ETV Bharat / state

శివబాలకృష్ణ కేసు లేటెస్ట్ అప్డేట్​ - ఆ ఐఏఎస్ అధికారిని విచారించే యోచనలో ఏసీబీ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 3:39 PM IST

Updated : Feb 11, 2024, 10:06 PM IST

HMDA Shiva Balakrishna Case Update : ఆదాయానికి మించి అక్రమార్జన కేసులో అరెస్టు అయిన హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి భాగస్వామ్యమైనట్లు ఇటీవల ఏసీబీ విచారణలో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సదరు అధికారికి నోటీసులు ఇచ్చి ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం.

Shiva Balakrishna Case Update
HMDA Ex Director Shiva Balakrishna Case Update

HMDA Shiva Balakrishna Case Update : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్​ శివ బాలకృష్ణ అక్రమాలపై ఏసీబీ(ACB) లోతైన దర్యాప్తు చేస్తోంది. ఇటీవల అతనిని ఎనిమిది రోజులు కస్టడీలో ఉంచి విచారించారు. ఆ విచారణ సమయంలో ఓ సీనియర్​ ఐఏఎస్​ అధికారి పేరును అవినీతి నిరోధక శాఖ అధికారులకు బాలకృష్ణ చెప్పినట్లు సమాచారం. సదరు​ అధికారి ఆదేశాల మేరకు పలు అనుమతులు జారీ చేసి కోట్ల రూపాయలను శివ బాలకృష్ణ(Shiva Balakrishna Case) గడించినట్లు ఏసీబీ గుర్తించింది. ఇదే విషయాన్ని విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది.

శివబాలకృష్ణపై కేంద్రదర్యాప్తు సంస్థ ఫోకస్- రంగంలోకి దిగిన ఈడీ

పలు వివాదస్పద భూములకు అనుమతులు ఇప్పించినందుకు ఐఏఎస్​కు భారీగా లబ్ధి చేకూరిందని శివబాలకృష్ణ వెల్లడించాడు. వాటిల్లో తనకూ వాటాలు ముట్టినట్లు అంగీకరించాడు. ఐఏఎస్ ఆదేశాల మేరకు అనుమతులిచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఆ సమయంలో తమకు అందిన డబ్బులతో కొనుగోలు చేసిన భూముల వివరాలు ఎవరి పేరుతో స్థిరాస్తులను(Immovable Property) ఐఏఎస్ రిజిస్ట్రేషన్ చేయించారు, తదితర వివరాలను బహిర్గతం చేశాడు.

తాను స్వయంగా కొంత డబ్బును ఐఏఎస్ ఇంటికెళ్లి ఇచ్చినట్లు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఏసీబీ ఆ విషయాలన్నింటినీ శివబాలకృష్ణ నేరాంగీకార వాంగ్మూలంలో పొందుపరిచి న్యాయస్థానానికి(Court) ఇప్పటికే సమర్పించింది. ఈ క్రమంలో ఆయనతో తరచూ వాట్సాప్​ సంభాషణలు చేసే వాడని, అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

శివబాలకృష్ణ నేరంగీకార పత్రంలో సంచలన విషయాలు - ఓ ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావన

IAS Involved in Shiva Balakrishna Case : అయితే శివబాలకృష్ణ వాంగ్మూలం ఆధారంగా ఐఏఎస్ అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చే అవకాశం లేదు. అందుకు ఆధారాలను సంపాదించి ఐఏఎస్ పాత్రను నిగ్గు తేల్చాల్సి ఉంది. ఆయా డీల్స్ జరిగిన సమయంలో శివబాలకృష్ణకు ఐఏఎస్​కు మధ్య చోటు చేసుకున్న ఫోన్ కాల్స్, వాట్సప్ సంభాషణలతోపాటు(WhatsApp Conversations) ఇద్దరి ఫోన్ లొకేషన్లకు సంబంధించి సెల్వర్ డేటాను సేకరించి కేసులో బలమైన ఆధారాలుగా చేర్చాల్సిఉంది.

అయితే ఇందుకు మరికొంత సమయం పట్టనుంది. ఈనేపథ్యంలో తొలుత అతడిని సాక్షిగా పిలిచి విచారించాలని ఏసీబీ యోచిస్తోంది. ఈక్రమంలో 161సీఆర్పీసీ నోటీస్ ఇచ్చే యోచనలో ఉంది. ఇందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకపోవడంతో నోటీస్ జారీ చేయాలని భావిస్తోంది.

రంగంలోకి దిగిన ఈడీ : శివబాలకృష్ణ వెల్లడించిన వాటాల వ్యవహారంపై విచారణ క్రమంలో ఐఏఎస్​ను అడిగి వివరాలను రాబట్టనుంది. ఒకవేళ అడ్డదారిలో అనుమతులు ఇప్పించినందుకు ఐఏఎస్ గనుక వాటాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయిన పక్షంలో మాత్రమే దర్యాప్తులో మరో అడుగు ముందుకేయాలని అవినీతి నిరోధక శాఖ(ACB) భావిస్తోంది. అప్పుడు అవసరమైతే 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసి మళ్లీ విచారించే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఐఏఎస్​ నిందితుడిగా చేర్చాల్చివచ్చినా, అరెస్ట్ చేయాల్సిన అవసరమేర్పడినా అప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి కోరే అవకాశం కనిపిస్తోంది.

ఐఏఎస్‌తో శివబాలకృష్ణ అవినీతి బంధం - ఇద్దరి లావాదేవీలు తేల్చే పనిలో ఏసీబీ!

Last Updated : Feb 11, 2024, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.