ETV Bharat / state

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మాతృ వియోగం - సంతాపం తెలిపిన చంద్రబాబు - Atchannaidu Mother Passed Away

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 31, 2024, 3:21 PM IST

Updated : Mar 31, 2024, 5:11 PM IST

Atchannaidu Mother Kalavathamma Passed Away : టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మాతృ వియోగం కలిగింది. టెక్కలిలో అనారోగ్యంతో అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ (90) మృతి చెందారు.

Atchannaidu Mother Kalavathamma Passed Away
Atchannaidu Mother Kalavathamma Passed Away

Atchannaidu Mother Kalavathamma Passed Away : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు మాతృ వియోగం కలిగింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అనారోగ్యంతో తల్లి కింజరాపు కళావతమ్మ (90) మృతి చెందారు. కింజరాపు కుంటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్, పార్టీ నేతలు సంతాపం ప్రకటించారు. కళావతమ్మకు ఏడుగురు సంతానం. అందులో ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు. ఎర్రన్నాయుడు, హరివరప్రసాద్, ప్రభాకర్, అచ్చెన్నాయుడు.

టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు మాతృ వియోగం - సంతాపం తెలిపిన చంద్రబాబు
Last Updated : Mar 31, 2024, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.