ఎన్నికల కోడ్​ పేరుతో రాత్రికి రాత్రే రోడ్డును తవ్వారు - కానీ కొత్తది వేయడం మరిచారు

author img

By ETV Bharat Telangana Desk

Published : Feb 8, 2024, 2:47 PM IST

Road Problems

Road Problems Bommakal Village in Karimnagar : ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు ఓటర్లను ఆకర్షించడానికి అరచేతిలో వైకుంఠం చూపుతారు. అచ్చం అలాగే కరీంనగర్‌లోను అదే పని జరిగింది. గ్రామపంచాయతీ పరిధిలోని ప్రాంతాన్ని స్మార్ట్‌సిటీ నిధులతో రహదారి నిర్మిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే కాకుండా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తోందని పనులకు శంకుస్థాపన చేసి రాత్రికి రాత్రే రోడ్డును తవ్వి కంకర పోశారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. రోడ్డు తవ్వి మూడునెలలు గడిచినా నిర్మాణ పనులు చేపట్టలేదు. ఇప్పుడు ఆ రహదారిపై నిత్యం ప్రయాణించేవారు నానా అవస్థలు పడుతున్నారు.

Road Problems Bommakal Village in Karimnagar : కరీంనగర్‌లోని బొమ్మకల్‌ గ్రామపంచాయతీ రజ్వీచమన్‌, సిటిజన్ కాలనీలతో పాటు చాలా ప్రాంతాలు కరీంనగర్‌లో కలిసే ఉంటాయి. ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్‌ స్మార్ట్‌సిటీ నిధులతో రహదారి నిర్మిస్తామని రాత్రికి రాత్రి పాత రోడ్డు తవ్వి కంకర వేశారు. తర్వాత పనులు నిలిపివేశారు. కొత్త రోడ్డు వేసేందుకు నాలుగు నుంచి ఐదు ఫీట్ల వరకు రోడ్డు తవ్వడంతో ఆ ప్రాంతంలో ఇళ్లకు మెట్లు లేకుండా పోయాయి. ఇంటి నుంచి కిందికి దిగాలన్న ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఆ దారి.. 'నరక' రహదారి.. రెండేళ్లలో పూర్తి కావాల్సింది.. ఆరేళ్లయినా..!

Bommakal Village Road Construction Works Delayed : దాదాపు మూడు నెలలుగా ఇదే దుస్థితి నెలకొంది. అక్కడ ప్రజలు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రభుత్వం మారడంతో నగరపాలక సంస్థ తమ పరిధిలోకి రాదని అంటున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామపంచాయతీలో సంప్రదిస్తే అక్కడ రోడ్డు (Road Problems)వేస్తున్నట్లు కనీసం తమకు సమాచారం లేదని చెబుతున్నారని వారు వాపోతున్నారు.

"రోడ్డు వేస్తామని ఇళ్ల ముందు ఉన్న మెట్లను తవ్వేశారు. ఎన్నికలు వస్తున్నాయని రోడ్డు నిర్మాణం చేపడుతామని చెప్పారు. ఇంటి నుంచి కిందికి దిగాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజావాణి కార్యక్రమంలోను జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. అయినా ఇంత వరకూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం." - కాలనీవాసులు

వాస్తవానికి స్మార్ట్‌ సిటీ నిధులతో అభివృద్ది పనులు కేవలం కరీంనగర్ నగర పరిధిలోనే వెచ్చించాల్సి ఉంటుంది. ఒక వేళ గ్రామపంచాయతీ పరిధిలో ఆ నిధులు వెచ్చించాలంటే మొదట ఆయా గ్రామపంచాయతీలకు సమాచారం అందించాల్సి ఉంటుంది. అయితే బొమ్మకల్ గ్రామపంచాయతీకి ఎలాంటి సమాచారం లేకుండా రజ్విచమన్‌, సిటిజన్ కాలనీలో దాదాపు రూ.50లక్షలతో రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాత్రికి రాత్రి రోడ్డు తవ్వడం కంకర పోయడం జరిగిపోయింది. ఆ తర్వాత పనులు మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు.

road works stopped: అందుకోసమేనా రహదారి..? పనులను అడ్డుకున్న గ్రామస్థులు

ప్రభుత్వం మారడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీనితో కనీసం కాలినడక కూడా సవ్యంగా సాగే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటి నుంచి కిందికి బయటికి అడుగు పెట్టాలంటేనే ఒకరి సహాయం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మురుగు కాల్వల నిర్మాణం లేదు. ఇళ్లలోకి వెళ్లడానికి మెట్లు లేవు. ప్రస్తుతం సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపధ్యంలో అధికారులు రోడ్డు నిర్మాణ పనులపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Road Problems in Karimnagar : రహదారిపై నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డుపై వచ్చే దుమ్ముతో అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పదించి రోడ్డు నిర్మాణం (Road Construction Works) చేపట్టి తమ సమస్య పరిష్కరించాలని కాలనీ వాసులు అధికారులను వేడుకుంటున్నారు.

ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజావాణి కార్యక్రమంలోను జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు

Mudugula Mallayya Thanda people's Problems : అభివృద్ధికి 7 కిలోమీటర్ల దూరం @ మడుగుల మల్లయ్య తండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.