ETV Bharat / state

ఎన్నికల్లోపు ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: బొప్పరాజు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2024, 3:18 PM IST

AP JAC Amaravati Demands: ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే తమకు రావాల్సిన బకాయిలు, మధ్యంతర భృతి ప్రకటించాలని ఏపీ జేఎసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 6700 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఏపీ జేఎసీ అమరావతి ఉద్యోగ సంఘంలోప్రత్యేకంగా మహిళా విభాగం ఏర్పాటు చేసినట్లు బొప్పరాజు వెల్లడించారు.

AP JAC Amaravati  Demands
AP JAC Amaravati Demands

AP JAC Amaravati Demands: ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న అవేదన, అసంతృప్తి, బాధ ఉద్యోగుల్లో ఉందని ఏపీ జేఎసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం 6700 కోట్ల మేర బకాయిలు పడిందని, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలంని డిమాండ్ చేశారు. ఏపీ జేఎసీ అమరావతి ఉద్యోగ సంఘంలో మహిళా విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఉద్యోగులకు ప్రభుత్వం 6700 కోట్ల బకాయిలు: ప్రభుత్వ ఉద్యోగులలో మహిళల సంఖ్య 50 శాతం కంటే ఎక్కువ ఉందని ఏపీ జేఎసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. అందుకే ఏపీ జేఎసీ అమరావతి రాష్ట్ర, జిల్లాల మహిళా యూనిట్ లను ఏర్పాటు చేసుకుందని అన్నారు. ఉద్యోగ సంఘాల చరిత్రలోనే మహిళా విభాగాలు ఏర్పాటు కావడం తొలిసారని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించారని బొప్పరాజు తెలిపారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించామన్నారు. ఇంతగా సహకరిస్తే తమకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని అన్నారు. గతంలో ఉద్యమం చేసి ఆర్ధికేతర అంశాలను సాధించుకున్నామని, కానీ ఇప్పటికీ ఆర్థిక పరమైన అంశాలు పరిష్కారం కాలేదని బొప్పరాజు పేర్కొన్నారు. మంత్రివర్గం ఉప సంఘం రేపు మాపు అంటూ బకాయిల చెల్లింపుపై మాటలు దాట వేస్తున్నారన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం 6700 కోట్ల మేర బకాయిలు పడిందని అన్నారు. పోలీసులకు సరెండర్ లీవ్ లు గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వం బకాయి పెట్టలేదని అన్నారు. ఉద్యోగులుగా తాము బోనస్ లు అడగటం లేదు తమకు రావాల్సిన బకాయిలు మాత్రమే డిమాండ్ చేస్తున్నామని బొప్పరాజు తెలిపారు.
బకాయిల జీవో జారీ చేశారు, నిధులు చెల్లింపు మరిచారు- సీఎం హామీలే అమలవ్వకపోతే ఎలా? : బొప్పరాజు

మధ్యంతర భృతి ప్రకటించాలి: ఇప్పటికే ఎన్నికల విధుల్లో చేరిన ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు చెల్లించాలని బొప్పరాజు పేర్కొన్నారు. హెల్త్ స్కీమ్ కే జబ్బు వచ్చింది దానిని నయం చేస్తే ఉద్యోగులు వైద్యం చేయించుకుంటామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్స చేయడానికి నెట్వర్క్ ఆస్పత్రులు నిరాకరిస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న అవేదన, అసంతృప్తి, బాధ ఉద్యోగుల్లో ఉందని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపే తమకు బకాయిలు, మధ్యంతర భృతి ప్రకటించాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

'నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం, ఇక తప్పదు' - 27వ తేదీ నుంచి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె

ఏపీ జేఎసీ అమరావతిలో మహిళా విభాగం: ఏపీ జేఎసీ అమరావతి ఉద్యోగ సంఘంలో మహిళా విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నామన్నారు. 26 జిల్లాలతో పాటు రాష్ట్ర మహిళా యూనిట్ లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. మహిళా విభాగాల్లో అంతర్గత ఫిర్యాదుల విభాగం సరిగ్గా పని చేయాలని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపుల పై తక్షణమే చర్యలు చేపట్టాలని, మెటర్నిటీ లీవ్ విషయంలోనూ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నేతలు డిమాండ్‌చేశారు.
డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం - 11న ఉద్యమ కార్యాచరణ: బండి శ్రీనివాసరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.