Unknown Person Through Slipper on Jagan Bus Yatra Public Meeting : అనంతపురం జిల్లా గుత్తిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం యాత్రలో బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరారు. పూర్తి వివరాల్లోకి వెళితే, కర్నూలు జిల్లాలో పర్యటన ముగించుకొని అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుత్తిలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. గుత్తి బస్టాండు సమీపంలో బస్సుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు బస్సుపైకి చెప్పును విసిరారు. అది జగన్ పక్కన ఉన్న మరో బస్సుపై పడింది. ఇది ఎవరు విసిరారనేది ఇంకా నిర్దారణ కాలేదు.
ఆరున్నరేళ్ల తర్వాత మళ్లీ - జగన్ బస్సుయాత్రపై ప్రజల ఆగ్రహం
CM Jagan Bus Yatra in Anantapur District : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుత్తిలో పర్యటించిన జగన్‌కి వచ్చిన ఆదరణ, అధికారంలోకి వచ్చినప్పుడు లభించలేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాస్త తుస్సు యాత్రగా మారింది. గుత్తి పట్టణానికి ఉదయం 10:30 గంటలకు వస్తాడని పార్టీ నేతలు ప్రకటించారు. కానీ, సీఎం జగన్ సాయంకాలం నాలుగు గంటలకు అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గుత్తి పట్టణానికి చేరుకున్నారు. ఉదయం నుంచి వైసీపీ పార్టీ శ్రేణులు జగన్ కోసం మండుటెండలో ఎదురు చూశారు. చివరికి అసహనంతో చాలామంది వైఎస్సార్సీపీ శ్రేణులు జగన్ రాక ముందే వెనుదిరిగారు. చాలామంది వైసీపీ శ్రేణులు ఆయన మాట్లాడతారని ఎదురు చూశారు. కానీ జగన్ బస్సు మీద నుంచి అభివాదం చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్పీపీ కార్యకర్తలు నిరాశతో వెనుదిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
జగన్ మోహన్ రెడ్డి పర్యటనతో గుత్తి పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని కర్నూలు జిల్లా రైతులు ముఖ్యమంత్రి జగన్‌ను వేడుకున్నారు. తుగ్గలిలో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో తుగ్గలి, పత్తికొండ మండలాల రైతులు పాల్గొన్నారు. రాతన చెరువుకు నీరు ఇవ్వాలని, తుగ్గలి మండలాన్ని కరవు మండలంగా ప్రకటించాలని రైతులు కోరారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రైతు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
నిరసనలు, ఆందోళనలతో జగన్ బస్సు యాత్ర! సభకు వచ్చిన వారికి డబ్బులు- వీడియోకు చిక్కిన వైసీపీ నేతలు