ETV Bharat / state

తాజా ద్రాక్షలు కావాలా నాయనా - అక్కడికి వెళ్తే ఫ్రీగా టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2024, 9:24 AM IST

Draksha Mela at Rajendra Nagar : సాధారణంగా మనకు ద్రాక్ష పండ్లు కావాలంటే మార్కెట్‌లోనో, రోడ్లపై తోపుడు బండ్ల దగ్గరో కొంటూ ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం తోటంతా కలియ తిరిగి మనకు నచ్చినవి తీసుకొచ్చు. అంతే కాదండోయ్‌ ఫ్రీగా టేస్ట్ చేసి నచ్చితేనే కొనుక్కోవచ్చు. ఒకటి రెండు రకాలు కాదు సహజసిద్ధమైన 62 రకాల ద్రాక్ష పండ్లు దొరుకుతాయి. మరి ఇలాంటి తాజా తాజా ద్రాక్ష పండ్లు కావాలంటే వెంటనే అక్కడికి వెళ్లాల్సిందే.

Hyderabad Grape Research Station
Grape Research Station In Rajendranagar

తాజా ద్రాక్షలు కావాలా నాయనా - అక్కడికి వెళ్తే ఫ్రీగా టేస్ట్ చేసి కొనుక్కోవచ్చు

Draksha Mela at Rajendra Nagar : హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వనంలో ద్రాక్ష తోటలు ఉన్నాయి. 8 ఎకరాల విస్తీర్ణంలో 62 రకాల ద్రాక్షపండ్లు(Grapes) ఇక్కడ లభిస్తాయి. ఏటా ఇక్కడ ద్రాక్ష మేళా సాగుతోంది. ఈ సంవత్సరం కూడా జరుగుతున్న ద్రాక్షమేళకు పెద్ద ఎత్తున నగరవాసులు తరలివస్తున్నారు.

Grape Festival Hyderabad 2024 : ఇక్కడికి వచ్చే నగరవాసులు స్వయంగా తోటల్లో కలియ తిరుగుతూ రుచికర పండ్లు సేకరించి కొనుగోలు చేస్తూ మంచి అనుభూతి ఆస్వాదిస్తున్నారు. సాధారణంగా బయట మార్కెట్లో, రోడ్లపై దుకాణాల్లో తోపుడు బండ్లపై దొరికే ద్రాక్ష పండ్లలో క్రిమి సంహారక, రసాయన ఎక్కువగా ఉంటాయని ఈ పరిశోధన క్షేత్రంలో శాస్త్రీయంగా సాగు చేసిన ద్రాక్ష పండ్లు ఆరోగ్యంగా ఉంటాయని కొనుగొలు దారులు చెప్తున్నారు.

'మొక్కలు నాటడం, బహుమతిగా ఇవ్వడం ఆనవాయితీగా మార్చుకోవాలి'

"ఈ ఉద్యాన వనంలో సేంద్రియ ఎరువులు వేసి పండిస్తారు. అందువల్ల ఇక్కడికి వస్తుంటాం. ఈ ఆలోచన చాలా బావుంది. తాజా ద్రాక్ష పండ్లు ఇక్కడ లభిస్తాయి. ద్రాక్ష పండ్లు నేరుగా చెట్టుపై నుంచి తీసుకొని కొనుగొలు చేయడం స్వంతంగా వ్యవసాయం క్షేత్రంలో నుంచి కోసుకున్న అనుభూతినిస్తోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ ద్రాక్ష మేళా జరుగుతుంది. పిల్లలతో గడపడానికి ఏటా ఇక్కడికి వస్తుంటాం. మార్కెట్​లో చాలా తక్కువ ధరకే లభిస్తాయి"- కొనుగోలుదారులు

ద్రాక్ష పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో- ఈ వ్యాధులు మీ దరి చేరవు!

Hyderabad Grape Research Centre : ఏటా పంట కాపుకొచ్చే సీజన్‌లో వేలం పాట నిర్వహించడం అనవాయితి. వాతావరణ ప్రతికూలతలు తట్టుకుని అధిక దిగుబడులు ఇచ్చే రకాల్లో కట్ట కుర్గాన్, రెడ్‌గ్లోట్‌, ఫ్లేమ్ సీడ్‌లెస్‌, కిస్‌మిస్‌ చోర్ని, క్రిమ్సన్‌ సీడ్‌లెస్‌, శరద్ సీడ్‌లెస్, కిస్మస్ రెజావిస్, మెరిడియన్ సీడ్‌లెస్, మెడిక, ప్రధానమైనవి వీటితో టైబుల్ జ్యూస్, వైన్ జ్యూస్ వంటివి తయారు చేస్తారు. కొలెస్ట్రాల్, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ద్రాక్ష మేలు చేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. కనీసం రోజుకు250 గ్రాముల వరకు ద్రాక్ష పళ్లు తీసుకుంటే జ్ఞాపకశక్తి బాగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న దృష్ట్యా ఆర్గానిక్‌ ద్రాక్ష పండ్లు తినేందుకు మక్కువ చూపుతున్నారు.

Fruits To Eat During Periods : నెలసరి సమయమా? ఈ పండ్లు తీసుకుంటే.. మీ హెల్త్​కు డోకా ఉండదు!

ఈ టిప్స్​ పాటించారంటే - అరటి పండ్లు చాలా రోజులు తాజాగా ఉంటాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.