ETV Bharat / sports

ఆర్సీబీ కొత్త అధ్యాయం - నయా జెర్సీతో పాటు పేరు రివీల్​

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 10:38 PM IST

Updated : Mar 19, 2024, 10:59 PM IST

RCB New Jersey And Name : ఐపీఎల్​లో కీలక టీమ్​ ఆర్సీబీ తన కొత్త జెర్సీతో పాటు నయా పేరును రివీల్ చేసింది. ఇంతకీ ఆ పేరు ఏంటంటే ?

RCB New Jersey And Name Revealed
RCB New Jersey And Name Revealed

RCB New Jersey And Name : సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్న వార్తలను ఆర్సీబీ ఫ్రాంచైడజీ నిజం చేసింది. తాజాగా జరిగిన అన్​బాక్సింగ్ ఈవెంట్​లో ఈ టీమ్ కొత్త జెర్సీతో పాటు పేరును రివీల్​ చేసింది. తన పేరులో చిన్న మార్పు చేసింది. ఇప్పటి వరకు 'Royal Challengers Bangalore' కాస్త 'Royal Challengers Bengaluru' గా రూపాంతరం చెందినట్లు వెల్లడించింది. "మేం ఇష్టపడే నగరం, గర్వంగా అందిపుచ్చుకునే వారసత్వం ఇది మా సరికొత్త అధ్యాయం. మీ జట్టు, మీ ఆర్సీబీ" అంటూ ఆర్సీబీ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

కొత్త హెయిర్​స్టైల్ అదుర్స్​
మరోవైపు ఇదే వేదికపై విరాట్​ తన న్యూ లుక్​తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్​లో ఉన్న విరాట్​ ఆదివారం స్వదేశానికి తిరిగొచ్చాడు. జట్టుతో కలిసి ప్రాక్టీస్ మొదలెట్టాడు. అయితే ఎప్పటికప్పుడు హెయిర్‌ స్టైల్‌ మారుస్తూ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచే కోహ్లీ ఈ సారి కూడా తన హెయిర్ స్టైల్​లో మార్పులు చేశాడు.

ప్రముఖ సెలబ్రెటీ హెయిర్‌ స్టైలిస్ట్ ఆలిమ్‌ హకీమ్‌ కోహ్లీకి ఈ సారి కొత్త హెయిర్‌ స్టైల్‌ సెట్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆలిమ్‌ హకీమ్‌ పోస్ట్ చేయగా అవి తెగ వైరల్ అయ్యాయి. దీంతో పాటు ఇప్పుడు అన్​బాక్సింగ్ ఈవెంట్​ ఫొటోలు కూడా నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి.

బరిలోకి దిగనున్నది అప్పుడే
మార్చి 22న ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఐపీఎల్‌ ఆరంభ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆర్సీబీ జట్టు తలపడనుంది. ఆ తర్వాత బెంగళూరు జట్టు పంజాబ్​, కోల్​కతా, లఖ్​నవూ, రాజస్థాన్ జట్లతో తలపడనుంది. ఇక ఐపీఎల్​లో బెంగళరూ షెడ్యూల్ ఇదే :

మార్చి 22: చెన్నై X బెంగళూరు (చెన్నై)

మార్చి 25: బెంగళూరు X పంజాబ్ (బెంగళూరు)

మార్చి 29: బెంగళూరు X కోల్‌కతా (బెంగళూరు)

ఏప్రిల్ 02: బెంగళూరు X లఖ్‌నవూ (బెంగళూరు)

ఏప్రిల్‌ 6: రాజస్థాన్‌ X బెంగళూరు (జైపుర్)

WPL 2024 శెభాష్ స్మృతి - వీడియో కాల్​లో కోహ్లీ అభినందనలు

కోహ్లీ, అనుష్క షాకింగ్ నిర్ణయం - ఇది నిజమైతే ఫ్యాన్స్​కు హార్ట్ బ్రేకే!

Last Updated : Mar 19, 2024, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.