ETV Bharat / state

గుట్టుగా ఆడ శిశువు అమ్మకం - అయినా ఎలా బయటపడిందంటే?

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 2:28 PM IST

Parents Sale Baby Girl In Badradri : అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి ఆ చిన్నారిది. తండ్రి లాలనకూ నోచుకోని దుస్థితి ఆ శిశువుది. తల్లిదండ్రుల సంరక్షణలో హాయిగా ఎదగాల్సిన ఆ పసిపాపను, కన్నవాళ్లే అంగట్లో బొమ్మలా ఇతరులకు అమ్మేశారు. ఆడశిశువు పుట్టడంతో భారంగా భావించారు. ఆ పసికందును అమ్మకానికి పెట్టిన అమానవీయ ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది.

girl baby selling at Badradri
Parents Sale Baby Girl In Badradri

Parents Sale Baby Girl In Badradri : అమ్మ ప్రేమను అందుకోలేని దీనస్థితి, తండ్రి లాలనకు నోచుకోని దుస్థితి ఆ శిశువుది. తల్లి తండ్రుల సంరక్షణలో హాయిగా ఎదగాల్సిన ఆ పసిపాపను కన్నా వాళ్లే అంగడిలో బొమ్మలా వేరేవారికి అమ్మేశారు. ఆడపిల్ల జన్మించడంతో భారంగా ఆ తల్లితండ్రులు భావించారు. పిల్లల కోసం పరితపించి పోయే తల్లిదండ్రులను చూశాం. సంతానం కోసం కొందరు దేవుళ్లకు మొక్కులు, నోములు చేయడం చూశాం. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రం కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లిదండ్రులు పోషించే స్థోమత లేక ఆడ శిశువు అమ్మకానికి పెట్టారు. అప్పుడే పుట్టిన ఆ ఆడబిడ్డను తల్లి పొత్తిళ్ల నుంచి వేరు చేశారు. ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అమ్మా.. నన్ను ఎందుకు అమ్మేశావ్.. నేనేం తప్పు చేశాను..?

Parents Sell Their Newborn Baby : భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలంలో అప్పుడే పుట్టిన పసికందును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితం అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఒక ప్రైవేటు వైద్యశాలకు చెందిన వైద్యురాలు కొత్తగూడెం చెందిన వారికి అక్రమంగా దత్తత ఇవ్వడంతో భద్రాచలం పోలీస్ స్టేషన్​లో కేసు నమోదయింది. ఆర్టీసీ బస్టాండ్ వెనుక బ్యాంక్ స్ట్రీట్​లో గల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన బిడ్డను చనిపోయిందని నమ్మించి కొత్తగూడెం చెందిన వారికి వైద్యురాలు విక్రయించింది.

భువనగిరిలో శిశు విక్రయం.. బాలల పరిరక్షణ కేంద్రానికి తరలింపు

అంగన్వాడీ సూపర్​వైజర్ ఫిర్యాదుతో వెలుగులోకి : భద్రాచలం అల్లూరు సీతారామరాజు కాలనీకి చెందిన జాజితా అనే మహిళ ప్రసవానికి ఆసుపత్రికి రాగా ప్రసవం చేసిన వైద్యురాలు పాప చనిపోయిందని నమ్మించింది. వెంటనే కొత్తగూడెంకు చెందిన ప్రవీణ్ కుమార్, పల్లవిలకు పాపను అక్రమ దత్తత పేరుతో విక్రయించింది. పాప పాలు సరిగా తాగాక నలతగా ఉండటంతో వైద్యం చేయించేందుకు తీసుకెళ్లగా వివరాలు సేకరించగా అసలు విషయం బయటపడింది. దీంతో పాప విక్రయంపై ప్రచారం మాధ్యమాలలో విషయం బయటకు రాగా అంగన్వాడీ సూపర్​వైజర్ భద్రాచలం పోలీస్ స్టేషన్​లో పాప విక్రయం​పై ఫిర్యాదు చేశారు. స్త్రీ శిశు, సంక్షేమ శాఖ అధికారులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

పసికందును కన్నతల్లికి తెలవకుండా చనిపోయిందని నమ్మించి విక్రయించారని, అక్రమ దత్తత ఇచ్చారని భద్రాచలం పోలీస్ స్టేషన్​లో ఆసుపత్రి వైద్యురాలితో పాటు, మీడియేటర్ గోపి నందన్, దత్తత తీసుకున్న ఇద్దరు మొత్తం నలుగురిపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి వైద్యురాలితో సహా నలుగురిపై భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.

డాక్టర్ 'సరోగసి'​ చీటింగ్​.. హైదరాబాద్​ దంపతులకు టోకరా!

శిశువు విక్రయం కలకలం.. రంగంలోకి పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.