ETV Bharat / state

అధికారం అండతో కొల్లేరును గుల్ల చేస్తున్న అక్రమార్కులు - జగన్‌ హామీ డొల్ల

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 12:34 PM IST

CM Jagan Negligence on Kolleru Lake: ఆసియాలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సుగా చరిత్రకెక్కిన కొల్లేరు పరిరక్షణను సీఎం జగన్‌ గాలికొదిలేశారు. అధికారంలోకి రాకముందు, వచ్చాక తన నోటితో ఇచ్చిన హామీలను ఏట్లో కలిపేశారు. పరిరక్షణ బాధ్యత తీసుకోకపోగా రివర్స్‌లో భక్షకులకు కొమ్ముకాస్తున్నారు. రీసర్వే చేయించి ఆక్రమణల అంతుచూస్తామని ప్రగల్భాలు పలికిన జగన్‌ అధికార పార్టీ నేతలు కొల్లేరును కకావికలం చేస్తున్నా మేల్కోవడం లేదు.

CM_Jagan_Negligence_on_Kolleru_Lake
CM_Jagan_Negligence_on_Kolleru_Lake

అధికారం అండతో కొల్లేరును గుల్ల చేస్తున్న అక్రమార్కులు

CM Jagan Negligence on Kolleru Lake : కొల్లేరు సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పాదయాత్రలో నమ్మబలికిన జగన్‌ ఇప్పుడా హామీనే కొల్లేటిలో కలిపేశారు. ప్రతిపక్షంలో ఉండగానే కాదు అధికారంలోకి వచ్చాక కూడా కొల్లేరు ప్రజల్ని జగన్ ఇలా వంచించారు.

Kolleru Lake Situation in AP : ఈ ఐదేళ్లలో కొల్లేటి కష్టాలకు జగన్‌ ఒక్కటంటే ఒక్కపరిష్కారమూ చూపలేదు. వైఎస్సార్సీపీ నాయకులే కొల్లేరును చెరబడుతుంటే చేష్టలుడిగి చూశారు. డ్రెయిన్లు ధ్వంసం చేస్తున్నా పట్టించుకోలేదు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhar Reddy) హయాంలో కొల్లేరు ఆపరేషన్‌ నిర్వహించి కొంతమేర ఆక్రమణలు తొలగించారు. కానీ ఆయన తనయుడు జగన్ ఏలుబడిలో వేల ఎకరాలు మళ్లీ కబ్జాకోరుల చేతుల్లోకి వెళ్లాయి. సుప్రీం ఆదేశాల ప్రకారం గానీ, ఆక్వా సాగుకు చట్ట ప్రకారం గానీ ఐదో కాంటూరు పరిధిలో చెరువుల తవ్వకానికి ఆస్కారమే ఉండదు. కానీ అధికారం అండతో కొల్లేరును కకావికలం చేస్తున్నారు. ఏటా వేసవిలో వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల మేర చెరబడుతున్నారు. కొందరు అధికారపార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే కొల్లేరు విధ్వంసం కొనసాగింది.

నాలుగో వంతు ఆక్రమణ : కొల్లేరు సరస్సు 83వేల 982 ఎకరాల్లో పునరుద్ధరించిన తర్వాత అందులో 15వేల 742 ఎకరాలు కబ్జా చేశారని జగన్‌ ప్రభుత్వమే 2021లో అధికారికంగా జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదించింది. కొల్లేటి ఆక్రమణలు అరికట్టడంలో విఫలమైనట్లు పరోక్షంగా అంగీకరించింది. అప్పుడూ ఆక్రమణలు తొలగించాలనే ఆలోచన జగన్‌కు రాలేదు. ఫలింతగా ఆ తర్వాత రెండు సంవత్సరాల్లో దాదాపు మరో 2,300 ఎకరాల వరకు కొల్లేరు కబ్జాకు గురైంది. కొల్లేరు సరస్సు ప్రస్తుతం నాలుగో వంతు ఆక్రమణల్లోనే ఉంది.

అటవీ అధికారులూ కబ్జాదారులకు సలహాలు : కొల్లేరు కబ్జాకాండలో వైఎస్సార్సీపీ సర్కార్‌లోని కొందరు పెద్దలే సూత్రధారులనే విమర్శలున్నాయి. వైఎస్సార్సీపీ తరపున ఏలూరు జిల్లాను పర్యవేక్షించే ఒక నాయకుడి కనుసన్నల్లోనే ఆక్రమణలు విస్తృతమయ్యాయి. రాష్ట్రస్థాయి ఒత్తిళ్లతో స్థానిక అటవీశాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఎప్పట్నుంచో అక్కడ తిష్టవేసుకుని కూర్చున్న కొందరు అటవీ అధికారులూ కబ్జాదారులకు సలహాలిస్తున్నారనే ప్రచారం ఉంది.

ముందుకు రాని గుత్తేదారులు : ఉప్పు నీరు ఎగదన్ని ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని ఉప్పుటేరు ఆనుకుని సాగు చేస్తున్న చెరువులకు నీటి సమస్య ఏర్పడుతోంది. ఉప్పుటేరు లో చేపలు పట్టుకునిజీవించే వేలాది మత్స్యకార కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఉప్పుటేరుపై 3 చోట్ల రెగ్యులేటర్లు నిర్మించాల్సి ఉంది. కొల్లేరులో ప్రవాహాలు ఎక్కువ ఉన్నప్పుడు సముద్రంలో కలిసేందుకు ప్రవాహాలు లేనప్పుడు సముద్ర నీరు ఎగదన్నకుండా ఈ రెగ్యులేటర్లు నియంత్రించాల్సి ఉంటుంది. ఈ రెగ్యులేటర్ల నిర్మాణం వైఎస్సార్సీపీ హయాంలో అసలు ప్రారంభమే కాలేదు. బిల్లుల చెల్లిస్తారనే నమ్మకం లేకపోవడం వల్ల రెగ్యులేటర్ల నిర్మాణాలకు జలవనరులశాఖ టెండర్లు పిలిచినా గుత్తేదారులు ఎవరూ ముందుకు రావడం లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.