ETV Bharat / state

"రాజధాని లేని రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధాని చేశారు"

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 9:19 PM IST

Updated : Feb 28, 2024, 9:47 PM IST

TDP- Janasena Leaders Comments on YCP Government: టీడీపీ- జనసేన కూటమిలో భాగంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభకు భారీ ఎత్తున టీడీపీ- జనసేన కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్​లు కృష్ణార్జునుల్లా అభినవ కౌరవులైన వైసీపీ అభ్యర్థులను ఎన్నికల సంగ్రామంలో తుదముట్టిస్తారని పలువురు నేతలు అన్నారు.

TDP- Janasena Leaders Comments on YCP Government
TDP- Janasena Leaders Comments on YCP Government

TDP- Janasena Leaders Comments on YCP Government: సీఎం జగన్​ను గద్దె దించేందుకు తెలుగుదేశం- జనసేనలతో జత కడుతున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వెల్లడించారు. కూటమి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్​లు కృష్ణార్జునుల్లా, అభినవ కౌరవులైన వైసీపీ అభ్యర్థులైన 151మందిని ఎన్నికల సంగ్రామంలో తుదముట్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం- జనసేన కూటమి కలిసికట్టుగా తొలిసారి ఏర్పాటు చేసిన ప్రచార సమరశంఖం సభకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మూడు రాజధానులని చెప్పి వాటి అడ్రస్సే లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని చరిత్ర పుటల్లో కలిసే సమయం వచ్చిందని ఆయన అన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధాని చేశారని రఘరామ ఎద్దేవా చేశారు.

సభా వేదికపై చంద్రబాబు, పవన్‌ - పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం

Balakrishna: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, ఇందుకు ప్రజలంతా సిద్ధమని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలే అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బడుగు బలహీన వర్గాలను అధికార పీఠం పైకి ఎక్కించారని బాలకృష్ణ అన్నారు. వైసీపీ చేస్తున్న నాటకాలను ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని బాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని బాలకృష్ణ కోరారు.

ఇక సీఎం జగన్​కు మిగిలింది 30 రోజులే: బాలకోటయ్య

Achchennaidu: సిద్ధమా అని రోడ్డెక్కిన వ్యక్తిని యుద్ధం చేసి ఓడించేందుకు తాడేపల్లిగూడెం వేదిక తొలి అడుగు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ' జెండా ' సభ సందర్భంగా సీఎం జగన్​ మోహన్​ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నామని పేర్కొన్నారు. జనంలో పుట్టినటువంటి టీడీపీ-జనసేన పొత్తు రాష్ట్రంలో చరిత్రను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రజల కోసమే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నామని ఆయన సృష్టం చేశారు. కార్మికుడి నుంచి పారిశ్రామికవేత్త వరకు టీడీపీ - జనసేన పొత్తు కోరుకుంటున్నారని అచ్చెన్నాయుడు తెలియజేశారు. జగన్​ పాలనలో మోసపోయిన రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలు కోరుకున్న పొత్తు అని పేర్కొన్నారు. రెండు పార్టీలు కలిసి పని చేస్తే 160 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

దుర్మార్గ పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి: రఘురామకృష్ణ రాజు

Konatala Ramakrishna: వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు, పవన్‌ విజయఢంకా మోగిస్తారని జనసేన నేత కొణతల రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే తెలుగుదేశం- జనసేన వల్లే సాధ్యం అవుతుందన్నారు. చంద్రబాబు, పవన్‌ కలయిక త్రివేణి సంగ్రమంలా ఉందని కొణతల కొనియాడారు. సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం అంటే ఏమిటో చూపిస్తామని రామకృష్ణ అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైందని రామకృష్ణ విమర్శించాారు. రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే టీడీపీ-జనసేన వల్లే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ విజయవంతం చేస్తాం: టీడీపీ

Janasena Leader Nayakar: వైసీపీ మరోసారి వస్తే పొట్ట చేతిలో పట్టుకుని వలస వెళ్లే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు వస్తుందని జనసేన నేత బొమ్మిడి నాయకర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను నాశనం చేసిన ఘనత సీఎం జగన్‌దే అని నాయకర్‌ విమర్శించారు.

Former Chairman Sharif: టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల గెలుపునకు అహర్నిశలు కృషి చేయాలని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్​ అన్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతుందని పేర్కొన్నారు. వైసీపీ వచ్చాక రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని షరీఫ్‌ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల బతుకులు రోడ్డునపడ్డాయి కావున వైసీపీ దుష్ట పాలన అంతానికి అందరూ సైనికుల్లా పనిచేయాలని విన్నవించారు. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన జెండా సభకు సర్వం సిద్ధం- 5లక్షల మంది రావొచ్చని అంచనా

Last Updated : Feb 28, 2024, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.