ETV Bharat / state

వేములవాడలో భక్తులకు తప్పని పాట్లు - ఆదాయం పెరిగిన చర్యలు తీసుకోని అధికారులు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 7:05 PM IST

Updated : Feb 11, 2024, 9:22 PM IST

Rajarajeshwara Swamy Temple Problems
Vemulawada Sri Rajarajeshwara Swamy

Vemulawada Temple Problems : దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రద్దీ అధికంగా ఉండటంతో ఆదాయం సైతం గణనీయంగా పెరుగుతోంది. కోడె మొక్కుల ఆదాయంతో సమానంగా ప్రసాద విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. అయితే ప్రసాదాల ద్వారా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉన్నా అధికారులు తగు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కోడె మొక్కుల ద్వారా కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా, కోడెలను మాత్రం అనుకున్న రీతిలో సంరక్షించ లేకపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వేములవాడలో భక్తులకు తప్పని పాట్లు - ఆదాయం పెరిగిన చర్యలు తీసుకొని అధికారులు

Vemulawada Temple Problems : వేములవాడ రాజన్న స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. సాధారణ రోజుల్లో కంటే అధికంగా ఇటీవల భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. సమ్మక్క సారక్క జాతర(Medaram Jatara 2024) సమీపిస్తుండటంతో ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో స్వామి వారి ఆలయంలో భక్తులకు లడ్డూ, పులిహోర, సిర అభిషేకం లడ్డూ అందుబాటులో ఉంచుతున్నారు.

సాధారణ రోజుల్లో 15 వేల నుంచి 20వేల లడ్డూలు, ఆది, సోమవారాల్లో 30 వేలు నుంచి 35000 వేలు, పులిహోర 200 కేజీలు విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం సమ్మక్క సారలమ్మ రద్దీ ఉండడంతో లడ్డూ 45 వేల నుంచి 50 వేలు, పులిహోర 500 నుంచి 600 కేజీలు విక్రయాలు జరుగుతున్నాయి. 100 గ్రాముల పరిమాణం ఉన్న లడ్డూ ధర రూ.20 కాగా, 250 గ్రాములు ఉన్న పులిహోర ధర రూ.15. ఈ క్రమంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు ప్రసాదాలు అందించడంలో ఇబ్బందులు ఉండకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

మహాశివరాత్రికి పది రోజుల ముందుగానే ప్రసాదాన్ని సిద్ధం చేయనున్నారు. సుమారు మూడు లక్షలకు పైగా లడ్డూలను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రసాదాల తయారీ వినియోగానికి అదనంగా మరో 20 మందిని నియమించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. కోడె మొక్కులకు వస్తున్న ఆదాయానికి ఇంచుమించుగా ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు.

Vemulawada Temple Devotees Problems : గత రెండేళ్లలో సుమారు రూ.16 కోట్ల నుంచి రూ.18 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. కానీ ప్రస్తుతం రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్ల ఆదాయం సమకూరనుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రసాదం లడ్డూలు తీసుకోవడానికి మాత్రం భక్తులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతున్నా వాటిపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదని భక్తులు వాపోతున్నారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా కౌంటర్లు ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

"ఎన్నో సంవత్సరాలుగా ఆదాయానికి సింహభాగమైనటువంటి కోడె మొక్కెలు ద్వారానే స్వామి వారికి ఏటా కొన్ని కోట్ల రూపాయలు సమకూరుతుంది. వాటి సంరక్షణ పట్ల మాత్రం ఆలయాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. వేసవికాలం సమీపిస్తోంది, అలానే వాటిని రేకుల షెడ్​లలో ఉంచి వాటి అనారోగ్యానికి కారణమవుతున్నారు. గోషాల ఫెడరేషన్ పేరుతో కొన్ని సంస్థలకు అప్పజెప్పినప్పటికీ అవి పక్కదారి పడుతూ, గతంలో చూసుకుంటే నాలుగు కోడెలు మృత్యువాత పడ్డాయి." - భక్తుడు

భద్రాద్రి రామయ్య ఆలయంలో వెండి వాకిలి - హర్షం వ్యక్తం చేస్తున్న భక్తులు

శ్రీ రాజరాజేశ్వర స్వామి(Vemulawada Temple) ఆలయంలో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులు స్వామి వారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులను చెల్లిస్తుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కోడె మొక్కులు ఉన్నాయి. భక్తులు స్వామి వారికి తమ కోరికలు తీరాలని, అలాగే కోరికలు తీరిన భక్తులు కోడెలను తీసుకువచ్చి గోళాలలో అప్పగిస్తారు. ఆలయంలో ఉన్నటువంటి కోడెలను స్వామివారికి మొక్కులు చెల్లిస్తుంటారు. రాజరాజేశ్వర స్వామి ఆలయానికి తిప్పాపూర్​తో పాటు కట్ట కింద గోశాళ ఉన్నాయి. కట్ట కింద ఉన్న గోశాలల్లోని కోడెలను షిప్టుల పద్ధతిలో ఆలయానికి తీసుకువెళ్లి భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు అందుబాటులో ఉంచుతుంటారు.

Vemulawada Temple Facilities : అంతేకాకుండా భక్తులు తీసుకువచ్చిన కోడెలు ఆలయం నుంచి తిప్పాపూర్​ గోశాలకు తరలిస్తుంటారు. కట్ట కింద గోశాలలో సుమారు 150 వరకు కోడెలు, తిప్పాపూర్​ గోశాలలో 450 కోడెలు,96 ఆవులు ఉన్నాయి. రెండు గోశాలలు కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు అసౌకర్యాల మధ్య కోడెలు ఉంటున్నాయి. వేసవికాలంలో ఎండ తీవ్రతను తట్టుకోవడం ఇబ్బందిగా మారుతోంది. కోడెలకు తౌడు, పల్లి సోయా, పచ్చిగడ్డి, పల్లి పెసర, జనుమ మేతగా అందిస్తున్నారు. ఒక్కో షెడ్​లో 50 నుంచి 60 కోడెలను ఉంచుతున్నారు. సుమారు 600 కోడెలను పర్యవేక్షించేందుకు 18 మంది సిబ్బంది మాత్రమే ఉండడంతో ఇబ్బందిగా మారింది.

ఆలయానికి వచ్చే ఆదాయంలో సింహ భాగం కోడె మొక్కుల చెల్లింపుల ద్వారానే సమకూరుతోంది. ఏడాదికి సుమారుగా రూ.20 కోట్లకు పైగా ఆదాయం కోడె మొక్కుల చెల్లింపుల ద్వారానే వస్తుంది. అలాంటి కోడెల సంరక్షణకు చర్యలు నామ మాత్రంగా చేపడుతున్నారని భక్తులు ఆరోపణలు వస్తున్నాయి. పర్యవేక్షణ కొరవడి కోడెలు బక్క చిక్కడం, ఇతర వ్యాధులు సోకి మృత్యువాత పడుతున్న ఘటనలు ఉన్నాయని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కోడెల సంరక్షణకు అధునాతన షెడ్డులు నిర్మించడంతో పాటు పూర్తిస్థాయి వెటర్నరీ వైద్యుడిని అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ విషయంలో ఆలయ అధికారులు తగిన చర్యలు తీసుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయని పలువురు సూచిస్తున్నారు.

రాజన్న సన్నిధిలో ముస్లిం భక్తుడు.. ప్రతి యేటా కోడె మొక్కులు

వేములవాడ రాజన్న సన్నిధిలో భక్తుల నిరసన - వసతి గదులపై జీఎస్టీ రద్దుకు బీజేపీ నాయకుల డిమాండ్‌

Last Updated :Feb 11, 2024, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.