₹3.5 Lakhs Robbery in Srikakulam District : స్కూటరు డిక్కీ నుంచి రూ.3.5 లక్షలు చోరీకి గురైన ఘటన మండల పరిధి దాసన్నపేటలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం దాసన్న పేటకు చెందిన సింగంశెట్టి లింగమూర్తి దినవారీ బజారుమెట్ల వద్ద బియ్యం వ్యాపారం చేస్తున్నారు. తన ఇంటి సమీపంలోని యూనియన్ బ్యాంకు నుంచి రూ.4 లక్షలు తీసుకున్నారు. అనంతరం ఆ మొత్తాన్ని తన ద్విచక్ర వాహనం డిక్కీలో పెట్టారు. బజారు కూడలి రథంవీధి లోని ఓ దుకాణం వద్ద కొన్ని నిమిషాలు వాహనం నిలపి తిరిగి వచ్చి చూసే సరికి డిక్కీలో ఉంచిన డబ్బులో రూ.3.5 లక్షలు లేనట్లు గుర్తించారు.
మరో రూ.50 వేలు ఓ మూలకు చేరి ఉండటంతో చోరీకి పాల్పడిన వ్యక్తి వదిలేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అందు బాటులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా దాదాపు పదేళ్ల వయసున్న ఓ బాలుడు వాహనం నుంచి డబ్బు తీసి మరో వ్యక్తితో ఒడిశా వైపు వెళ్లినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై ఫిర్యాదును అందుకున్న పట్టణ ఎస్సై వి. సత్యనారాయణ ఘటనా స్థలాన్ని, సీసీ ఫుటే జీలను పరిశీలించారు. బ్యాంకు నుంచే దుండగులు వెంబడించి ఉంటారని అనుమానం వ్యక్తం చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు.
Gold Theft in Nellore : పొట్టకూటికోసం రోజు ఓ వ్యక్తికూలీగా బంగారు దుకాణంలో ఓ వ్యక్తి చేరాడు. రోజూ వారి కూలీని అనే విషయం మర్చిపోయి జల్సాల మరిగి స్థోమతకు మించి అప్పులు చేశాడు. అప్పు చేస్తే సరిపోతుందా తీసుకున్నది తిరిగి చెల్లించాలి కదా. అది ఈ వ్యక్తి వల్ల కాలేదు. చేసిన అప్పులు తీర్చటం కోసం దొంగతనాలకు పాల్పడ్డాడు. బంగారు దుకాణంలో పనిచేసేవాడు కనుక స్థానిక బంగారు వ్యాపారుల సమాచారం పక్కగా ఉంది. దీంతో వ్యాపారులను టార్గెట్ చేసి ముఠాగా ఏర్పడి వరుస చోరీలకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. అనుకున్నట్లే పథకాన్ని అమలు చేశాడు. కానీ నేరం చేసినవారు ఏదో సాక్ష్యం వదలకుండా ఉంటారా. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.
కళ్లలో కారం కొట్టి డబ్బు అపహరించిన దుండగులు - సీన్ రక్తి కట్టించినా పట్టేసిన పోలీసులు