ETV Bharat / state

LIVE UPDATES : అవసరమైతే రెవెన్యూ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 3:47 PM IST

Updated : Feb 13, 2024, 7:13 PM IST

CM Revanth Reddy And Ministers Medigadda Tour : ప్రజాప్రతినిధులందరూ కాళేశ్వరం ప్రాజెక్ట్​లో జరిగిన లోపాలను వెలికితీసేందుకు ఆ ప్రాజెక్ట్​ను సందర్శించారు. ఈ టూర్​లో భాగంగా అక్కడే పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ జరిగింది. తదుపరి కార్యాచరణ ప్రజాప్రతినిధులు తెలియజేయనున్నారు.

Revanth Kaleshwaram Project Tour
CM Revanth Reddy And Ministers Medigadda Tour

07:12 PM

సాంకేతిక నిపుణులతో చర్చించాకే మేడిగడ్డ పునర్నిర్మాణంపై మా నిర్ణయం చెప్తాం : సీఎం

సాంకేతిక నిపుణులతో చర్చించాకే మేడిగడ్డ పునర్నిర్మాణంపై తమ నిర్ణయం చెప్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్రమాలకు పాల్పడిన ఇంజినీర్లను తొలగించామన్నారు. కాళేశ్వరం అక్రమాలకు బాధ్యులపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. అవసరమైతే రెవెన్యూ యాక్టుతో సొమ్ము రికవరీ చేస్తామని స్పష్టం చేశారు.

07:06 PM

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మేం భావించాం : సీఎం రేవంత్‌రెడ్డి

మేడిగడ్డపై సీబీఐ కంటే ఉన్నతమైన విచారణను కోరామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. న్యాయస్థానాలపై బీజేపీ నేతలకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించి కేసీఆర్‌ను రక్షించాలని చూస్తున్నారని ఆరోపించారు. వరంగల్‌కు వచ్చిన కిషన్‌రెడ్డి మేడిగడ్డకు ఎందుకు రాలేదని నిలదీశారు. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని మేం భావించామన్నారు.

07:03 PM

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు తెలంగాణ ప్రజల నమ్మకం: సీఎం

కూలింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు తెలంగాణ ప్రజల నమ్మకమని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. కుంగింది మేడిగడ్డ పిల్లర్లు కాదు 4 కోట్ల ప్రజల ఆశలని ఆవేదన వ్యక్తం చేశారు.

06 :58 PM

మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు: సీఎం రేవంత్‌రెడ్డి

మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని సీఎం రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ వైఖరిని స్పష్టంగా చెప్పాలన్నారు. బీఆర్ఎస్​, బీజేపీ బంధం అందరికీ తెలిసిందేనని అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కేసీఆర్‌ అవినీతిని బీజేపీ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు.

06 :44 PM

కుర్చి పోగానే కేసీఆర్‌కు నీళ్లు, ఫ్లోరైడ్‌ గుర్తుకు వచ్చాయి: రేవంత్‌రెడ్డి

కుర్చి పోగానే కేసీఆర్‌కు నీళ్లు, ఫ్లోరైడ్‌ గుర్తుకు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ శాసనసభకు వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని అన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది కేసీఆర్‌ సర్కార్ అని విమర్శించారు. ప్రాజెక్టులను కేంద్రం నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్‌ నిధులు కూడా ఇచ్చిందని ఆరోపించారు. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టు కుంగితే చిన్న విషయంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

06 :39 PM

చావునోట్లో తలపెట్టానని కేసీఆర్ పదేపదే అంటున్నారు: రేవంత్‌

'చావునోట్లో తలపెట్టానని కేసీఆర్ పదేపదే అంటున్నారు. అలా అని భావించే ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ప్రజలు రెండుసార్లు అవకాశం ఇస్తే ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగినప్పుడు పరిశీలించాలని భావించాం. ప్రతిపక్ష నేతలను మేడిగడ్డ వద్దకు కేసీఆర్‌ వెళ్లనివ్వలేదు. ఈసీ అనుమతి పొంది రాహుల్‌గాంధీ, నేను మేడిగడ్డను పరిశీలించాం. కుంగిన మేడిగడ్డను ఎవరూ చూడకుండా కప్పిపుచ్చారు. జరిగిన అవకతవకలపై సాగునీటిశాఖ మంత్రి విచారణకు ఆదేశించారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో భారీగా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ చెప్పింది. రీడిజైన్‌ పేరుతో కాళేశ్వరం చేపట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారు. తన బండారం బయటపడుతుందని కేసీఆర్ గ్రహించారు. తన అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే నల్గొండలో సభ పెట్టారు.'- సీఎం రేవంత్ రెడ్డి

06 :23 PM

కాళేశ్వరం ప్రాజెక్టుపై నేరవిచారణ జరిపిస్తాం : మంత్రి ఉత్తమ్‌

'కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగింది. మేడిగడ్డ బ్యారేజీకి రూ.4600 కోట్లు ఖర్చు చేశారు. ఎన్నికల ముందు ఫొటోలు తీసుకుని ప్రచారం చేసుకున్నారు. ప్రాజెక్టు కుంగి 5 నెలలు గడుస్తున్నా మేడిగడ్డ గురించి కేసీఆర్‌ మాట్లాడలేదు. గతంలో మొత్తం ప్రాజెక్టు చీఫ్‌ డిజైనర్‌, నిర్మించిన వ్యక్తిని నేనే అని కేసీఆర్‌ గొప్పగా చెప్పుకున్నారు. కేసీఆర్‌ హయాంలో అతిపెద్ద కుంభకోణం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై నేరవిచారణ జరిపిస్తాం.'- మంత్రి ఉత్తమ్‌

06 :21 PM

2020 సెప్టెంబర్‌లోనే ప్రాజెక్టులో సమస్యలు బయటపడ్డాయి: సీఎం

ప్రాజెక్టు పూర్తయినట్లు 2021 మార్చి 15న సర్టిఫికెట్‌ ఇచ్చారని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. 2020 సెప్టెంబర్‌లోనే ప్రాజెక్టులో సమస్యలు బయటపడ్డాయని చెప్పారు.

సమస్యలు బయటపడినా రూ.15,900 కోట్ల బిల్లులు చెల్లించారని విమర్శించారు.

05 :31 PM

కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదు: సీఎం

కాళేశ్వరం ద్వారా ఇప్పటివరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని చెప్పరని అన్నారు. అక్టోబర్‌ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారని చెప్పారు. నిర్మాణంలో నాణ్యతాలోపం ఉందని డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చెప్పిందని అన్నారు.

'2020-21లోనే సమస్య ఉందని ఇంజినీర్లు చెప్పారు. సమస్యను చక్కదిద్దే పని చేపట్టకుండా నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ.10,500 కోట్లు ఉన్నాయి.'-: సీఎం రేవంత్‌

05 :17 PM

మేడిగడ్డ ప్రాజెక్ట్​పై పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇస్తున్న అధికారులు

మేడిగడ్డ ప్రాజెక్ట్​పై అధికారులు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇస్తున్నారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పూర్తిగా వివరిస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజీని పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు

04 :31 PM

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయి: మంత్రి తుమ్మల

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో ఎన్నో లోపాలు ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైంది మేడిగడ్డ బ్యారేజీ అని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిలుస్తేనే ఎక్కడికైనా ఎత్తిపోసేదని పేర్కొన్నారు. మేడిగడ్డలోనే నీరు ఉండని పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా జలాశయాలకు నీటిని ఎలా ఎత్తిపోస్తారని ప్రశ్నించారు.

03 :49 PM

మేడిగడ్డ బ్యారేజీని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలిస్తున్నారు. బ్యారేజీలో కుంగిన ప్రాంతాన్ని ప్రజాప్రతినిధులు పరిశీలిస్తున్నారు. ఇందులో ఐదుగురు ఎంఐఎం నేతలు ఉన్నారు. మేడిగడ్డ పర్యటనకు బీఆర్ఎస్​, బీజేపీ సభ్యులు దూరంగా ఉన్నారు.

03 :45 PM

మేడిగడ్డ ప్రాజెక్ట్​కు చేరుకున్న ప్రజాప్రతినిధుల బృందం

మేడిగడ్డ ప్రాజెక్ట్​కు ప్రజాప్రతినిధుల బృందం చేరుకున్నారు. ఆ ప్రాజెక్ట్​ను సందర్శిస్తున్నారు.

03 :40 PM

కాళేశ్వరం ప్రాజెక్ట్​పై​ సీఎం రేవంత్​ రెడ్డి ట్వీట్​

ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం కేసీఆర్ ధనదాహానికి బలైందని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. రూ.97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకూ నీళ్లివ్వలేదని మండిపడ్డారు.
డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీ తానై కట్టానని కేసీఆర్ చెప్పారని తెలిపారు. మేడిగడ్డ కూలి నెలలు గడిచినా కేసీఆర్‌ నోరు విప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డను మళ్లీ నిర్మించాలని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చెప్పిందని గుర్తు చేశారు. ప్రజలకు నిజాలు చెప్పాలనే ప్రజాప్రతినిధుల మేడిగడ్డ పర్యటన చేస్తున్నామని పేర్కొన్నారు.
కేసీఆర్‌ సహా బీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానించామని, వారితో పాటు బీజేపీ సభ్యులు కూడా మేడిగడ్డ సందర్శనకు రాలేదని ఆయన అధికార ఎక్స్​ ఖాతాలో ట్వీట్​ చేశారు.

Last Updated : Feb 13, 2024, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.