ETV Bharat / state

కృష్ణమ్మ చెంతనే ఉన్నా - విజయవాడ గొంతెండుతుంది - Vijayawada face drinking water woes

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 8:08 PM IST

Vijayawada face drinking water woes
Vijayawada face drinking water woes

Vijayawada face drinking water woes: వేసవిలో విజయవాడ ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాల్సిన నగర పాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఫలితంగా, నీటికోసం ఆరాటం. గొంతు తడిపేసుకునేందుకు పోరాటం సాగించాల్సిన దుస్థితి నెలకొన్న నేపథ్యంలో తాగునీటి కష్టాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Vijayawada face drinking water woes: కృష్ణమ్మ చెంతనే ఉన్న విజయవాడ ప్రజలకు వేసవిలో నీటి కష్టాలు తప్పడం లేదు. నగరంలోని చాలా ప్రాంతాలకు వేసవిలో నీటి సరఫరా అరకొరగా ఉంటుంది. ప్రధానంగా వన్ టౌన్ ప్రాంతంలోని పలు ప్రాంతాల ప్రజలు గుక్కెడు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వేసవిని దృష్టిలో పట్టుకుని ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాల్సిన నగర పాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎన్నికలు వస్తున్న తరుణంలో తమకు మంచినీటి సమస్యను తీర్చే వారికే ఓటు వేస్తామని వించిపేట వాసులు చెబుతున్న నేపథ్యంలో బెజవాడ నీటి ఎద్దడిపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం


గలగల పారే కృష్ణానది, పుష్కలమైన భూగర్భ జలాలు, ఇవన్నీ విజయవాడ సొంతం. కానీ, నగర వాసులు మాత్రం వేసవి వస్తే తాగునీటి కష్టాలతో సావాసం చేస్తున్నారు. 2001తో పోలిస్తే నగర జనాభాలో ఇప్పటికీ దాదాపు 5 లక్షల మంది వరకు పెరిగారు. కానీ, వారి తాగునీటి అవసరాల్ని తీర్చే సామర్ధ్యాన్ని మాత్రం పెంచడంలో పాలకులు విఫలమయ్యారు. ఫలితంగా, నీటికోసం ఆరాటం. గొంతు తడిపేసుకునేందుకు పోరాటం సాగించాల్సిన దుస్థితి నెలకొంది.

నగరాలు, పట్టణాల్లో ప్రతి మనిషీ మనుగడ సాధించేందుకు రోజుకు 150 లీటర్ల తాగునీరు అవసరం. కానీ, బెజవాడలో మాత్రం క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ గణాంకాల దాఖలాలు కనిపించడం లేదు. విజయవాడ నగరంలో హెడ్ వాటర్ వర్క్స్, రామలింగేశ్వర్ నగర్, పుష్కరఘాట్, మెగల్ రాజ్ పురం, వన్ టౌన్, క్రీస్తు రాజపురం, గంగిరెద్దుల దిబ్బల్లోని తాగునీటి ట్యాంకులు ఉన్నా కూడా ప్రజలకు సంవృద్దిగా తాగునీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. అధికారులకు నచ్చినప్పుడు పావుగంటో, అరగంటో నీటిని వదిలి ఆపేయడంతో కూలీలు పనులు మానుకోవాల్సిన దుస్థితి నెలకొంది.


మిగులు పనులు పట్టించుకోని జగన్​ సర్కార్​ - నంద్యాల ప్రజలకు నీటి కష్టాలు - Drinking Water Problem

విజయవాడలో మున్సిపల్ కుళాయిలతో పాటు బోర్లు ఉన్నా అవి నిరుపయోగంగా ఉన్నాయి. పోనీ కార్పొరేషన్ సరఫరా చేసిన నీరు స్వచ్ఛంగా ఉంటుందంటే అదీ లేదు. పైప్ లైన్లల్లో మురుగునీరు కలిసి కలుషిత జలాలు సరఫరా అవుతున్నాయి. కలుషిత నీరు తాగలేక స్థానికులు డబ్బులు పెట్టి వాటర్ క్యాన్‌లు కొనుక్కుని గొంతు తడుపుకుంటున్నారు.


రామలింగేశ్వర్ నగర్, కృష్ణలంక, పటమట ప్రాంతాలకు కృష్ణానదిలో బోర్లు వేసి నీటిని సరఫరా చేస్తుంటారు. వేసవిలో విద్యుత్ కోతల సమస్య నీటి సరఫరాపై ప్రభావం చూపుతోంది. నాణ్యమైన కరెంట్ ఇవ్వక నీటిని శుద్ధిచేసి రిజర్వాయర్‌లకు ఎక్కించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. నాలుగేళ్లుగా ప్రజలు నీటి కోసం పోరాటాలే చేస్తున్నారు. ఖాళీ బిందెలతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద బైఠాయించినా అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు.

'దాహమో రామచంద్రా' అంటున్న సీఎం సొంత జిల్లా వాసులు- దశాబ్ద కాలంగా చూడని నీటి కష్టాలు - Drinking Water Problem in Mydukur

కృష్ణమ్మ చెంతనే ఉన్నా - విజయవాడ గొంతెండుతుంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.