ఉపాధి కోసం సరిహద్దులు దాటి నగరానికి బంగ్లాదేశ్​ యువతి - వ్యభిచార కూపంలోకి దించిన దంపతులు, చివరికి!

author img

By ETV Bharat Telangana Desk

Published : Feb 11, 2024, 12:01 PM IST

Etv Bharat

Police Arrested a Bangladeshi Woman Prostitution Case : డబ్బు సంపాదన కోసం ఓ యువతి బంగ్లాదేశ్ ​నుంచి అక్రమంగా సరిహద్దులు దాటి నగరానికి చేరింది. అక్కడి నుంచి తనకు ఫోన్​లో పరిచయమైన దంపతుల ఇంటికి చేరుకుంది. వారు సదరు మహిళను వ్యభిచార కూపంలోకి దించి డబ్బులు గడించసాగారు. కానీ ఇంతలోనే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకోవడంతో ఈ బండారం అంతా బయటపడింది.

Police Arrested a Bangladeshi Woman Prostitution Case : డబ్బు సంపాదించాలనే ధ్యేయంతో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి అక్రమ మార్గంలో సుమారు రెండు నెలల కిందట భారత్‌లోకి అడుగుపెట్టింది. కోల్‌కతా నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు రైల్లో చేరుకుంది. అక్కడి నుంచి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన పాతబస్తీలోని చాంద్రాయణగుట్టలో నివసించే దంపతుల వద్దకు చేరింది. వారు ఆ యువతితో వ్యభిచారం చేయిస్తూ డబ్బులు ఆర్జించసాగారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆ మహిళ వారికి చెప్పాపెట్టకుండా అత్తాపూర్‌లోని ఓ కస్టమర్‌ వద్దకు వెళ్లేందుకు బయల్దేరింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆ దంపతులు, ఆమెను వెంబడించి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Prostitution With Bangladeshi Girl in Hyderabad : ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాతబస్తీ చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్‌ కాలనీలో షేక్‌ సోనియా(27), మహ్మద్‌ సల్మాన్‌(24) దంపతులు నివాసం ఉంటున్నారు. వస్త్ర దుకాణంలో పని చేసే మహ్మద్‌ సల్మాన్‌ షేక్‌ సోనియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆమె భారత్‌కు చెందిన వ్యక్తికి, బంగ్లాదేశ్‌కు చెందిన మహిళకు పుట్టిన సంతానం. దీంతో షేక్ సోనియాకు కోల్‌కతా నగరంతో మంచి సంబంధాలు ఉన్నాయి.

Prostitution: 'ఆన్‌లైన్‌’ వ్యభిచారం.. బంగ్లాదేశ్ యువతి రిమాండ్

మయన్మార్‌, బంగ్లాదేశ్ దేశస్థులు పరస్పరం మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ఒక యాప్‌ ఉంది. ఈ యాప్‌లో షేక్‌ సోనియా చాటింగ్‌ చేస్తుండగా, బంగ్లాదేశ్‌ వొర్సిండి మండలం రాయ్‌పూర్‌ గ్రామానికి చెందిన స్రిస్టీ అక్తర్​తో (22) పరిచయం ఏర్పడింది. వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో హైదరాబాద్‌లో తనకు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం దొరుకుతుందా అని స్రిస్టీ అక్తర్‌ ఆమెను అడిగింది. ఇళ్లలో పని చేసే ఉద్యోగమైతే నెలకు రూ.10,000లు వస్తాయని, వ్యభిచార వృత్తిలోకి (Prostitution) వస్తే నెలకు రూ.20,000లు వస్తాయని షేక్‌ సోనియా ఆ యువతికి చెప్పింది. డబ్బు కోసం తాను ఏ పనైనా చేస్తానని స్రిస్టీ అక్తర్‌ తెలిపింది.

భారత్‌లోకి ఎలా ప్రవేశించాలని షేక్ సోనియాను స్రిస్టీ అక్తర్ అడిగింది. అందుకు షేక్ సోనియా ఆ యువతితో ఆ రిస్కు నీవే తీసుకోవాలని చెప్పింది. ఒక వేళ ఇక్కడికి వస్తే తనకు ఫోన్‌ చేయాలని సెల్​ఫోన్​ నంబరు ఇచ్చింది. రెండు నెలల క్రితం స్రిస్టీ అక్తర్‌ బంగ్లాదేశ్‌ సరిహద్దులు దాటి అక్రమ మార్గంలో కోల్‌కతాకు చేరుకుంది. అక్కడి నుంచి రైలులో నేరుగా సికింద్రాబాద్‌కు వచ్చి షేక్‌ సోనియాకు ఫోన్‌ చేసింది. దంపతులు వెళ్లి ఆమెను చాంద్రాయణగుట్టలోని తమ ఇంటికి తీసుకొచ్చారు. వారు ఆమెతో వ్యభిచారం చేయించడం మొదలుపెట్టారు.

Prostitution Cases in Telangana : శుక్రవారం రోజున షేక్‌ సోనియా పక్కింట్లోకి వెళ్లింది. ఆమె సెల్​ఫోన్​ ఆ సమయంలో స్రిస్టీ అక్తర్‌ వద్ద ఉంది. ఇంతలోనే ఆ ఫోన్​కు కాల్​ రాగా, సదరు యువతి లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఫోన్ చేసిన వ్యక్తి అత్తాపూర్‌లోని పిల్లర్‌ నంబరు 150 వద్దకు రావాలని చెప్పడంతో స్రిస్టీ అక్తర్ ఆటో ఎక్కి అక్కడికి వెళ్లింది. ఇంతలోనే ఇంటికి వచ్చిన షేక్‌ సోనియా తన మొబైల్ అక్కడే పడి ఉండడం, స్రిస్టీ అక్తర్‌ కనిపించకపోవడంతో అనుమానపడింది.

హోటల్ హయాత్​లో హైప్రొఫైల్ వ్యభిచారం.. విదేశీ యువతులు.. బడాబాబుల కోసమే!

ఆఖరులో తన ఫోన్​కు వచ్చిన నంబరుకు కాల్‌చేయగా అత్తాపూర్‌కు వస్తోందని తెలిసింది. వెంటనే దంపతులు వెంబడించగా, అత్తాపూర్‌లో స్రిస్టీ అక్తర్‌ కనిపించింది. తమకు చెప్పకుండా ఎందుకు వచ్చావని అడగడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే షేక్ సోనియా చేతిలోని సెల్​ఫోన్​ను లాక్కొని సదరు యువతి డయల్‌ 100కు ఫోన్ చేసింది. దీనిపై సమాచారం అందుకున్న అత్తాపూర్‌ ఏఎస్సై, మహిళా సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అసలు విషయం తెలుసుకొని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు.

Police Arrested Wife and Husband Prostitution Case : ఈ మేరకు దంపతులతో పాటు యువతిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. స్రిస్టీ అక్తర్‌కు బంగ్లాదేశ్‌లో భర్త ఆసిఫ్‌ఖాన్‌, ఇద్దరు సంతానం ఉన్నట్లు వెల్లడైందని చెప్పారు. ఆసిఫ్‌ఖాన్‌ మేస్త్రీ పని చేయడంతో డబ్బు సరిపోక ఆమె అక్రమ మార్గంలో దేశ సరిహద్దులు దాటి వ్యభిచార వృత్తిలోకి చేరిందని పోలీసులు పేర్కొన్నారు.

విదేశీ యువతులతో వల.. బెజవాడలో హైటెక్​ వ్యభిచారం

బంగ్లాదేశ్​ నుంచి వచ్చి హైదరాబాద్​లో అక్రమ నివాసం.. వ్యభిచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.