ETV Bharat / state

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న శివబాలకృష్ణ లీలలు - అజ్ఞాతంలోకి ఆ నలుగురు!

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2024, 9:49 AM IST

ACB Arrested Shiva Balakrishna
HMDA Ex Director Shiva Balakrishna Case Updates

HMDA Ex Director Shiva Balakrishna Case Updates : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్‌, మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారి శివబాలకృష్ణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నగర శివార్లలో జరిగిన భూ బదలాయింపులు, అపార్ట్‌మెంట్స్, విల్లాల నిర్మాణాల్లో ఒక్క సంతకంతో స్థలాలు కాజేశారంటూ పలువురు బాధితులు నోరువిప్పుతున్నారు. వారిలో కొందరు బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రూ.కోట్ల విలువైన భూముల వ్యవహారంలో హెచ్‌ఎండీఏ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో శివబాలకృష్ణకు సహకరించిన నలుగురు ఉద్యోగులు కొద్ది రోజులుగా సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం.

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న శివబాలకృష్ణ లీలలు - అజ్ఞాతంలోకి ఆ నలుగురు!

HMDA Ex Director Shiva Balakrishna Case Updates : ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయల అక్రమ సంపాదన కూడబెట్టి, ఏసీబీకి చిక్కిన హెచ్​ఎండీఏ మాజీ డైరెక్టర్, మెట్రో రైల్‌ ప్రణాళిక అధికారి శివ బాలకృష్ణ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పని చేసిన సమయంలో నలుగురు అధికారులు ఇప్పుడు అందుబాటులో లేనట్లు సమాచారం. వారిలో ఇద్దరు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో పని చేస్తున్న అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌, సెక్షన్‌ ఆఫీసర్‌ శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. శివబాలకృష్ణ నివాసంలో తనిఖీలు ప్రారంభం కాగానే, ఆ నలుగురు ఉద్యోగులు తమ నివాసాల్లోని కీలకమైన దస్త్రాలతో మాయమైనట్టు ఉద్యోగవర్గాల్లో చర్చ సాగుతోంది.

బాలకృష్ణ అవినీతిపై సర్కార్‌ నజర్‌ - బినామీ ఆస్తులపై ఏసీబీ విచారణ

ACB Arrested Shiva Balakrishna : మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌లో భూ బదలాయింపుల విభాగం చాలా కీలకం. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్షన్‌ ఆఫీసర్‌కు గతంలో ఉన్నతాధికారి అండదండలు పుష్కలంగా ఉండేవి. అవినీతి ఆరోపణలు వచ్చినా, ఆరేళ్లుగా అక్కడే కొనసాగటమే అందుకు నిదర్శనం. హెచ్​ఎండీఏ నుంచి ఎంఏయూడీకి వచ్చే భూ బదలాయింపుల దస్త్రాలన్నీ ఆ సెక్షన్‌ నుంచే వెళ్తుంటాయి. ఇంతటి కీలకమైన దస్త్రాలకు, ఆ అధికారి సంతకం చాలా కీలకం. రెండేళ్లుగా హెచ్​ఎండీఏ నుంచి వచ్చే భూ బదలాయింపు పత్రాలు తొలుత రెరా ఇన్‌ఛార్జీ శివబాలకృష్ణకు నేరుగా వెళ్లాయనే ఆరోపణలున్నాయి. సదరు సెక్షన్‌ ఆఫీసర్‌ నుంచి వచ్చే దస్త్రాలే పరిష్కారానికి నోచుకునేవని బాధితులు వాపోతున్నారు.

అవినీతి శాఖల జాబితాలో ఎక్సైజ్ కూడా చేరింది - ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆసక్తికర​ ట్వీట్

Land victims Complain To Higher Authorities In Banjara Hills : హైదరాబాద్‌ శివారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన భూవివాదంపై కోర్టులో కేసు నడుస్తోంది. అయినా ఆ వివాదాస్పద భూమిని ఓ నిర్మాణ సంస్థకు చెందినదిగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారని సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. ఆ సెక్షన్‌ అధికారితో స్థలాలు కోల్పోయిన బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు సమాచారం. నగర శివారు ప్రాంతాల్లో సెక్షన్‌ అధికారి బినామీగా 20 ఎకరాలకు పైగా ఖరీదైన భూమి కొనుగోలు చేసినట్టు సమాచారం.

ఆయన మూడు రోజులుగా విధులకు గైర్హాజరయ్యారు. సెల్‌ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకొని సోమవారం విధులకు హాజరైనట్టు తెలుస్తోంది. ఆ విధంగా శివబాలకృష్ణ వద్ద నమ్మకంగా పని చేసే వ్యక్తిగత సహాయకులు, సిబ్బంది సొంతూళ్లకు వెళ్లినట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో గుర్తించారు. వారిని గుర్తించి నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

బాలకృష్ణపై ఏసీబీ కస్టడీ పిటిషన్ - తీర్పు రిజర్వు చేసిన న్యాయస్థానం

చంచల్‌గూడ జైలుకు శివబాలకృష్ణ - బినామీలను విచారించడంపై ఏసీబీ ఫోకస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.