ETV Bharat / state

ఒక్క ఆలోచన వారికి జీవితాన్నిచ్చింది- కలలు నెరవేర్చుకుంటున్న యువతులు - HOME TUTORS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 12:30 PM IST

Anantapur Girls Self Employed as Home Tutors: కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందన్న ఒకే ఒక్క కారణంతో ఉన్నత విద్యకు దూరమవుతుంటారు ఎంతోమంది. మరీ ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు చెప్పించేందుకు తల్లిదండ్రులే వెనుకాడుతుంటారు. ఆ యువతులూ ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొన్నారు. కుటుంబాల నుంచి కనీస అవసరాలకూ డబ్బులు అందక నానా అవస్థలూ పడ్డారు. కట్‌చేస్తే ఇప్పుడు తాము నేర్చిన చదువునే పెట్టుబడిగా పెట్టి ఉపాధి పొందుతున్నారు. తల్లిదండ్రులకే భరోసా ఇస్తూ లక్ష్యం దిశగా పయనిస్తున్నారు. మరి, ఏ ఆలోచన వారిని కలల బాటలో నడిపిస్తోందో ఇప్పుడు చూద్దాం.

Anantapur Girls Self Employed as Home Tutors
Anantapur Girls Self Employed as Home Tutors (ETV Bharat)

Anantapur Girls Self Employed as Home Tutors : నిరుపేద కుటుంబాలకు చెందిన యువతులు ఉన్నత చదువులకోసం నగరబాట పట్టిన వారు కొందరైతే ఉన్నత ఉద్యోగం సాధించాలనే ఆశయంతో పోటీపరీక్షలకు సిద్ధం అవుతున్నవారు మరికొందరు. సరైన ఆర్థిక ఆసరా లేకపోవడంతో అటు ఇంటికి తిరిగి వెళ్లలేక హాస్టల్ ఫీజులు చెల్లించలేక సతమతయ్యారు. కానీ ఒకే ఒక్క ఆలోచన వీరికో ఆదాయ మార్గాన్ని చూపింది. కుటుంబానికి అండగా నిలబడుతూనే లక్ష్యసా‌ధనలో ముందడుగు వేసేలా చేసింది.

ఉన్నత చదువులు, కోచింగ్ రీత్యా అనంతపురం నగరంలోని పలు లేడీస్ హాస్టళ్లలో ఉంటున్నారు ఈ యువతులు. ఎక్కువ మంది గ్రామీణ నేపథ్యానికి చెందినవారే. హాస్టల్ ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు వెచ్చించే స్థోమత లేక ఇక్కట్లు పడ్డారు. చదువు మానేయమని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడినీ ఎదుర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులకు తలొంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కలలకు దూరం కాకూడదని నిశ్చయించుకున్నారు.

సొంత ఖర్చులను సంపాదించుకోవడమే తమ సమస్యలకు పరిష్కార మార్గమని భావించారు ఈ యువతులు. పార్ట్‌టైం జాబ్‌లు చేస్తున్నా చదువుకునేందుకు తగినంత సమయం లేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయంలోనే దినపత్రికలో ఎస్‌ ఎడ్యుకేషన్ సొసైటీ ఇచ్చిన ప్రకటన వీరిని ఆకర్షించింది. విద్యార్థులకు హోం ట్యూషన్లు చెప్పేందుకు తాను సిద్ధమని నందిత అనే యువతి ఆ సంస్థను సంప్రదించింది.

అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam

ఇలా మారుమాల గ్రామాల నుంచి వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వారే అనేకమంది ఉన్నారు. ప్రభుత్వం ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఆలస్యం చేయడంతో తిరిగి స్వంత గ్రామాలకు వెళ్లలేక, నగరంలోనే ఉంటూ హాస్టల్ బిల్లులు, ఖర్చులకు సంపాదించే మార్గాలను వెతుకున్నారు. ఓవైపు తమ లక్ష్యాన్ని సాధించడానికి పట్టు సడలకుండా, మరోవైపు ఆర్థిక అవసరాల కోసం తలిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా ఆదాయ మార్గాలను వెతుక్కోవాలని ఆ యువతులంతా భిన్నంగా ఆలోచించారు. ఇలాంటి సమయంలోనే దినపత్రికలో ఓ ప్రకటన వారిని ఆకర్షించింది. విద్యార్థులకు హోం ట్యూషన్లు చెప్పేవారు కావాలని ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ ఈ ప్రకటన విడుదల చేసింది. మూడున్నరేళ్ల క్రితం నందిత అనే ఓ యువతి ఆ సంస్థ వద్దకు వెళ్లి హోం ట్యూషన్లు చెప్పడానికి తాను సిద్ధమని తన ఆసక్తిని ఆ సంస్థ ఫౌండర్ సుంకర రమేష్​కు చెప్పింది. అనంతపురం నగరంలో హోం ట్యూషన్ టీచర్ గా తొలుత అడుగుపెట్టిన నందిత, తన హాస్టల్ ఉన్న యువతులందరినీ ఒక్కొక్కరుగా అందరికీ ఉపాధి మార్గాన్ని చూపిన వైనంపై నేటి యువ కథనం.

కరోనా లౌక్ డౌన్ తరువాత పాఠశాల విద్యార్థుల చదువులు బాగా దెబ్బతిన్నాయి. డిజిటల్ క్లాసుల పేరుతో మొబైల్, ట్యాబ్ లు, ల్యాప్ ట్యాప్ లకు అలవాడు పడిన పాఠశాల విద్యార్థులు వాటికి బానిసలుగా మారిపోయి, విజ్ఞానం కంటే అనవసర విషయాలు తెలుసుకోవడంపై దృష్టిపెట్టారని నిపుణులు చాలాసార్లు హెచ్చరించారు. కరోనా లాక్ డౌన్ వ్యవహారం పిల్లల తలిదండ్రులకు తీవ్ర ఆందోళనను తెచ్చిపెట్టింది. చదువులో చురుకుగా ఉండే చాలా మంది పిల్లలు డల్ స్టూడెంట్లుగా మారిపోయిన పరిస్థితులతో చాలా మంది తలిదండ్రులు సుమారు ఏడాది పాటు తీవ్ర ఆవేదనకు, ఆందోళనకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు సుంకర రమేష్ కొత్తగా ఆలోచించారు. తలిదండ్రుల ఆందోళనను దూరం చేసి, పిల్లలను మెరికల్లా తయారు చేయాలని లక్ష్యంతో హోం ట్యూషన్లు చెప్పించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించారు.

ఒక్క ఆలోచన వారికి జీవితాన్నిచ్చింది- కలలు నెరవేర్చుకుంటున్న యువతులు (ETV Bharat)

అనంతపురం నగరంలోని పలు లేడీస్ హాస్టల్స్ లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన యువతులు చదువుకుంటూ ఏదైనా పార్ట్ టైం ఉద్యోగాల కోసం ఆలోచిస్తున్న విషయం తెలుసుకున్నారు. మరికొందరు యువతులు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారని, కోచింగ్ సెంటర్లకు ఫీజులు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గుర్తించారు. నిరుద్యోగ, ఉన్నత విద్య అభ్యసిస్తూ హాస్టల్ లో ఉంటున్న కొందరు యువతులతో సుంకర రమేష్ తన ఆలోచనను పంచుకున్నారు. చాలా మంది తలిదండ్రులు తమ పిల్లలకు ట్యూషన్ చెప్పించాలనే ఆలోచన ఉన్నప్పటికీ, వారిని ట్యూషన్ కు తీసుకెళ్లి, తిరిగి ఇంటికి తీసుకొచ్చే విషయంలో ఇబ్బంది పడుతున్నారని యువతులకు చెప్పారు. మీరంతా హోం ట్యూషన్లు చెప్పడానికి ముందుకు వస్తే విద్యార్థులకు మంచి విద్య అందించడంతోపాటు, మీ ఆర్థిక అవసరాలు తీరుతాయని రమేష్ వారికి వివరించారు. తొలుత నందిత అనేక యువతి ముందుకు వచ్చి హోం ట్యూషన్ ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తనకు మార్గాన్ని ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ మార్గాన్ని చూపిందని నందితతో పాటు మరికొందరు యువతులు చెబుతున్నారు.

జీఎంఆర్‌ ఐటీ వేదికగా స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ పోటీలు - ఆధునిక సాంకేతికతను రూపొందించిన విద్యార్థులు

మూడున్నరేళ్ల క్రితం నందిత ద్వారా ఎస్ ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు హోం ట్యూషన్ ప్రారంభించారు. ఆమె అనంతపురం జేఎన్టీయూలో ఫుడ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ చదువుతూనే ఉదయం, సాయంత్రం హోం ట్యూషన్లకు అటెండ్ అయ్యేవారు. సుమారు పదివేల రూపాయల ఆర్జనతో, తన హాస్టల్ బిల్లుతో పాటు, ఇతర ఆర్థిక అవసరాలు తీరేవి, తలిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించగలిగారు. హాస్టల్ లో తన తోటి విద్యార్థినులు, ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతులు నందితను పరిచయం చేసుకున్నారు. తమకు కూడా హోం ట్యూషన్లు చెప్పే అవకాశం కల్పించాలని కోరడంతో, అందరినీ సుంకర రమేష్ కు పరిచయం చేసింది.

నగరంలో హోం ట్యూషన్లు కోరుకునే తలిదండ్రులు చాలామంది ఉన్నారని చెప్పిన సుంకర రమేష్, అనంతపురంలో రూట్ మ్యాప్ తయారు చేశారు. హోం ట్యూషన్లు చెప్పడానికి ముందుకు వచ్చిన యువతులు ఉంటున్న హాస్టళ్లకు దగ్గరగా ఉన్న విద్యార్థులను వారికి అప్పగించే మ్యాప్ తయారు చేశారు. అంటే హోం ట్యూషన్ చెప్పడానికి వెళ్లే యువతులు ఆటోలకు వ్యయం చేసి దూరంగా వెళ్లే అవసరం లేకుండా, ఎక్కడికక్కడ పాఠశాల విద్యార్థులను గుర్తించి, వారి తలిదండ్రులకు హోం ట్యూషన్ టీచర్ ను పరిచయం చేశారు. దీంతో అనంతపురంలో సుమారు 25 మంది యువతులు హాస్టల్ లో ఉంటూ విద్యార్థులకు ఇంటి వద్దకే వెళ్లి ట్యూషన్ చెబుతున్నారు. ఓవైపు ట్యూషన్ చెబుతూ మరోవైపు తమ లక్ష్యం దిశగా ఉన్నత విద్యాభ్యాసం, ఉద్యోగ సాధన ప్రిపరేషన్ తో ముందుకు పోతున్నారు.



సుమారు దశాబ్ద కాలంగా అనంతపురం నగరంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామంటూ ఎస్ ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపకులు సుంకర రమేష్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాల ద్వారా ఆయనకు అనేక మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, ధనికులు బాగా పరిచయం. దీంతో చాలా సందర్భాల్లో వారంతా తమ పిల్లలకు ట్యూషన్ చెప్పించడం ఇబ్బందిగా మారిందని రమేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆలోచించిన రమేష్ కు గ్రామాల నుంచి వచ్చి ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటున్న, ఉన్నత విద్య అభ్యసిస్తున్న యువతులు గుర్తొచ్చారు. హాస్టళ్లలో యువతులతో మాట్లాడుదామని ఓ ప్రయత్నం చేసిన రమేష్ ఆలోచనకు మంచి స్పందన వచ్చింది. ఓవైపు తమ పిల్లలు చదువులో రాణించాలనే తలిదండ్రుల లక్ష్యం, మరో వైపు తమ కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించి, జీవితంలో స్థిరపడేలా కష్టపడాలనే యువతుల ఆలోచనకు ఎస్ ఆర్ ఎడ్యుకేషన్ సంస్థ పౌండర్ సుంకర రమేష్ వారధిగా నిలిచారు. తన ఆలోచన కార్యరూపం కావడంతో ఫలాలు కళ్లెదుటే కనిపిస్తుండటంతో ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

'గురి' తప్పని బుల్లెట్ - రైఫిల్ షూటింగ్‌లో పతకాల పంట పండిస్తోన్న యువ కెరటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.