ETV Bharat / state

జీరో వయొలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలి: ముఖేష్ కుమార్ మీనా

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 14, 2024, 10:06 AM IST

AP_CEO_Mukesh_Kumar_Meena_Video_Conference
AP_CEO_Mukesh_Kumar_Meena_Video_Conference

AP CEO Mukesh Kumar Meena Video Conference: రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జీరో వయొలెన్స్, నో రీపోల్ ప్రధాన మంత్రాలు కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులకు సూచించారు. వీటికి అనుగుణంగా జిల్లా ఎన్నికల, పోలీసు అధికారులు ప్రణాళికా బద్దంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. రెండు మంత్రాల అమల్లో ఎటువంటి తేడా వచ్చినా దానికి సంబందిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుదని స్పష్టం చేశారు.

AP CEO Mukesh Kumar Meena Video Conference: ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను (Andhra Pradesh Elections) ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) ముఖేష్ కుమార్ మీనా దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ఏర్పాట్లపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల సంసిద్దతకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఎన్నికల్లో హింసకు ఎటువంటి తావు ఉండకూడదన్నారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బూత్ క్యాప్చరింగ్​కు అవకాశం లేకుండా పటిష్టమై బందోబస్తు ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకి ముందు, తరువాత జిల్లాల అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కంట్రోల్ రూముల ద్వారా నిరంతర పర్యవేక్షణ, రాజకీయ పార్టీల అనధికార ప్రకటనల డిఫేస్మెంట్, 50 శాతం పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్, ఎన్నికల షెడ్యూలు ప్రకటన అనంతరం రోజువారీ పంపాల్సిన నివేదికలు తదితర అంశాలను అధికారులకు వివరించారు.

పెండింగ్​ ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ వేగంగా పూర్తి చేయాలి: ముఖేష్ కుమార్ మీనా

త్వరలో ఎన్నికల షెడ్యూలు ప్రకటించనున్న నేపథ్యంలో ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ పక్రియను వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారులను ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్ ద్వారానే బట్వాడా చేయాలని, ఒక్క పాడేరు ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతాల్లో మాన్యువల్​గా పంపిణీ చేయడానికి వీలులేదని స్పష్టం చేశారు. సకాలంలో పోస్టల్ ద్వారానే బట్వాడా చేయడానికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

పెండింగ్ ఫార్మ్​లను సకాలంలో పరిష్కరించాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత, ఫార్మ్‌ల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీలు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్లు పలు వార్తా పత్రికల్లో కథనాలతో పాటు పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిన సంబంధిత నివేదికలను తమకు వెంటనే పంపాలని ఆదేశించారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు పోలీస్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను లా అండ్ ఆర్డర్ అదనపు డీజీపీ శంక్బ్రత్ బాగ్చీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుతో పాటు ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి అమచేయనున్న బందోబస్తు కార్యాచరణ ప్రణాళికను వివరించారు.

అంతకు మించి ఉంటే నగదుతోపాటు వాహనాలూ సీజ్‌ - ఈసీ కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.