ETV Bharat / state

తిమకమ, మకతిక - ఒకే పాఠశాలలో 38 మంది కవల విద్యార్థులు - గురువులకు తప్పని పాట్లు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 1:24 PM IST

19 Pairs of Twins in Nizamabad School : ఏదైనా ఓ పాఠశాలలో ఇద్దరు కవలలు ఉంటే గుర్తించేందుకు ఉపాధ్యాయులు సిబ్బంది పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మరి రెండు మూడు జంటలుంటే అవస్థలు పడాల్సిందే. అంతకంటే ఎక్కువ కవల జంటలు ఉంటే ఏంటి పరిస్థితి. ఊహించడమే కష్టం కదూ! నిజామాబాద్‌ జిల్లా చందూరులోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 19 కవల జంటలున్నాయి. ఒక్కో తరగతి గదిలో ఒకటి నుంచి నాలుగు కవల జంటలున్నాయి. ఒకే పాఠశాలలో ఇంత మంది చదవడం వల్ల కాస్త తికమకతో పాటు సరదా సందడిగా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

19 Pairs of Twins in Nizamabad
Nizamabad School Has 19 Pairs of Twins

ఒకే పాఠశాలలో 38 మంది కవల విద్యార్థులు గుర్తించలేక గురువుల తికమక

19 Pairs of Twins in Nizamabad School : కవలలను ఒకటి లేదంటే రెండు జంటలనో చూస్తుంటాం. కానీ పదుల సంఖ్యలో కవల పిల్లలను ఒకేచోట చూస్తే ఏర్పడే గందరగోళం అంతా ఇంతా కాదు. కానీ ప్రతిరోజూ ఇంత మంది పిల్లలు ఒకే పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా చందూరు మండల కేంద్రంలోని విక్టరీ హైస్కూల్​లో ఎల్​కేజీ నుంచి తొమ్మిదో తరగతి వరకు మొత్తం 19 కవల పిల్లల (Twins Stories) జంటలున్నాయి. అంటే 38 మంది కవల పిల్లలు ఈ పాఠశాలలో చదువుతున్నారు.

అప్పుడు ఒకే కాన్పులో జననం- ఇప్పుడు ఒకే గేమ్​లో పతకాల పంట- త్రీ సిస్టర్స్​ కథ ఇదీ!

రోజు పాఠశాల సిబ్బందిని, తోటి విద్యార్థులను ఈ కవల జంటలు తికమక పెడుతూ సందడి చేస్తున్నారు. కవలలందరూ ఒకే రకమైన దుస్తుల్లో రావడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది, తోటి విద్యార్థులు సైతం తికమకకు గురవుతున్నారు. పాఠశాలలోనే కాకుండా ఇంటి వద్ద కూడా బంధువులు, గ్రామస్థులు తమను గుర్తించడంలో తికమక పడుతుంటారని చిన్నారులు అంటున్నారు. చదువుతో పాటు అల్లరిలోనూ ఏ పని చేసినా ఒకే రకంగా, ఒకే మాదిరిగా ఉంటామని కవల పిల్లలు చెబుతున్నారు.

"మేము కవలలుగా పుట్టినందుకు సంతోషంగా అనిపిస్తుంది. అందరితో స్వేహపూర్వకంగా ఉంటాం. మేము ఇంత మంది కవలలతో చదువుతుండటం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మమ్మల్ని ఎవరైనా పిలిస్తే కన్​ఫ్యూస్​ అవుతారు. తనకు ఏడుపు వస్తే నాకు కూడా ఆటోమేటిక్​గా ఏడుపు వస్తుంది. మా ఫ్యామిలీ తప్ప మా స్నేహితులు అసలు ఎవ్వరూ మమ్మల్ని గుర్తు పట్టరు. రోజుకు చాలా సార్లు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం కానీ కలిసి ఉండాలనే అనిపిస్తుంది." - కవల విద్యార్థులు

విడదీయలేని 'హలో సిస్టర్స్'.. అవయవాలు సేమ్.. ఒక్కరికే బాయ్​ఫ్రెండ్ కానీ..

కవల విద్యార్థులు తికమక పెట్టినా, అంత మందిని ఒకే దగ్గర చూడటం కొత్త అనుభూతి కలిగిస్తుందని ఉపాధ్యాయులు అంటున్నారు. చందూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులు ఈ పాఠశాలకు వస్తున్నారు. కవల పిల్లలంతా కలిసిమెలిసి ఆనందంగా ఉంటారని, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ప్రతి పనుల్లో ముందుంటారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒకే పాఠశాలలో 38 మంది కవల పిల్లలు ఉండటం, వారంతా కలిసి మెలిసి ఉండటం, నిత్యం ఆ పాఠశాలలో సందడి వాతావరణం నెలకొంటుంది.

"మా స్కూల్​లో ఇంతమంది ట్విన్స్ ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఎక్కడో ఒక దగ్గర ట్విన్స్​ ఉంటారు. ఈ స్కూల్​లో 38 మంది ఉండటం చాలా సంతోషం. చాలా మంది ఎల్​కేజీ నుంచి ఇక్కడే చదువుతున్నారు. ప్రతి సంవత్సరం కవలల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది 19 కవల జంటలు అంటే చాలా ఆనందంగా ఉంది." - స్కూల్ సిబ్బంది

కవలలే కానీ చాలా తేడా..! ఈ అక్కాచెల్లెళ్లకు గిన్నిస్ రికార్డులో చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.