ETV Bharat / state

కట్టుకున్న భార్యను కనికరం లేకుండా కడతేర్చి- ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి? - Man Killed His Wife

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 25, 2024, 12:11 PM IST

Man killed His Wife In Hyderabad : ఏడడుగుల బంధమే యముడిలా మారింది. అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణమే అతి కిరాతకంగా ఆయువు తీసింది. మూడు ముళ్లు వేసిన చేతులే ముక్కలు చేశాయి. కనికరం లేకుండా కట్టుకున్న భార్యను కడతేర్చటమే కాకుండా ప్రమాదంగా చిత్రీకరించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. ఈ నెల 4న జరిగిన ఈ దుర్ఘటన కుటుంబ సభ్యుల ఆందోళనతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

man_killed_his_wife
man_killed_his_wife (ETV Bharat)

Husband Killed his Wife In Hyderabad : కట్టుకున్న భార్యను అతికిరాతంగా హత్య చేసిన ఓ భర్త అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు నానాప్రయత్నాలు చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 4న జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లాలోని కనకమెట్లకు చెందిన రంగనాయకులు-లక్ష్మి దంపతుల మూడో కూమార్తె మధులతకు అదే జిల్లా దర్శికి చెందిన పరకాల నాగేంద్ర భరద్వాజ్‌తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ బాబు ఉన్నాడు.

దంపతులు ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కాగా వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. బాచుపల్లిలోని సాయి అనురాగ్‌ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లైన కొంత కాలం బాగానే ఉన్నా తర్వాత దంపతుల మధ్య క్రమంగా గొడవలు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 4న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరగ్గా విచక్షణ కోల్పోయిన నాగేంద్ర మధులతపై దాడిచేసి అతికిరాతకంగా హత్యచేశాడు.

పోలవరం త్యాగధనులకు ఆత్మహత్యలే శరణ్యమా?!- పరిహారం కోసం కార్యాలయంలోనే పురుగుల మందు తాగిన వృద్ధుడు - Polavaram Resettlement Victims

కట్టుకున్న భార్యను కనికరం లేకుండా కడతేర్చి - ఆపై మృతదేహాన్ని ముక్కలు చేసి? (ETV Bharat)

భార్యను కడతేర్చిన భర్త : భార్య మృతదేహాన్ని నాగేంద్ర కత్తితో ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించి కొంతభాగం కాలిని నరికేశాడు. తర్వాత ఆ ప్రయత్నం విరమించుకుని ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించాడు. ఇందులో భాగంగానే మధులత మృతదేహం వద్దకు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకొచ్చినా స్థానికులకు అనుమానంతో రావటంతో ఇంట్లో నుంచి పరారయ్యాడు. ఇరుగు పొరుగు వారిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. అప్పటికే పారిపోయిన నిందితుడిని మరుసటి రోజు చందానగర్‌ ప్రాంతంలో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పెళ్లైన నాటి నుంచి మధులతను భర్త చిత్రహింసలకు గురిచేసినట్టు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 4న అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా దాదాపు 20రోజుల వరకు ఈ ఉదంతం వెలుగులోకి రాలేదు. పోలీసులు సైతం కేసును గోప్యంగా ఉంచుతున్నారని దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని మధులత తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై పోలీసులను సంప్రదించగా నిందితుడిని ఇప్పటికే తాము రిమాండ్‌ చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

అంతా తవ్వుకుపోయాక హడావుడి- సుప్రీం ఆదేశాలతో గనులశాఖ ఉన్నతాధికారుల హైడ్రామా - SC Serious On Sand Mining in AP

డబ్బుల కోసం రోజూ చిత్రహింసలు పెట్టేవాడు. మా అమ్మాయి ఇంజినీర్ ఉద్యోగం చేసి నెలకు రూ.లక్ష సంపాదించినా డబ్బులను తన దగ్గరి నుంచి తీసుకునేవాడు. చాలా సార్లు డబ్బుల గురించి కొట్టాడు. కానీ ఇలా హత్య చేస్తాడని అనుకోలేదు. పోలీసులు దీనిపై పట్టించుకోవట్లేదు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి నిందితుడిని కఠినంగా శిక్షించాలి. - లక్ష్మి, మధులత తల్లి

బెంగళూరు రేవ్​పార్టీలోనూ వైఎస్సార్సీపీ హస్తం!- నిందితులతో పార్టీ నేతలకు లింకులు - Rave Party Accused Links with YSRCP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.