ETV Bharat / sports

విరాట్ ఫైర్​ - ఆ క్రికెటర్​ చేసిన పనికి బాదిపడేశాడు! - Kohli

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 1:59 PM IST

Mitchell Johnson VS Virat Kohli : టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌ కోహ్లీ పంతానికి, పోరాటానికి మారుపేరులా కనిపిస్తాడు. అసాధ్యమనుకున్న ఎన్నో మ్యాచ్‌లను విరాట్‌ గెలిపించిన తీరు కూడా అందరికీ తెలుసు. అయితే 2014 టెస్ట్‌ సిరీస్‌లో జాన్సన్‌తో జరిగిన గొడవ గురించి, అప్పుడు తన మానసిక స్థితి గురించి కోహ్లీ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. పూర్తి వివరాలు స్టోరీలో.

Etv Bharat
Etv Bharat

Mitchell Johnson VS Virat Kohli : చాలా మంది క్రికెటర్లకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఇన్నింగ్స్‌లు, సిరీస్‌లు, ఫేవరెట్‌ వెన్యూలు ఉంటాయి. అలానే టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లీకి 2014-15లో ఆస్ట్రేలియాలో ఆడిన టెస్టు సిరీస్ ప్రత్యేకం. ఈ సిరీస్‌లో అతడు అద్భుతంగా పెర్ఫార్మెన్స్​ చేయడమే కాకుండా, ఎంఎస్‌ ధోనీ స్థానంలో ఇండియా టెస్ట్ కెప్టెన్ అయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 692 పరుగులతో భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు.

కోహ్లీ కన్నా ముందు ఆ సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్‌ స్టీవ్ స్మిత్(769) మాత్రమే ముందున్నాడు. అడిలైడ్ ఓవల్‌లో జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు బాదాడు విరాట్. బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగిన తర్వాతి గేమ్‌లో కాస్త నిరాశపరిచాడు. అయితే మెల్‌బోర్న్, సిడ్నీలో జరిగిన మూడు, నాలుగో టెస్టుల్లో మళ్లీ సెంచరీలు కొట్టి సత్తా చాటాడు. అయితే ఈ సిరీస్‌లో అప్పటి ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్ జాన్సన్‌తో జరిగిన గొడవను కోహ్లీ గుర్తుచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.

చెప్పాను, చేసి చూపించాను - ఆ వైరల్‌ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ ‘సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో, జాన్సన్ వేసిన మొదటి బంతి నా తలకు తగిలింది. అంతకు ముందు దాదాపు 60 రోజుల నుంచి అలాంటి బాల్‌ను ఎలా ఆడాలని నేను విజువలైజ్‌ చేసుకుంటున్నాను. కానీ మ్యాచ్‌లో ఆ బాల్‌ తగలడంతో ప్లాన్ పూర్తిగా మారిపోయింది. బంతి చాలా బలంగా తాకింది. నా ఎడమ కన్ను వాపు వచ్చింది. నా చూపు తగ్గుతూ వచ్చింది. కానీ నేను అప్పుడు ఈ మార్పులను గమనించలేదు. అయితే మధ్యాహ్న భోజన సమయంలో ఏం జరిగిందంటే. అప్పుడు చేసిన ఆలోచనకు నేను నిజంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. బేసిక్‌గా నా ముందు రెండు ఆప్షన్‌లు ఉన్నాయి. ఒకటి ఫైట్‌ చేయాలి, రెండు ఫ్లైట్‌ ఎక్కి వచ్చేయాలి. నా రియాక్షన్‌ ఒక్కటే. హౌ డేర్‌ హీ హిట్‌ మీ ఆన్‌ ద హెడ్‌(నా తల మీద కొట్టడానికి ఎంత ధైర్యం). మేనే కహా ఇస్కో మే ఇత్నా మారుంగా ఇస్ సీరీస్ మే (సిరీస్‌లో అతన్ని ఢీకొడతానని చెప్పాను, అదే చేశాను)’ అని గుర్తు చేసుకున్నాడు.

ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా కోహ్లీ - ఈ సిరీస్‌లో మొదటి టెస్ట్‌కు ధోనీ అందుబాటులో లేకపోవడంతో కోహ్లీ జట్టును నడిపించాడు. మహీ తిరిగి వచ్చి రెండు, మూడు టెస్టులకు కెప్టెన్సీ వహించాడు. ధోనీ ఆ తర్వాత ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. దీంతో నాలుగో టెస్ట్‌ నుంచి కోహ్లీ టీమ్ ఇండియాకు ఫుల్‌ టైమ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

కోహ్లీకి మరో అరుదైన గౌరవం - అక్కడ మైనపు విగ్రహం ఏర్పాటు - Virat Kohli statue

చరిత్ర సృష్టించిన పంత్​ - తొలి బ్యాటర్​గా రికార్డు - IPL 2024 LSG VS DC

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.