ETV Bharat / state

హైదరాబాద్​లో ఇంటి ఓనర్లకు జీహెచ్​ఎంసీ శుభవార్త - ఈనెల 30 వరకు ఛాన్స్! - GHMC Property Tax Rebate

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 6:15 AM IST

GHMC Property Tax Rebate
GHMC Property Tax Rebate

GHMC Property Tax Rebate : హైదరాబాద్​లోని ఇంటి ఓనర్లకు జీహెచ్​ఎంసీ శుభవార్త తెలిపింది. ఇంటి పన్ను చెల్లించే వారికి రాయితీ అవకాశం ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

GHMC Property Tax Rebate : కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) దృష్టి సారించింది. ఇందులో భాగంగా.. ఆస్తి పన్ను వసూళ్లకోసం "ఎర్లీ బర్డ్" స్కీమ్​ ప్రవేశపెట్టింది. ప్రతీ ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా.. రాయితీని వినియోగించుకోవాలని ప్రజలకు సూచిస్తోంది.

"ఎర్లీ బర్డ్" పథకం ద్వారా 800 కోట్ల పన్నులు వసూలు చేయాలని జీహెచ్​ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డబ్బు ద్వారా బల్దియా చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలని భావిస్తోంది. అనుకున్న మేరకు పన్ను వసూళ్లు జరిగితే, ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత మేర రిలీఫ్ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఆర్థిక సంవత్సరం టార్గెట్ : జీహెచ్​ఎంసీ పరిధిలో దాదాపు 19లక్షల నిర్మాణాలున్నట్టు అంచనా. వీటి ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.2,500 కోట్ల ట్యాక్స్ వసూలు చేయాలన్నది బల్దియా లక్ష్యం. అయితే, ఇందులో సాధ్యమైనంత ఎక్కువ మొత్తాన్ని ఈ ఏప్రిల్‌ నెలలోనే "ఎర్లీబర్డ్‌" పథకం ద్వారా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రెవెన్యూ విభాగంలోని జోనల్‌ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. నగరంలో నాలాలు, రహదారుల మరమ్మతులు, డైలీ పారిశుద్ధ్య పనులు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి పనుల కోసం ఈ ఆదాయాన్ని వినియోగించాలని జీహెచ్​ఎంసీ చూస్తోంది.

"ఎర్లీ బర్డ్" ద్వారా రిబేట్ : సాధ్యమైనంత ఎక్కువ పన్ను ఏప్రిల్​ మాసంలోనే వసూలు చేయాలని భావిస్తున్న జీహెచ్​ఎంసీ (Greater Hyderabad Municipal Corporation) ఎర్లీ బర్డ్​ పథకాన్ని వినియోగించుకోవాలని ప్రజలను కోరుతోంది. ఈ పథకంలో భాగంగా ముందస్తుగా పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ లభిస్తుందని ప్రకటించింది. ఈ సౌలభ్యం ఏప్రిల్​ 30 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. నగరవాసులు ఎప్పటిలాగనే, ఈ ఏడాది కూడా రాయితీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బల్దియా కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌ కోరుతున్నారు.

ట్రేడ్‌ లైసెన్సులతో ఆదాయం: గత సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ దాకా, 1 లక్షా 6 వేల 333 ట్రేడ్‌ లైసెన్సులను బల్దియా జారీ చేసింది. ఇందులో 54 వేల 744 లైసెన్సులు ఆ ఏడాది కొత్తగా ఇచ్చినవి. మిగిలినవి రెన్యూవల్‌ చేసినవి. కొత్త లైసెన్సులు పెరగడం వల్ల జీహెచ్​ఎంసీకి ఆదాయం ఎక్కువగా సమకూరింది. అధికారులు, సహాయ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టిపెడితే.. ఈ ఏడాది కూడా మరిన్ని కొత్త లైసెన్సులు జారీ చేయొచ్చని జీహెచ్​ఎంసీ అంచనా వేస్తోంది.

నీటి కటకట - గత్యంతరం లేక మురికినీళ్లే తాగుతున్న కోడూరు వాసులు - Water Crisis in Kodur

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.