ETV Bharat / state

కొడి కత్తి కేసు బాహుబలి పార్ట్ 1 అయితే, రాయి దాడి పార్ట్ 2: లాయర్ సలీం - Advocate Abdul Saleem

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 3:32 PM IST

Advocate Abdul Saleem condemns minors Arrest
Advocate Abdul Saleem condemns minors Arrest

Advocate Abdul Saleem condemns minors Arrest: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో వడ్డెర యువకులను పోలీసులు తీసుకెళ్లడంపై న్యాయవాది అబ్దుల్ సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట రాత్రి నుంచి, తమ పిల్లల కోసం వేచిచూస్తున్న బాధిత కుటుంబసభ్యులను న్యాయవాది కలిశారు. బాధితులకు న్యాయం చేసేందుకు వారి తరఫున వకల్తా పుచ్చుకున్నానని తెలిపారు.

Advocate Abdul Saleem condemns minors Arrest: జగన్ పై రాయి దాడి కేసులో వడ్డెర యువకులను పోలీసులు తీసుకెళ్లడంపై, కోడి కత్తి శీను కేసు వాదించిన న్యాయవాది అబ్ధుల్ సలీం ఆగ్రహం వ్యక్తం చేశారు. అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు గత రాత్రి నుండి వేచి ఉన్న బాధితుల కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారి తరఫున వకల్తా పుచ్చుకున్న లాయర్ సలీం, త్వరలో సెర్చ్ వారెంట్ వేయనున్నట్లు ప్రకటించారు.

ఎన్నికల సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి డ్రామాలకు తెరతీస్తాడని న్యాయవాది అబ్ధుల్ సలీం ఆరోపించారు. ఇలాంటి చర్యలను న్యాయస్థానంలో తిప్పికొట్టడానికి తాను స్వచ్ఛందంగా బాధితులు తరఫున ముందుకు వచ్చామని అబ్దుల్ సలీం తెలిపారు. వైసీపీ తన రాజకీయాలకు అన్నెం, పున్నెం తెలియని అమాయకులను వాడుకుంటోందని ఆరోపించారు. అరెస్టుకు కారణాలను వెల్లడించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. కోడి కత్తి కేసు బాహుబలి పార్ట్ 1 అయితే, రాయి దాడి అనేది బాహుబలి పార్ట్ 2 అంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. మైనర్లను అరెస్ట్ చేసే పద్దతిలో కాకుండా, పోలీసు డ్రెస్​లో వచ్చి పిల్లలను తీసుకెళ్లారని, ఈ అంశంపై సైతం కోర్టు దృష్టకి తీసుకువస్తానని పేర్కొన్నారు. ఇలా కేసుల్లో ఇరికియ్యటం వైసీపీ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు.

వీళ్లందరూ మంచోళ్లైతే - ఇన్నాళ్లు జనాన్ని ముంచిందేవరో చెప్తారా జగన్ గారు! - YSRCP MLA Candidates

సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో పోలీసులు బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వడ్డెర కాలనీపై మంగళవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే పట్టుకెళ్లారు. విచారించి ఇప్పుడే పంపుతామంటూ మంగళవారం రాత్రి వరకూ వారి ఆచూకీ చెప్పలేదు. పిల్లలను తీసుకెళ్లారు వారి ఆచూకి తెలియడం లేదని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆచూకి కోసం కోర్టులో సెర్చ్ వారెంట్ వేస్తాం. అబ్ధుల్ సలీం, న్యాయవాది

ఇదీ జరిగింది: రాయి దాడి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకుంది. వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. సంఘటన స్థలానికి వడ్డెర కాలనీ కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది. తమ పిల్లలను రెండు గంటల్లో వదిలిపెడతామని చెప్పి తీసుకెళ్లారని కాలనీవాసులు వివరిస్తున్నారు. వారంతా అమాయకులని, దాడితో సంబంధం లేదని, తక్షణమే విడిచిపెట్టాలని మంగళవారం సాయంత్రం డాబాకొట్ల రోడ్డును దిగ్బంధించి రాస్తారోకో చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
రాయి దాడి ఘటనపై లోతైన విచారణ జరిపించాలని ఈసీకి ఫిర్యాదు చేసిన జనసేన - stone attack investigation

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.