ETV Bharat / state

మీ ఐక్యూ పవర్​ ఎంతో టెస్ట్​ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పజిల్​ను సాల్వ్​ చేయండి! - Find the Difference in This Photo

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 10:51 AM IST

Find the Difference: ప్రస్తుత కాలంలో బ్రెయిన్​కు పదును పెట్టే పజిల్స్​, ఆప్టికల్ ఇల్యూషన్, స్పాట్ ది డిఫరెన్స్​, ట్రిక్కీ పజిల్స్ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. వీటిని నెటిజన్లు కూడా ఫాలో అయ్యి వాళ్ల ఐక్యూ పవర్​ ఎంతో టెస్ట్​ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా మీ బ్రెయిన్​ ఎంత షార్ప్​గా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఫొటోలో ఉన్న తేడా కనిపెట్టండి...

Etv Bharat
Etv Bharat

Find the Difference in This Photo: టెన్షన్​ లేని లైఫ్​ ఉండదంటే మీరు నమ్ముతారా? ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టెన్షన్​. టెన్షన్​ నుంచి రిలీఫ్​ పొందడానికి ధ్యానం, యోగా, ​ మ్యూజిక్​, డ్యాన్సింగ్​.. అంటూ నచ్చిన వ్యాపకం అలవాటు చేసుకుంటూ రిలాక్స్​ అవుతుంటారు. అయితే టెన్షన్​ నుంచి రిలీఫ్​ పొందడానికి ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అందులో బ్రెయిన్​కు పదునుపెట్టే పజిల్స్​, రెండు బొమ్మల మధ్య తేడాలు కనిపెట్టడం వంటివి కూడా ఒకటి.

అయితే ఒకప్పుడు పజిల్స్​, సుడోకు వంటి మెదడుకు పదును పెట్టేవన్నీ న్యూస్​ పేపర్స్​లో మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్​ మారింది. సోషల్ మీడియాలో రకరకాల బ్రెయిన్ టీజర్లు, పజిల్స్ వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూషన్, స్పాట్ ది డిఫరెన్స్, సీక్ అండ్ ఫైండ్, ట్రిక్కీ పజిల్స్ చాలా మంది దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా వీటిలో పిక్చర్ పజిల్స్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇవి ఫన్‌గానూ ఉంటూ చాలా కాలక్షేపాన్ని అందిస్తున్నాయి.

ఈ బ్రెయిన్ టీజర్లు మెదడుకు పదును పెడతాయి. లాజిక్‌ను సవాలు చేస్తాయి. క్రియేటివ్‌గా ఆలోచించేలా ప్రోత్సహిస్తూ, దృష్టి, జ్ఞాపకశక్తి, తెలివితేటలను కూడా మెరుగుపరుస్తాయి. లోపాలను కనుగొనడం, సీక్రెట్ కోడ్స్‌ ఛేదించడం లేదా దాగిన వస్తువులను గుర్తించడం వంటి వివిధ రకాల సవాళ్లతో పిక్చర్ పజిల్స్‌ వస్తాయి. మెదడును ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, క్రమం తప్పకుండా పిక్చర్ పజిల్స్ సాధన చేయాలి. అవి మెదడు కణాలను ఉత్తేజపరుస్తాయి. సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి. అందుకోసమే మీ కోసం ఓ పజిల్​ను తీసుకొచ్చాం.

optical illusion
తేడా కనిపెట్టండి

మీకు ఇచ్చిన పజిల్​లో ఒకటే ఫ్రేమ్​లో మూడు ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల్లో రెండు మాత్రం ఒకేరకంగా ఉండి మిగతా ఒక్కటి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కాబట్టి ఈ ఫొటోలో డిఫరెంట్​గా ఉన్నది ఏదో ఫైండ్​ అవుట్​ చేయాలి. అయితే ఈ పజిల్​ను సాల్వ్​ చేయడానికి మీకిస్తున్న టైం కేవలం 12 సెకన్లు మాత్రమే. మరి మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.

ఏంటి ఎంత వెతికినా ఏ ఫొటో తేడానో కనిపించడం లేదా? అయితే ఆన్సర్‌ కోసం ఓసారి కింద ఫొటోపై లుక్కేయండి. అయితే ఇచ్చిన సమయంలో పరిష్కరించిన వారికి పదునైన చూపు, వేగంగా పనిచేసే మెదడు ఉందని చెప్పవచ్చు. సాల్వ్ చేయలేకపోయిన వారు బాధ పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి పజిల్స్​ను రోజూ ప్రాక్టీస్​ చేస్తే మీరు కూడా ఇందులో మాస్టర్స్​ అవుతారు. సో ఈసారికి ఆల్​ ది బెస్ట్​..

optical illusion
optical illusion

కాసేపు టెన్షన్స్​ అన్నీ లైట్​ తీస్కో భయ్యా - ఈ తేడాలు కనిపెట్టండి - ఫుల్లు రిలాక్స్! - OPTICAL ILLUSION TEST

బొమ్మే కదా అని తీసిపారేయకండి - ఈ చిత్రంలోని తేడాలు కనిపెడితే మీలో అద్భుతం జరుగుతుంది! - Optical Illusion Test

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.