ETV Bharat / state

జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడుతాం - స్పష్టం చేసిన అంగన్వాడీలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2024, 8:31 PM IST

Updated : Jan 21, 2024, 8:50 PM IST

41th Day of Anganwadi Workers Strike in AP : సీఎం జగన్ ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్నాడీలు రాష్ట్ర వ్యాప్తంగా 41రోజు నిరసనలు తెలిపారు. తమపైకి పోలీసులను పంపినా, పోరాటం విరమించేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు అన్ని ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

41th_Day_of_Anganwadi_Workers_Strike_in_AP
41th_Day_of_Anganwadi_Workers_Strike_in_AP

జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడుతాం - స్పష్టం చేసిన అంగన్వాడీలు

41th Day of Anganwadi Workers Strike in AP : ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే మహిళలు అని చూడకుండా రోడ్డు పాలు చేశారని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనం, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ 41వ రోజు అంగన్వాడీలు కదం తొక్కారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 41వ రోజూ ఆందోళనలు కొనసాగించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద మోకాళ్లపై కూర్చొని దండాలు పెడుతూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల అరెస్టును ఖండించారు. వెంటనే జీతాలు పెంచాలని, అక్రమ అరెస్టులను ఆపాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు.

డిమాండ్ల సాధన కోసం విశ్రమించని అంగన్వాడీలు - మొద్దు నిద్రను నటిస్తున్న ప్రభుత్వం

బాపట్ల జిల్లాలో అంగన్వాడీలు చేస్తున్న నిరసనలు కోనసాగుతునే ఉన్నాయి. జిల్లాలోని కారంచేడులో మోకాళ్లపై కూర్చోని దండం పెడుతూ సమస్యల పరిష్కరించాలని అంగన్వాడీలు ఆందోళనలు చేశారు. "జగనన్న సామ్రాజ్యంలో తమకి ఈ కర్మ ఏందంటూ" పాటలు పాడుతూ, బతుకమ్మ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. తమని ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపితే రాబోయే రోజుల్లో జగన్​మోహన్ రెడ్డిని కూడా ఇంటికి పంపుతారని అంగన్వాడీలు హెచ్చరించారు.

Anganwadi Workers Strike Across State : పర్చూరి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అంగన్వాడీలు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సీఎం జగన్ అరాచక పాలనకు అంగన్వాడీల ఇబ్బందులే నిదర్శనమని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టూ కూడా లేదంకు విమర్శించారు. ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అంగన్వాడీలను విధుల నుంచి తొలగిస్థామని అనడం దారుణమని తెలిపారు. అంగన్వాడీలకు తెలుగు దేశం పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

న్యాయపరమైన డిమాండ్లలను కోరుతున్నామే తప్పా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు : అంగన్వాడీలు

తమ న్యాయబద్దమైన డిమాండ్లు పరిష్కరించమని అడిగిన అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తామనటం సిగ్గుచేటని టీడీపీ అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తామన్నది జగన్‌ కాదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడగటం అంగన్వాడీల తప్ప? అని మండిపడ్డారు. అంగన్వాడీలపై లాఠీచార్జ్​లు, అక్రమ అరెస్ట్​లు, నిర్భందాలు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించాలన్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కీ తీసుకోకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.

AP Anganwadi Workers Strike : అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు 41వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే తాడేపల్లిలోని జగన్ ఇంటిని ముట్టడిస్తామని అంగన్వాడీలో హెచ్చరించారు. మహిళలు రోడ్డుపైన ఆందోళన చేస్తుంటే సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం తమని భయభ్రాంతులకు గురి చేస్తుందని మండిపడ్డారు.

విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు, విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఎంవివి సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. తూర్పు నియోజకవర్గం పదవ డివిజన్​లోని వైసీపీ గడపగడపకు కార్యక్రమాన్ని ఎంపీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఓ అంగన్వాడీ నివాసం వద్దకు వెళ్లిన ఎంపీని అక్కడి అంగన్వాడీ నిలదీశారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారించాలని 41రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కర్నూలులో అంగన్వాడీలు వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు వేతనాలు పెంచకుంటే గడ్డి తిని జీవించాలా అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

ప్రభుత్వానికి మాపై కక్ష ఎందుకు? - చర్చలకు పిలవకుంటే ఆందోళన ఉద్ధృతం: అంగన్వాడీలు

Last Updated : Jan 21, 2024, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.