ETV Bharat / state

బంగాళాఖాతంలో అలజడి- అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక - RAIN ALERT

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 3:44 PM IST

Monsoon Rains in Andhra Pradesh : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖాధికారులు తెలిపారు. వచ్చే రెండు రోజుల్లో ఈ అల్పపీడనం మరింతగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే పగటి పూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

Monsoon Rains in Andhra Pradesh
Monsoon Rains in Andhra Pradesh (ETV Bharat)

Monsoon Rains in Andhra Pradesh : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ శాఖాధికారి డాక్టర్ సునందా చెప్పారు. రానున్న రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించారు. సముద్రంలో అలజడులు ఎక్కువగా ఉంటాయని వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో ఈ వాయుగుండం ప్రభావం పెద్దగా ఉండదని ఒకటి రెండు చోట్ల తేలిక పాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సునందా వెల్లడించారు.

రాష్ట్రంలో భారీ వర్షం కురిసే సూచన - హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం - Rain Alert In AP

బంగాళాఖాతంలో అల్పపీడనం : తమిళనాడు పరిసర ప్రాంతంలో ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా ఈరోజు (బుధవారం) బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశముంది. దీని ప్రభావంతో బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణం కేంద్రం తెలిపింది. అల్పపీడనం ఏర్పడిన తర్వాత పొడి వాతావరణం కారణంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది.

పలు జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం : మంగళవారం రాష్ట్రంలో అనంతపురం జిల్లా నార్పలలో 26.5, చిత్తూరులో 22.5, చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో 21.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే పలు జిల్లాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగాయి. కర్నూలులో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే బంగాళాఖాతంలో తుఫాన్‌ ఏర్పడే అవకాశం ఉండటంతో ఈనెల 23వ తేదీ తర్వాత ఎండలు పెరిగి వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అంతేకాదు వచ్చే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందంటోంది విపత్తుల నిర్వహణ సంస్థ. పలు జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఈసారి ముందే నైరుతి రుతుపవనాలు - ఏపీలోకి ఎప్పుడంటే ! - SOUTHWEST MONSOON 2024

ఆ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు : అదే విధంగా శుక్రవారం అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

చల్లబడిన వాతావరణం - రాష్ట్రంలో మరో మూడు రోజులుపాటు వర్షాలు - AP Weather Report

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.