ETV Bharat / state

కృష్ణా జలాలపై పోరుబాటు - నల్గొండ వేదికగా నేడు బీఆర్​ఎస్​ భారీ బహిరంగ సభ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 13, 2024, 7:40 AM IST

BRS Public Meeting in Nalgonda : కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ నినాదంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్గొండ వేదికగా బహిరంగ సభలో పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా నదీ యజమాన్య బోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ సభ నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కావడంతో భారీ జన సమీకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడి నుంచే గులాబీ పార్టీ అధినేత లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

Telangana Parliament Elections 2024
BRS Public Meeting in Nalgonda
బీఆర్ఎస్ బహిరంగ సభ - హాజరు కానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

BRS Public Meeting in Nalgonda : సాగు నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు అప్పగించిందని చెబుతున్న బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించినందుకు నిరసనగా నల్గొండలో ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొననున్నారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్​

Telangana Parliament Elections 2024 : అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నిర్వహించనున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచే లోక్​సభ ఎన్నికలకు శంఖారావాన్ని పూరించనున్న కేసీఆర్‌, ఏం మాట్లాడనున్నారనే అంశంపై ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభకు ఉమ్మడి నల్గొండతో పాటు కృష్ణా పరివాహకంలోని మహబూబ్‌నగర్‌, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి పెద్దఎత్తున రైతులు, ప్రజల్ని తరలించాలని నిర్ణయించారు.

బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు భారీ కాన్వాయ్‌తో ఉదయం తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్ నుంచి నల్గొండకు రానున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సాయంత్రం హెలీకాప్టర్​లో వచ్చి సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు. కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య అని, కాంగ్రెస్ పార్టీకి కేంద్రంతో లోపాయికారి ఒప్పందం ఉందని అందుకే కేఆర్ఎంబీకి అప్పజెప్పారని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.

'కృష్ణా నదీ ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్‌ ప్రభుత్వ తప్పిదాలు' - అసెంబ్లీలో ప్రభుత్వం నోట్

"కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కాపాడుకోవడం కోసం ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ​కేఆర్ఎంబీ(KRMB) చేతికి ప్రాజెక్టులు ఇవ్వకుండా మా ప్రభుత్వం కాపాడుకుంది. దురదృష్టవశాత్తు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అనుభవలేమి, అవగాహనా రాహిత్యం, అంతర్గత ఒప్పందాలు లేదా ఇతర విషయాల వల్ల ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పింది. మళ్లీ మన ప్రాజెక్ట్​లు సాధించుకోవాలని, కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా తేల్చాలని ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం." -మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి

EX Minister Jagadish Reddy On KRMB Issue : మరోవైపు బీఆర్ఎస్ సభకు పోటీగా అధికార కాంగ్రెస్ పార్టీ నల్గొండలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. నల్గొండలో నీటి కష్టాలకు కేసీఆర్ కారణమని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. ఉమ్మడి నల్గొండలోని పెండింగ్ ప్రాజెక్టులను కుర్చీ వేసుకొని కూర్చొని పూర్తి చేస్తామని చెప్పిన మాజీ సీఎం కేసీఆర్‌, జిల్లా ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని సభకు వస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు శాంతి భద్రతల దృష్ట్యా సమస్యలు తలెత్తకుండా పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టింది.

ప్రజాప్రతినిధుల మేడిగడ్డ టూర్ ​- షెడ్యూల్​ ఇదే!

కృష్ణా జలాల వివాదం రాష్ట్ర ప్రజలకు జీవన్మరణ సమస్య : మాజీ మంత్రి జగదీశ్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.