ETV Bharat / state

మహిళలు తమ లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలి: జస్టిస్‌ ఏవీ శేషసాయి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 7, 2024, 11:59 AM IST

Women Rights on Lawyers in Womens Day Celebrations
Women Rights on Lawyers in Womens Day Celebrations

Women Rights on Lawyers in Womens Day Celebrations: మహిళలను గౌరవించే సంస్థలు పురోగాభివృద్ధి చెందుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ శేషసాయి పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో మహిళల పాత్ర పెరిగిందని ఆయన గుర్తు చేశారు. మహిళలు అంతా తమ లక్ష్యాలను నిర్దేశించుకొని మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Women Rights on Lawyers in Womens Day Celebrations: మహిళలను గౌరవించే వ్యవస్థలు, సంస్థలు పురోభివృద్ధి చెందుతాయని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్‌ ఏవీ శేషసాయి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏపీ హైకోర్టు ప్రాంగణంలోని న్యాయవాదుల సంఘం హాలులో మహిళల హక్కులపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ ఏవీ శేషసాయి హాజరయ్యారు. అన్ని రంగాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం సంతోషించాల్సిన విషయం అన్నారు. పని ప్రదేశంలో వారికి రక్షణ కల్పిస్తూ చట్టాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ ఆర్‌ రఘునందన్‌రావు, జస్టిస్‌ కె.మన్మథరావు, జస్టిస్‌ బీఎస్‌ భానుమతి, జస్టిస్‌ జ్యోతిర్మయి ప్రతాప ప్రసంగించారు. ఇటీవల న్యాయ వ్యవస్థలో మహిళల పాత్ర పెరిగిందని ఆయన గుర్తు చేశారు. మహిళలు అంతా తమ లక్ష్యాలను నిర్దేశించుకొని మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సభ్యులతో సహా పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

అంతర్జాతీయ మహిళ దినోత్సవం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు..

రాబోయే రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. స్వచ్చంద సేవా సంస్ధ రాస్‍ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్రీయ సేవా సంస్ధ చేపట్టిన కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శనీయమన్నారు. మహిళా సాధికారత సాధ్యం కావాలంటే సాంఘిక, ఆర్థిక, అధికారాల పంపిణీ జరగాలన్నారు. ప్రతి మహిళ ఖచ్చితంగా విద్యనుభ్యసించాలన్నారు. సమాజంలో కుటుంబ వ్యవస్థకు దిశానిర్దేశం చేసే మహిళలు అన్ని రంగాల్లోనూ ప్రగతి సాధించాలని అమరా ఆసుపత్రి ఎండీ డా.గౌరినేని రమాదేవి ఆకాంక్షించారు. అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ముందస్తు మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలు ఆర్థిక ప్రగతి సాధించడంతో పాటు ఆరోగ్య సంరక్షణకూ ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. మహిళల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను నివారించాలన్నారు.

విమానంలో గర్భిణికి డెలివరీ చేసిన పైలట్​- తల్లీబిడ్డ సేఫ్​

ఏలూరులో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా స్థానిక సురేశ్‌ చంద్ర బహుగుణ పాఠశాల ఆవరణలోని పోలీస్‌ కల్యాణ మండపంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమశాఖ, ఉమ్మడి జిల్లా ఏపీ ఎన్జీవో సంఘ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర చాలా కీలకమని జేసీ బి.లావణ్య వేణి అన్నారు. జడ్పీ ఛైర్‌ పర్సన్‌ ఘంటా పద్మశ్రీ, జేసీ లావణ్యవేణి, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ పూజ తదితరులను సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి : మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.