ETV Bharat / state

అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలకు అనువైన వాతావరణం తీసుకువస్తాం: భరత్​ - Industrial Association Meeting

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 26, 2024, 1:20 PM IST

Small Scale Industrial Welfare Association Meeting at Autonagar : స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమాన్యాల సమావేశానికి ముఖ్య అతిథిగా విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ హాజరయ్యారు. విశాఖ అభివృద్ధికి పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను వైఎస్సార్సీపీ వెనక్కి పంపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పరిశ్రమలకు అనువైన వాతావరణం తీసుకువస్తామని భరత్ హామీ ఇచ్చారు.

Small_Scale_Industrial_Welfare_Association_Meeting_at_Autonagar
Small_Scale_Industrial_Welfare_Association_Meeting_at_Autonagar

Small Scale Industrial Welfare Association Meeting at Autonagar : విశాఖ ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమాన్యాలు ఆత్మీయ సమావేశం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కూటమి అభ్యర్థి భరత్ పాల్గొన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన సూచనలను యజమానులను అడిగి తెలుసుకున్నారు. యువతకు లక్ష ఉద్యోగాల కల్పనకు యాజమాన్యాలు సహకారం అందించాలని భరత్ కోరారు. దీనికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

పరిశ్రమలు రాకుండా జగన్ సర్కార్ అడ్డుకుంది : వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారిశ్రామిక రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా జగన్ అడ్డుకున్నారని ఉన్న పరిశ్రమలను రాష్ట్రం నుంచి బయటకు పంపేలా కుట్రలు చేశారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఉద్యోగులు, కార్మికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలకు అనువైన వాతావరణం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

paritala sunitha: "సత్తా ఉంటే పరిశ్రమను వెనక్కి తీసుకురావాలి"

విశాఖ కేంద్రంగా ఉద్యోగాల కల్పనకు సహాయం : విశాఖలో పారిశ్రామిక అభివృద్దికి తీసుకోవల్సిన సూచనలు, సలహాలను పారిశ్రామికవేత్తలను భరత్ అడిగి తెలుసుకున్నారు. విశాఖ కేంద్రంగా లక్ష ఉద్యోగల కల్పనకు పరిశ్రమల యాజమాన్యాలు సహకారం అందించాలని భరత్ కోరారు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని చక్కదిద్దేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమల యాజమాన్యాలు సహకరించాలని అభ్యర్థించారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే పరిశ్రమలకు అనువైన వాతావరణం తీసుకువస్తాం: భరత్​

'వైకాపా నాయకుల బెదిరింపుల వల్లే పరిశ్రమలు వెనక్కి పోతున్నాయి'

పారిశ్రామిక రంగానికి అనువైన వాతావరణం తీసుకువస్తాం : ప్రస్తుతం విశాఖ పారిశ్రామిక రంగంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ సామర్ద్యాన్ని పెంచుకుని 75 వేల కోట్ల టర్నోవర్ సాధించేలా కృషి చేయాలని భరత్ విజ్ఞప్తి చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాజువాక టీడీపీ అభ్యర్ది పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. విశాఖలో పారిశ్రామిక రంగం అభివృద్దికి అనువైన వాతావరణాన్ని తిరిగి తీసుకువస్తామని పేర్కొన్నారు. జగన్‌ ఈ ఐదేళ్ల పాలనలో పారిశ్రామిక విధ్వంసం తప్ప ప్రగతి అన్నది ఎటుచూసినా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి కాదు రెండు కాదు అనేక పెద్ద, చిన్న పరిశ్రమలు ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలను పూర్తిగా మూసేసి వెళ్లిపోయాయని మండిపడ్డారు. గాజువాక పారిశ్రామిక వాడలో ఉన్న సమస్యలను తక్షణం పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. సమావేశంలో చిన్న, మధ్య పరిశ్రమల సంఘం అధ్యక్ష కార్యదర్శులు, పరిశ్రమల యాజమాన్యాలు, ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు.

జగన్‌ రాకతో పరిశ్రమలు పరార్‌ - ఐదేళ్ల పాలనలో విధ్వంసం తప్ప, కంటికి కానరాని ప్రగతి - NO Industrial Growth Under YCP GOVT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.