ETV Bharat / state

ప్రైవేటు సంస్థలకు ధీటుగా ప్రభుత్వ సంస్థలు ఎదగాలి - పాడి రంగం ప్రగతికి సాయం చేస్తాం : భట్టి విక్రమార్క

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 4, 2024, 2:53 PM IST

Bhatti Vikramarka on Dairy Sector Telangana 2024 : డెయిరీ రంగాన్ని యోగ్యంగా తీర్చిదిద్దుతామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇవాళ హైదరాబాద్​లో మాదాపూర్​లోని హెటెక్స్ ప్రాంగణంలో నిర్వహించిన 50వ డెయిరీ ఇండస్ట్రీ సదస్సు - 2024ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.

50th Dairy Conference 2024 in Hyderabad
Bhatti Vikramarka Launched 50th Dairy Conference 2024

పాడి రంగం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తాం : భట్టి విక్రమార్క

Bhatti Vikramarka on Dairy Sector Telangana 2024 : రాష్ట్రంలో పాడి ఉత్పత్తి, వినియోగాన్ని సమాన దృష్టితో చూస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ పశుసంవర్థక, డెయిరీ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని తెలిపారు. హైదరాబాద్​లో మాదాపూర్​లోని హెటెక్స్ ప్రాంగణంలో ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 50వ డెయిరీ ఇండస్ట్రీ సదస్సు - 2024ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. మూడు రోజులపాటు జరగనున్న సదస్సు, ప్రదర్శనలో పరిశ్రమ పెద్దలు, శాస్త్రవేత్తలు, పాడి రైతులు పాల్గొన్నారు.

Bhatti Vikramarka Launched 50th Dairy Conference 2024 : ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డెయిరీ ప్రదర్శనను ఉపముఖ్యమంత్రి సందర్శించారు. పలు స్టాళ్లు కలియ తిరిగి పరిశీలించారు. పలువురు స్టాళ్ల యజమానులు, నిర్వాహకులతో మాట్లాడారు‌. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించామని భట్టి చెప్పారు.

రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా డెయిరీ రంగాన్ని యోగ్యంగా తీర్చిదిద్ది పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు విస్తృతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని భట్టి తెలిపారు. పాడి రంగం అభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న క్రమంలో ఆర్ఆర్ఆర్ చుట్టూ విభిన్న క్లస్టర్ల ఏర్పాటు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో భారీ డెయిరీ క్లస్టర్ కూడా నెలకొల్పుతామని, పారిశ్రామికవేత్తలు డెయిరీ పరిశ్రమ వృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి భట్టి విక్రమార్క కోరారు.

'ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించాం. రాష్ట్రంలో డెయిరీ రంగాన్ని యోగ్యంగా తీర్చిదిద్దుతాం. పాడి రంగం అభివృద్ధి కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ఆర్ఆర్ఆర్ చుట్టూ విభిన్న క్లస్టర్ల ఏర్పాటు ప్రణాళికలు రచిస్తున్నాం. డెయిరీ క్లస్టర్ కూడా నెలకొల్పుతాం.' - భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి

50th Dairy Conference 2024 in Hyderabad : వ్యవసాయ ఆధారిత పాడి రంగం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వాతావరణ మార్పులు నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో పాడి రంగం ప్రధాన భూమిక పోషిస్తుండటం శుభపరిమాణమం అని తెలిపారు. ఈ రంగంలో దక్షిణాది మహిళల తోడ్పాటు అధికంగా ఉందని చెప్పారు. ఏకంగా భారత ప్రజలను పోషించే స్థాయికి మహిళలు ఎదిగారని ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో పాల వాడకానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేదని, భవిష్యత్తులో పాడి పరిశ్రమ ముందుకు వెళ్లాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ సంస్థలు ఎదగాలని తుమ్మల ఆకాంక్షించారు.

'భారత ప్రజలను పోషించే స్థాయికి మహిళలు ఎదిగారు. రాష్ట్రంలో పాల వాడకానికి తగ్గట్టుగా ఉత్పత్తి లేదు. భవిష్యత్తులో పాడి పరిశ్రమ ముందుకు వెళ్లాల్సి ఉంది. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వ సంస్థలు ఎదగాలి.'-తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి

'దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గుతోంది - కేంద్ర కేబినెట్​లో మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి'

బీజేపీ సిద్ధాంతంతో మాకు సంబంధం లేదు - ప్రొటోకాల్​లో భాగంగానే ప్రధాని మోదీకి రేవంత్ స్వాగతం : మంత్రి సీతక్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.