ETV Bharat / state

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు` - ROAD ACCIDENTS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 12:46 PM IST

Road Accident in Ongole Lorry Hit Van : ప్రమాదంలో లారీ వెనక చక్రాలు ఊడిపోయి రోడ్డుకు అడ్డుగా పడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఓ ఆయిల్ ట్యాంకర్‌ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఆయిల్‌ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు వివరాలిలా ఉన్నాయి.

road_accident_in_ongole_lorry_hit_van
road_accident_in_ongole_lorry_hit_van (ETV Bharat)

Road Accident in Ongole Lorry Hit Van : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం మాచవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న లారీ, పార్సెల్ వ్యాన్‌ అదుపుతప్పి ఢీ కొన్నాయి. కనిగిరి నుంచి పామూరు వైపు వెళుతున్న పార్సెల్ వ్యాను, పామూరు నుంచి సెంట్రింగ్ సామగ్రితో కనిగిరికి వస్తున్న లారీ మాచవరం గ్రామ సమీపంలో ఢీ కొని రోడ్డు పక్కకు పల్టీలు కొట్టాయి. ప్రమాదంలో లారీ వెనక చక్రాలు ఊడిపోయి రోడ్డుకు అడ్డుగా పడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేట్ అంబులెన్స్​లో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఆస్పత్రికి తరలించారు.

Oil Tanker Hit a Container Driver Died in Bapatla NH : బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ఓ ఆయిల్ ట్యాంకర్‌ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ఆయిల్‌ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలం ఇనమనమడుగు గ్రామానికి చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. కృష్ణపట్నం నుంచి పేరేచర్లకు వెళ్తుండగా మేదరమెట్ల పైలాన్‌ సెంటర్‌ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో కంటైనర్‌ని వేగంగా ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

రోడ్డు ప్రమాదం- ఇద్దరు మృతి, మరో 10మందికి తీవ్ర గాయాలు - Nellore Road Accident Several Dead

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు (ETV Bharat)

Road Accident in Nellore District : నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపు బట్టి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న ట్రావెల్‌ బస్సు అదుపు తప్పి రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ని దాటి అటుగా వెళ్తున్న కంటైనర్‌ లారీని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో సమీపంలోని అస్పత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగటంతో 5 కిలోమీటర్ల మేర రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

మృత్యువు వెంటాడటం అంటే ఇదేనేమో - ఒక ప్రమాదం నుంచి బయటపడిన నిమిషాల్లోనే - మరో యాక్సిడెంట్​లో! - Zaheerabad Techi Died In USA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.