ETV Bharat / state

జగన్​ సభలకు ఆర్టీసీ బస్సులు- మండుటెండలో ప్రయాణికుల అవస్థలు - CM Meeting People Problems

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 1:38 PM IST

CM Meeting People Problems in Palnadu District :ఆర్టీసీ బస్సులన్నీ జగన్​ సభలకు తరలించడంతో ప్రయాణికులు పాట్లు పడుతున్నారు. కాలేజీ విద్యార్థులు సహా సామాన్య ప్రజలు బస్టాప్​లలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బస్సు వచ్చినా ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో గమ్యాన్ని చేరడం చాలా కష్టతరమవుతుందని జనాలు వాపోతున్నారు.

cm_meeting_people_problems_in_palnadu_district
cm_meeting_people_problems_in_palnadu_district

CM Meeting People Problems in Palnadu District : సీఎం సార్​ బస్సు యాత్రలు జనాల పాలిట బందు యాత్రలయ్యాయి. పిల్లల స్కూల్​ దగ్గర నుంచి అత్యవసర అంబులెన్స్​లనూ ట్రాఫిక్​లో గంటల తరబడి నిలబెట్టిన ఘనత జగనన్నకే దక్కింది. రాష్ట్రమంతా తిరుగుతూ పరదాల మాటున ప్రసంగాలు చెప్తూ ప్రజలను ముప్పతిప్పలు పెడుతూ వచ్చాడు.డ బ్బులిచ్చి సభలకు తరలించడం, మందు, విందు అని ఆశలు చూపి దినసరి కూలీల కుటుంబాలలో చిచ్చు రేపారు.

సీఎం జగన్‌ ఎక్కడ పర్యటించినా ప్రజలకు తప్పని తంటాలు - బస్సుల తరలింపుతో బస్టాండుల్లో పడిగాపులు

RTC Buses Diverted to CM Jagan 'Siddham' Public Meetings : జగన్​ సిద్ధం సభలకు ప్రజలు సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఎండలు మండిపోతుంటే బస్సు కోసం వేచి చూసీ చూసీ అలసి పోతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని బాధ పడుతున్నారు. సీఎం సభ పెట్టేది ప్రజల కోసమా సమస్యలు సృష్టించడం కోసమా అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎం బస్సు యాత్రా మజాకా - ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు - jagan bus yatra traffic diversions

Passengers Faced Problems : పల్నాడు జిల్లాలో సీఎం జగన్‌ సభ వల్ల సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పిడుగురాళ్లలో నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం సభకు ఆర్టీసీ అధికారులు జిల్లా నుంచి 200 బస్సులు కేటాయించారు. ఫలితంగా బస్సుల కోసం ప్రయాణీకులు, విద్యార్థులు బస్టాండ్‌లలో ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. అధికారుల తీరుతో సమయానికి గమ్యస్థానం చేరుకోలేమని కొందరు ప్రయాణీకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నరసరావుపేట బస్టాండ్‌లో ఒక బస్సు వచ్చిందంటే ప్రయాణీకులు సీటు కోసం ఒక్కసారిగా ఎగపడాల్సిన పరిస్థితి నెలకొంది.

జగన్ సభలు ముగిసే వరకూ తిప్పలు తప్పవా? - ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల ఆగ్రహం - jagan bus yatra passengers problems

CM Jagan 'Siddham' Public Meeting Palnadu : ఆర్టీసీ బస్సులన్నీ జగన్న సభలకు తరలించడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. కాలేజీ విద్యార్థులు సహా సామాన్య ప్రజలు బస్టాప్​లలో గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. బస్సు వచ్చినా ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో గమ్యాన్ని చేరడం చాలా కష్టతరమవుతుందని జనాలు వాపోతున్నారు. సీఎం సభలు మా ప్రాణాలమీదకు వచ్చాయని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరాల కోసం పక్క ఊర్లకు ప్రయాణించాలన్నా ఒణుకు పుడుతుందని సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు.

జగన్ రోడ్​షోలో డబ్బులు, మద్యం - మత్తులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు - alcohol supply in cm meeting

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.