ETV Bharat / state

జగన్ సర్కారు నిర్లక్ష్యంతో నీటి కోసం ప్రజల అవస్థలు - water crisis at kurnool

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 8:21 AM IST

Drinking_Water_Problem_in_Rayalaseeema
Drinking_Water_Problem_in_Rayalaseeema

Drinking Water Problem:రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులున్నా ప్రభుత్వం మేల్కోలేదు. సర్కార్‌ ప్రణాళికా లోపంతో పల్లెలు, పట్టణాల్లోని ప్రజల గొంతు ఎండుతోంది. సీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల వారం రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అదీ లేదు. ఫలితంగా జనం రోడ్డెక్కుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో ముందుముందు ఎలాంటి దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

జగన్ సర్కారు నిర్లక్ష్యంతో నీటి కోసం ప్రజల అవస్థలు

Drinking Water Problem in Rayalaseeema: రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన నీటి ఎద్దడితో అల్లాడిపోతున్నారు. జనవరి నుంచే ఎద్దడి పరిస్థితులున్నా ప్రభుత్వం మేల్కోలేదు. సర్కార్‌ ప్రణాళికా లోపంతో పల్లెలు, పట్టణాల్లోని ప్రజల గొంతు ఎండుతోంది. సీమతో పాటు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కొన్నిచోట్ల వారం రోజులకు ఒకసారి నీటి సరఫరా చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అదీ లేదు. ఫలితంగా జనం రోడ్డెక్కుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. దీంతో ముందుముందు ఎలాంటి దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

'దాహమో రామచంద్రా' అంటున్న సీఎం సొంత జిల్లా వాసులు- దశాబ్ద కాలంగా చూడని నీటి కష్టాలు - Drinking Water Problem in Mydukur

జగన్‌ సర్కార్‌ ప్రణాళికా లోపం ముందుచూపు లేమి వల్ల రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర తాగునీటి ఎద్దడి పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో మూడు నెలలుగా దుర్భిక్ష పరిస్థితులు కనిపిస్తున్నాయి. వర్షాలు లేక జలాశయాలు నిండుకుంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. కాల్వల్లో చుక్క నీరు లేదు. దీన్నిబట్టి ఎండాకాలంలో తీవ్ర నీటి కొరత తలెత్తుతుందని ఎవరికైనా అర్థమవుతుంది. జగన్‌ సర్కార్‌కు మాత్రం అవేవీ కనిపించలేదు. దాని ఫలితమే ఈసారి తాగేందుకే కాదు. రోజువారి వాడకానికీ నీళ్లు లేక గ్రామీణ, పట్టణ ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రకాశం, పల్నాడు, కర్నూలు, అనంతపురం,గుంటూరు తదితర జిల్లాల్లో ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. ప్రకాశం జిల్లా మార్కాపురం, పొదిలి, యర్రగొండపాలెం పట్టణాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో తాగునీటి సమస్యపై ఈటీవీ - ఈనాడు క్షేత్రస్థాయిలో రెండు రోజులు పరిశీలించింది. ఎటు చూసినా జనం నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న దృశ్యాలే కనిపించాయి. నీటి ట్యాంకర్లు ఎప్పుడొస్తాయోనని మహిళలు ఖాళీ బిందెలు ఇళ్ల ముందు పెట్టుకొని నిరీక్షిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆదోని, పత్తికొండ, ఆలూరు తదితర నియోజకవర్గాల్లో జనం తిప్పలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

నీళ్ల కోసం మహిళల ఆందోళన - హుటాహుటిన అధికారుల హామీలు - Women Protest in anantapur

People Protest for Water: గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భూగర్భ జలాలు దాదాపు రెట్టింపు స్థాయిలో దిగజారినా, సర్కార్‌ మేల్కోలేదు. దీంతో పలుచోట్ల మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో పర్యటన సందర్భంగా సీఎం జగన్‌ బస్సు యాత్రను సైతం ప్రజలు అడ్డుకున్నారు. ట్యాంకర్ల కోసం పనులు మానుకొని ఎదురుచూడాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. మరోవైపు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసే కాంట్రాక్టర్లకు పలుచోట్ల ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో సమస్య మరింత జఠిలంగా మారుతోంది. నీటి ఎద్దడితో పశువులను ఎలా సాకేదని పాడి రైతులు వాపోతున్నారు. కరవుతో పొలాలన్నీ ఎండిపోయాయి. ట్రాక్టర్‌ ఎండు గడ్డిని 14 వేలకు కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు గేదల్ని సాకలేక అమ్ముకుంటున్నారు.

Water Crisis prakasam: ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్యపై ప్రజల ఆందోళనలతో గతంలో జగన్‌ సర్కారు పొదిలిలో 600 ఎకరాల పెద్దచెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా దర్శి నుంచి చెరువుకు సాగర్‌ జలాల్ని తరలించేందుకు పైపులైన్‌ నిర్మాణానికి 2023 ఏప్రిల్‌లో సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. బిల్లులు చెల్లించకపోవడంతో ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మార్కాపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి త్రిపురాంతకం నుంచి పైపులైన్లు వేసే పనుల్ని కూడా సకాలంలో వైఎస్సార్సీపీ పూర్తి చేయడం లేదు.

పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాల ప్రజలు సాగు, తాగునీటికి అవస్థలు పడుతున్నారు. కేవలం ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టేందుకు నాలుగు నెలల క్రితం వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గమనార్హం. బొల్లాపల్లి మండలంలోని 20 గ్రామాలకు తాగునీరు అందించేందుకు 12 కోట్లతో సామాజిక రక్షిత తాగునీటి పథకం మంజూరు చేస్తున్నట్లు ఏడాది కిందట జగన్‌ ప్రకటించినా ఇప్పటికీ నోచుకోలేదు. వినుకొండలో తాగునీటి సరఫరాకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏఐఐబీ నిధులు 161 కోట్లు మంజూరయ్యాయి. వైసీపీ అధికారంలోకి రాగానే అప్పటి వరకు జరిగిన పనులను ఆపేసింది. ఫలితంగా నీటికి అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇక్కడే కాదు పిడుగురాళ్ల, చిలకలూరిపేట, మాచర్లలో సైతం నీటిపాట్లు తప్పడం లేదు.

మండుటెండలో కలెక్టరేట్ వద్ద మహిళల నిరసన- మూడు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ - kuravapalli Women Protest

"రెండు నెలల నుంచి నీరు రావటం లేదు. కూలీ పనులు చేసుకునేవాళ్లకు నీళ్లు కొనుక్కోవాలంటే కష్టంగా ఉంటుంది. నీళ్ల ట్యాంకర్ల కోసం పనులు మానుకోవాల్సి వస్తుంది." -స్థానికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.