ETV Bharat / state

ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు బదిలీలకు కారణం ఏమిటి? - ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 7:43 PM IST

TDP Kinjarapu Atchannaidu letter
TDP Kinjarapu Atchannaidu letter

TDP Kinjarapu Atchannaidu letter to AP CEO: చిత్తూరు జిల్లాలో పోలీసుల బదిలీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. అధికారులు, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఇచ్చారని, ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు బదిలీలకు కారణం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ ప్రేరేపితమైన బదిలీలను వెంటనే రద్దు చేయాలని కోరారు.

TDP Kinjarapu Atchannaidu letter to AP CEO: చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 14, 2024 న చిత్తూరు జిల్లా ఎస్పీ కొంతమంది పోలీస్ అధికారులను, కానిస్టేబుళ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.

ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో చివరి నిమిషంలో చేసిన ఈ బదిలీలకు కారణం ఏమిటని ప్రశ్నించారు. పోలీసు అధికారులు, కానిస్టేబుళ్ల నుంచి ఎటువంటి బదిలీ వినతులు కోరకపోయినా బదిలీ చేయాల్సిన అవసరం ఏంటి అని నిలదీశారు. రాజకీయ ప్రేరేపితమైన ఈ బదిలీలను వెంటనే రద్దు చేయలని డిమాండ్ చేశారు.

సున్నితమైన పోలింగ్ బూత్‌ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి: అచ్చెన్నాయుడు

TDP Leader MA Shariff Letter to SEC: టీడీపీ సీనియర్ నేత ఎం.ఏ షరిఫ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. కనిగిరి అసెంబ్లీలోని పామర్రు, సి.ఎస్ పురం, పిసీ పల్లి మండలాల్లో వైసీపీ కో-ఆర్డినేటర్ డి.నారాయణ యాదవ్ వాలంటీలర్లకు 5 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేశారని ఎం.ఏ షరిఫ్‌ ఆరోపించారు. చీరాల అసెంబ్లీలో వైసీపీ కో-ఆర్డినేటర్ కరణం వెంకటేష్ వాలంటీర్లకు దుస్తులు, నగదు పంపిణీ చేశారన్నారు. కాకినాడ ఎమ్మెల్యే కాకినాడలోని డి.కన్వెన్షన్ హాలులో సమావేశం ఏర్పాటు చేసి చీరలు పంపిణీ చేశారన్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి దేవాలయాలకు, మసీదులకు, చర్చిలకు మైక్ సెట్లు పంపిణీ చేశారని తెలిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గిప్టులు పంపిణీ చేస్తూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత కాకర వెంకట్రామిరెడ్డి అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ఎం.ఏ.షరీఫ్‌ రాశారు. గతంలోనూ వెంకట్రామిరెడ్డిపై వారికి ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు.

జగన్​ను రాష్ట్రం నుంచి పంపించేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారు: అచ్చెన్నాయుడు

ఈ నెల 14వ తేదీన సచివాలయ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేసి వైసీపీకు ఓట్లేయాలని ప్రచారం చేశారని పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డిపై సిసిఏ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కందుకూరు అసెంబ్లీలో మండల పరిషత్ అధికారులు వాలంటీర్లకు వైసీపీ, టీడీపీ మద్దతుదారుల ఓటర్ల లిస్ట్ తయారుచేయాలని ఆదేశించారని అన్నారు. గూడూరు, సూళ్లూరుపేటలో ప్రజామద్దతు పేరుతో వాలంటీర్లు అధికారపార్టీకి ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్య సురక్ష, నాడు-నేడుల పేరుతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ఆక్షేపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించకుండా తిరుపతి, నెల్లూరు జిల్లా డీఈఓలకు, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని షరీఫ్‌ సీఎస్‌ను కోరారు.

మేదరమెట్ల సభలోనూ జగన్ అబద్ధాలు- హామీలు నిలబెట్టుకున్నానని కహానీలు: అచ్చెన్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.