ETV Bharat / state

మీరు తప్పు చేయకుంటే ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? : దస్తగిరి భార్య షబానా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 25, 2024, 8:57 PM IST

Dastagiri wife Shabana accuses CM Jagan: జైలులో మరోసారి తన భర్తకు డబ్బులు ఆశచూపి ప్రలోభాలకు గురి చేస్తున్నారని వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. సీబీఐ అధికారులు, సునీత పేర్లు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె తెలిపారు. దస్తగిరికి బెయిల్ రాకుండా పదేపదే అడ్డుపడుతున్నారని ఆమె మండిపడ్డారు. వివేకా హత్య కేసు జగన్‌కు ముందే తెలిసి ఉంటుందని షబానా ఆరోపించారు. తన కుటుంబానికి రక్షణ కావాలని ఆమె కోరారు.

Dastagiri wife Shabana accuses CM Jagan
Dastagiri wife Shabana accuses CM Jagan

Dastagiri wife Shabana accuses CM Jagan: వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షబానా సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. తన భర్తకు బెయిల్ వస్తే పీటీ వారెంట్ వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన భర్త 85 రోజులుగా కడప జైలులో మగ్గుతున్నారని షబానా వెల్లడించారు. వివేకా హత్యకేసులో సీబీఐ అధికారులు, సునీత పేర్లు చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారని ఆమె తెలిపారు. దస్తగిరికి బెయిల్ రాకుండా పదేపదే అడ్డుపడుతున్నారని ఆమె మండిపడ్డారు.

వివేకా హత్య కేసు - సీఎం జగన్‌పై దస్తగిరి భార్య షబానా విమర్శలు

డబ్బులు ఆశచూపి మా జీవితాలను నాశనం చేశారు: వివేకానందరెడ్డి హత్య విషయం సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగి ఉండదని అప్రూవర్​గా మారిన దస్తగిరి భార్య షబానా ఆరోపించారు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన తన భర్తను పులివెందులకు చెందిన అవినాష్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు వారి వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని షబానా ఆరోపించారు. అట్రాసిటీ కేసులో 3 నెలలుగా జైల్లో ఉన్న తన భర్తను కేసుల మీద కేసులు పెట్టి బయటికి రాకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా కేసులోనే ఐదు కోట్ల రూపాయలకు దస్తగిరి ఆశ పడినందుకు, ఇప్పటికే తమ కుటుంబం తీవ్రంగా నష్ట పోయిందన్న షబానా, తన భర్త జైలుకు వెళ్లినా కూడా వదలడం లేదని వాపోయారు. ప్రస్తుతం జైల్లో ఉన్న తన భర్తను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారులు వెళ్లి కలిసి కోట్ల రూపాయలు ఇస్తామని రాజీకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె పులివెందులలో మీడియాకు తెలిపారు.

మొద్దు శీనులాగా తన భర్తను కూడా జైల్లో హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని దస్తగిరి భార్య ఆందోళన

అప్రూవర్ గా మారినందుకు తీవ్రంగా ఇబ్బందులు: వివేకా హత్య విషయం అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డితోపాటు సీఎం జగన్ కు కూడా ముందే తెలిసి ఉంటుందని షబానా ఆరోపించారు. జగన్ కు తెలియకుండా జరిగే పని కాదన్న షబానా, తన భర్త అప్రూవర్ గా మారినందుకు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. తమను చంపడానికి కూడా వైఎస్సార్సీపీ నాయకులు వెనకాడటం లేదని ఆరోపించారు. తన కుటుంబానికి రక్షణ కావాలని కోరారు. సునీత తమకు డబ్బులు ఇచ్చారని వైఎస్సార్సీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ డబ్బే ఉంటే మూడు నెలల పాటు తన భర్త జైల్లో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. తన భర్త కోసం పోరాటం చేస్తుంటే, వైఎస్సార్సీపీ నాయకులు అంతం చేయాలనే కుట్ర పన్నుతున్నారని ఆక్షేపించారు.

దస్తగిరికి బెయిలు ఇవ్వొద్దన్న పోలీసులు - చంపేందుకు కుట్రలు పన్నుతున్నారన్న షబానా

కిడ్నాప్ కేసులో బెయిల్: నిన్న 24వ తేదీన వివేకా హత్యకేసు నిందితుడు దస్తగిరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎర్రగుంట్లలో మైనర్ కిడ్నాప్ కేసులో పోలీసులు దస్తగిరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కిడ్నాప్ కేసులో 86 రోజుల నుంచి కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నషేక్ దస్తగిరికి కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, వైఎస్సార్సీపీకి చెందిన నేతలు పిటీ వారెంట్లతో ఇబ్బందులు పెడుతున్నారని దస్తగిరి భార్య షబానా ఆరోపించారు.

అట్రాసిటీ కేసులో అరెస్టైన దస్తగిరి బెయిల్ పిటిషన్‌ కొట్టివేసిన కడప కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.