టీఎస్​ ఐసెట్​ షెడ్యూల్​​ విడుదల- పరీక్ష తేదీ ఎప్పుడో తెలుసా?

author img

By ETV Bharat Telangana Desk

Published : Feb 10, 2024, 6:37 PM IST

Updated : Feb 10, 2024, 7:36 PM IST

TS ICET Notification 2024

TS ICET Notification 2024 : ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి ఐసెట్​ నోటిఫికేషన్​ 2024 షెడ్యూల్​ విడుదల తేదీలను ప్రకటించింది. మార్చి 5న నోటిఫికేషన్​ రిలీజ్ చేయనుంది. మార్చి 7 నుంచి ఏప్రిల్​ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్​ 4,5 తేదీల్లో ఐసెట్​ పరీక్షలు నిర్వహించనున్నారు.

TS ICET Notification 2024 : రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్​లను విద్యా మండలి ఒక్కొక్కటిగా విడుదల చేస్తుంది. ఇప్పటికే ఈఏపీసెట్​​, లాసెట్​ విడుదలవ్వగా తాజాగా ఐసెట్​ షెడ్యూల్​ని రిలీజ్​ చేసింది. ఎంబీఏ(MBA), ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్​ను మార్చి 5న విడుదల చేయనున్నట్లు ఐసెట్​ కన్వీనర్​ ప్రోఫెసర్​ తాటికొండ రమేశ్​ వెల్లడించారు. మార్చి 7 నుంచి ఏప్రిల్​ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసం రూ.250తో మే 17 వరకు, రూ.500తో మే 27వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్​ 4, 5 తేదీల్లో ఆన్​లైన్​లో ఐసెట్​ పరీక్షలు(I CET Exam Date) జరగనున్నాయి. ఈ ప్రవేశ పరీక్షకు డిగ్రీ చదివిన విద్యార్థులు అర్హులు.

టీఎస్ ఈఏపీసెట్​గా మారిన ఎంసెట్, మే 9 నుంచి ప్రవేశపరీక్షలు

ఐసెట్​-2024 షెడ్యూల్​ వివరాలు :

క్రమ సంఖ్య అంశం ముఖ్యమైన తేదీలు
1 నోటిఫికేషన్​ విడుదల మార్చి 5
2 దరఖాస్తుల స్వీకరణ(ఆలస్య రుసం లేకుండా) మార్చి 7 నుంచి ఏప్రిల్​ 30
3 ఆలస్య రుసం రూ.250తో దరఖాస్తు స్వీకరణ మే 17
4 ఆలస్య రుసం రూ.500తో దరఖాస్తు స్వీకరణ మే 27
5 పరీక్ష జూన్​ 4, 5

TS I SET Notification Schedule 2024 : టీఎస్ ఐసెట్​ నోటిఫికేషన్​(I CET Notification) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయిన అనంతరం tsicet.nic.in వెబ్​సైట్​లోకి వెళ్లి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఐసెట్​ అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు అప్లికేషన్​ నింపే ప్రక్రియలో కొన్ని దశలు ఉంటాయి. ముందుగా అభ్యర్థి ప్రాథమిక వివరాలు ఇచ్చి పరీక్ష ఫీజు చెల్లించాలి. అనంతరం లాంగిన్​ ఐడీ, పాస్వర్డ్​ వస్తోంది. వాటితో అప్లికేషన్​ నింపాల్సి ఉంటుంది. ఇప్పటికే టీఎస్​ ఈఏపీసెట్​ మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్, 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. మే 6న ఈసెట్, మే 23న టీఎస్ ఎడ్​సెట్, జూన్ 3న లాసెట్, పీజీఎల్ సెట్​ పరీక్షలు నిర్వహించనున్నట్టు విద్యామండలి తెలిపింది.

Engineering Seats in Telangana 2023 : రాష్ట్రంలో మిగిలిపోయిన ఇంజినీరింగ్‌ సీట్లు 16,926

జూన్‌లో ఎంసెట్‌, ఈసెట్‌ మాత్రమే.. మిగిలిన ప్రవేశ పరీక్షలు జులైలోనే..

Last Updated :Feb 10, 2024, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.