ETV Bharat / state

ఐఏఎస్ కన్ఫర్మెంట్​ను వాయిదా వేయాలి - యూపీఎస్సీకి చంద్రబాబు లేఖ - Chandrababu Letter to UPSC Chairman

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 3:41 PM IST

Updated : May 24, 2024, 6:12 PM IST

Chandrababu Naidu Letter to UPSC Chairman: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఐఏఎస్​ కన్ఫర్మెంట్​ను వాయిదా వేయాలని యూపీఎస్​సీకి చంద్రబాబు లేఖ రాశారు. ఐఎఎస్​కు రాష్ట్ర కేడర్ ఆఫీసర్‌ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని లేఖలో పేర్కొన్నారు. క్రొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని లేఖలో కోరారు.

Chandrababu Naidu Letter to UPSC Chairman
Chandrababu Naidu Letter to UPSC Chairman (ETV Bharat)

Chandrababu Naidu Letter to UPSC Chairman: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఐఏఎస్ కన్ఫర్మెంట్​ను వాయిదా వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు యూపీఎస్సీకి లేఖ రాశారు. ఐఎఎస్​కు రాష్ట్ర కేడర్ ఆఫీసర్​ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు.

క్రొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని, జాబితా తయారీలో పారదర్శకత లేదని ఆరోపించారు. జాబితాను పునఃపరిశీలించి ఎంపిక ప్రక్రియను కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకూ వాయిదా వేయాలని చంద్రబాబు కోరారు.

జగన్‌ సర్కారు చివరి నిమిషం చెల్లింపులను నిలిపివేయండి- గవర్నర్​కు చంద్రబాబు లేఖ - Chandrababu Letter to Governor

అయినవారిని అందలం ఎక్కించేలా ప్రభుత్వంలోని పెద్దల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర కేడర్​లోని అస్మదీయులైన సీనియర్ కేడర్​లోని కొందరికి ఐఎఎస్​లుగా కన్ఫర్మేషన్ కోసం వైసీపీ ప్రభుత్వం యూపీఎస్సీకి జాబితా పంపింది. స్టేట్ సివిల్ సర్వీసులోని సీనియర్ అధికారులకు కన్ఫర్డ్ ఐఎఎస్​లుగా పదోన్నతులు కల్పించేందుకు సీఎంఓ కార్యాలయం అన్ని రకాలుగానూ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈ జాబితా పంపటంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

అస్మదీయులు, ప్రభుత్వ పెద్దల కులాలకు చెందిన వారిని రాష్ట్రంలో ఐఎఎస్ కేడర్​లోకి చొప్పించేందుకు వైసీపీ ప్రభుత్వం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీ నుంచి కొందరు సీనియర్ అధికారుల జాబితాను స్టేట్ సివిల్ సర్వీసు కు చెందిన కొందరు సీనియర్ అధికారులకు కన్ఫర్డ్ ఐఏఎఎస్​లుగా పదోన్నతులు కల్పించేందుకు యూపీఎస్సీకి ప్రభుత్వం జాబితా పంపింది. ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ముఖ్య అధికారి ఓఎస్డీ పేరుతో సహా మొత్తం 10 మంది జాబితాను ప్రభుత్వం యూపీఎస్సీకి పంపింది. కన్ఫర్డ్ ఐఎఎస్​లుగా పదోన్నతుల కోసం వీరందరికీ జూన్ 7 తేదీన ఇంటర్వూలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రభుత్వ జీతం తీసుకుంటూ వైసీపీకి ఊడిగం - ఏపీఎండీసీలో ఉద్యోగులుగా అధికార పార్టీ నేతలు - YSRCP Leaders as APMDC Employees

పై స్థాయిలో ఒత్తిళ్లు: ఇందుకోసం ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు పై స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చినట్టు సమాచారం. జూన్ 7 తేదీన 9 గంటలకు దిల్లీలోని యూపీఎస్సీ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం సిఫార్సు చేసిన కొందరు అధికారులకు సమాచారం అందింది. ఆడిట్ విభాగంలో పనిచేస్తూ ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ధనుంజయ్ రెడ్డికి ఓఎస్డీగా గడికోట మాధురి, భూమిరెడ్డి మల్లిఖార్జున రెడ్డి, ఎం.కె.వి శ్రీనివాసులు, మామిళ్లపల్లి వరప్రసాద్. డి. దేవానందరెడ్డిలను ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సిందిగా యూపీఎస్సీ పేర్కొంది. అలాగే అదే రోజు మద్యాహ్నం 1.30కు యూపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వూకు రావాల్సిందిగా పీఎస్ సూర్యప్రకాశరావు, గుండిపాగ రాజారత్నం, సీబీ హరినాథ రెడ్డి, సీహెచ్ పుల్లారెడ్డి, ఏఏఎల్ పద్మావతిలకు సమాచారం వచ్చింది.

వారికే పదోన్నతి వచ్చేలా ప్రయత్నాలు: గడచిన ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ అనుకూలురుగా ఉన్న వీరందరికీ పదోన్నతులు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్ స్థాయిలో నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పదిమందిలో కేవలం ఇద్దరికి మాత్రమే ఐఎఎస్​లుగా పదోన్నతులు కల్పించేందుకు ఖాళీలు ఉన్నాయి. స్టేట్ సివిల్ సర్వీసులోని ఇద్దరికి పదోన్నతులు కల్పించేలా ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీఎంకు దగ్గరగా ఉండే ఓ అధికారి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. గత ఏడాదిలోనూ ధనుంజయ్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసిన నీలకంఠారెడ్డికి కన్ఫర్డ్ ఐఎఎస్​గా పదోన్నతి కల్పించారు. ఇప్పుడు కూడా ఆయనకు ఓఎస్డీగా పనిచేస్తున్న మాధురితో పాటు రెడ్డి కులానికి చెందిన వారికే ఐఏఎస్ పదోన్నతి వచ్చేలా ప్రయత్నాలు జరిగాయని తెలుస్తోంది.

అస్మదీయులకు దోచిపెట్టేందుకే - మంగంపేట ముగ్గురాయి టెండర్ల రద్దు వెనుక భారీ స్కెచ్‌!

మరోవైపు ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికారులకు ఐఏఎస్​లుగా పదోన్నతులు కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడో తేదీన దిల్లీలో జరగాల్సిన యూపీఎస్సీ ఇంటర్వూలను వాయిదా వేయాల్సిందిగా ఏపీలోని ప్రతిపక్షనేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఎన్నికల సంఘానికి, యూపీఎస్సీకి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు రాష్ట్ర కేడర్ కు చెందిన అధికారుల జాబితాను కన్ఫర్డ్ ఐఎఎస్​ల కోసం పంపించటం సరికాదని దీనిలో పారదర్శకత లేదని పునఃపరిశీలించాల్సిందిగా చంద్రబాబు యూపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు.

ముగ్గురాయి టెండరూ అస్మదీయులకే - డిమాండ్‌ ఉన్నా తక్కువ ధరకే

Last Updated : May 24, 2024, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.