ETV Bharat / state

ప్రయాణికులకు TSRTC బంపరాఫర్ - రూ.20తో డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు! - TSRTC Latest Offer

author img

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 9:55 AM IST

TSRTC Latest Offer : ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్న తెలంగాణ ఆర్టీసీ.. తాజాగా మరో సూపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్​తో ఎక్స్​ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ ఉన్నవారు.. డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

TSRTC Latest Offer
TSRTC Good News for Passengers (ETV Bharat)

TSRTC Good News for Passengers : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షించే టీఎస్​ఆర్టీసీ.. తాజాగా మరో బంపరాఫర్ ప్రకటించింది. ఇది ఎక్స్​ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ తీసుకునే వారికి సూపర్ న్యూస్ చెప్పుకోవచ్చు. అదేంటంటే.. ఎక్స్​ప్రెస్ MST పాస్ ఉన్నవారు ఇకపై డీలక్స్ బస్సుల్లో కూడా ప్రయాణించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు టీఎస్​ఆర్టీసీ(TSRTC) ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్​లో పేర్కొన్నారు. అయితే, ఇందుకోసం మళ్లీ సపరేట్​గా ఏదైనా టికెట్ తీసుకోవాలా? లేదంటే ఎక్స్​ప్రెస్ MST పాస్ సరిపోతుందా? ఎంత దూరం వరకు ప్రయాణించవచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచి వీసీ సజ్జనార్.. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు ప్రతీసారి ఏదొక సరికొత్త ఆఫర్​ను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్​లో ఎక్స్​ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ ఉన్న ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. MST పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకొని డీలక్స్ బస్సులోనూ ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. ఈ ఆఫర్ ఎక్స్​ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. కాబట్టి ఎంఎస్​టీ పాస్ ఉన్న ప్రయాణికులు ఈ కాంబినేషన్ టికెట్ ఫెసిలిటీని సద్వినియోగం చేసుకొని డీలక్స్ బస్సులో ప్రయాణించాలని సజ్జనార్ సూచించారు.

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేవారికి శుభవార్త! - టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం! - Hyderabad to Vijayawada Buses

ఈ కాంబినేషన్ టికెట్​తో డీలక్స్ బస్సుల్లో ఎంత దూరం ప్రయాణించవచ్చంటే.. రాష్ట్రంలో 100 కిలోమీటర్ల పరిధి వరకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చు. అలాగే ఈ ఆఫర్ రాష్ట్రమంతా ఉన్న డీలక్స్ బస్సులకు వర్తిస్తుంది. ఆర్టీసీ అందిస్తున్న ఈ ఆఫర్​ కోసం ఎక్స్​ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్(MST) పాస్ కావాలనుకునేవారు.. స్థానిక టీఎస్ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లకు వెళ్లి సంప్రదించాలని సజ్జనార్ ట్విటర్​లో పేర్కొన్నారు. ఇకపోతే.. టీఎస్​ఆర్టీసీ ప్రకటించిన ఈ సరికొత్త ఆఫర్ సమ్మర్ వరకే ఉంటుందా? లేదంటే ఆ తర్వాత కూడా కొనసాగుతుందా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మహాలక్ష్మి పథకానికి క్రేజీ రెస్పాన్స్ - స్కీమ్ ఓకే కానీ బస్సులు పెంచాలంటున్న మహిళలు - Mahalakshmi Scheme In Telangana

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.