్రామానికి చెందిన సమీప బంధువు, వైసీపీకి చెందిన వాలంటీర్ రమేష్ నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ శరవన్ నాయక్, నరేష్ నాయక్​లు పిడుగురాళ్లలో జరిగే సిద్ధం సభకు రావాలని అడిగారు. తాను ఏ పార్టీ కార్యక్రమాలకు రావటం లేదని చెప్పాడు. దీంతో మా పథకాలు తీసుకున్నావు కదా, ఎందుకు రావు అంటూ ఛత్రియా నాయక్​పై కర్రలతో దాడి చేసి గాయపరిచారు. గాయపడ్డ బాధితుడిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దాడి ఘటన తెలుసుకున్న టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

జగన్​ సభకు రాను - టీడీపీ సానుభూతిపరుడిపై వైసీపీ నేతల దాడి
Last Updated : Apr 10, 2024, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.