ETV Bharat / sports

టెస్టుల్లో అశ్విన్ మాయజాలం - ఆ మైల్​స్టోన్ దాటిన 9వ బౌలర్​గా రికార్డు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 10:02 AM IST

Ashwin 500 Wickets Record : టీమ్​ఇండియా స్టార్​ స్పిన్నర్ అశ్విన్ తాజాగా 500 వికెట్ల మైల్​స్టోన్​ను దాటాడు. అలా తన ఖాతాలో పలు అరుదైన రికార్డులను వేసుకున్నాడు. అదేంటంటే ?

Ashwin 500 Wickets Record
Ashwin 500 Wickets Record

Ashwin 500 Wickets Record : మైదానంలో తమ ప్రత్యర్థి ఎటువంటి షాట్‌ ఆడగలడో అని ముందే ఊహించి ఎలా వికెట్‌ పడగొట్టాలనే ప్రణాళిక రచించే ఇంజీనీర్‌ ఈ స్టార్ బౌలర్​. బ్యాటర్‌ మైండ్​లో ఉన్నది ఇట్టే చదివే మేధావి అతడు. బాల్​ను తన క్రంట్రోల్​లోకి తెచ్చుకుని చేతి వేళ్లతోనే మాయ చేసే మాంత్రికుడు అతడు. వైవిధ్యమైన అస్త్రాలతో ప్రత్యర్థులను మట్టికరిపించే యోధుడు అతడు.

ఇలా అన్నీ కలగలిసిన స్పిన్‌ చాణక్యుడు మన స్టార్ బౌలర్ రవిచంద్రన్‌ అశ్విన్‌. ప్రపంచ క్రికెట్​ చరిత్రలో అతికొద్ది మందికి మాత్రమే సాధ్యమైన ఘనతను తాజాగా అందుకున్నాడు ఈ చెన్నై వీరుడు. ఇంగ్లాండ్​తో శుక్రవారం జరిగిన మూడో టెస్టులో ఓ వికెట్ సాధించి ఈ ఫార్మాట్​లో 500 వికెట్ల మైల్​స్టోన్​ను చేరుకున్నాడు. ఈ 147 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో అశ్విన్​ కంటే ముందు ఈ రికార్డును 8 మంది మాత్రమే సొంతం చేసుకున్నారంటే ఇది ఎంత విశిష్టమైన రికార్డో ఇప్పటికే అర్థం చేసుకోవచ్చు.

2011లో టెస్ట్ ఫార్మాట్​లోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్‌, తన 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు. పలు మార్లు ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు కూడా. తొలి మూడేళ్లలో అతను 23 టెస్టులు ఆడి 114 వికెట్లను పడగొట్టాడు. కానీ ఆ తర్వాత వైవిధ్యమైన బంతులతో మైదానంలో మరింతగా చెలరేగిపోయాడు. 2015 జనవరి నుంచి స్వదేశంలో ఆడిన 43 టెస్టుల్లో 252 వికెట్లు, ఆ తర్వాత విదేశాల్లో 32 టెస్టుల్లో 134 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక 56 టెస్టుల్లో 347 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో కనీసం 200 వికెట్లు తీసిన బౌలర్లలో అతనిదే అత్యుత్తమ సగటు (21.22). సొంతగడ్డపై అశ్విన్ ఆడిన 57 టెస్టుల్లో భారత్‌ 42 గెలిచింది. ఓవరాల్‌గా 97 టెస్టుల్లో 56 విజయాలను సాధించింది. 10 సార్లు 'మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌'గా అశ్విన్ చరిత్రకెక్కాడు.

పాత బంతితోనే కాకుండా కొత్త బంతితోనూ వికెట్ల వేటలో దూసుకెళ్తున్నాడు ఈ స్టార్ బౌలర్. తొలి 10 ఓవర్లలో 47, 15 ఓవర్లలో 79, 20 ఓవర్లలో 121 వికెట్లు ఇలా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తన డెబ్యూ మ్యాచ్​ నుంచి ఇప్పటి వరకు తొలి 20 ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌ కూడా అశ్వినే. ఎడమ చేతి వాటం బ్యాటర్లు అంటే చాలు ఇక అశ్విన్‌ చెలరేగిపోతాడు. అతని ఖాతాలో 249 వికెట్లు కూడా ఇవే కావడం విశేషం. మరే బౌలర్‌ కూడా ఇన్ని ఎడమ చేతి వాటం బ్యాటర్ల వికెట్లను పడగొట్టలేదు.

అయితే అశ్విన్‌ అరంగేట్ర మ్యాచ్​ నుంచి అతని కంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసింది కేవలం లైయన్‌ (509) మాత్రమే. అశ్విన్‌ కంటే అతను 26 మ్యాచ్‌లు ఎక్కువగా ఆడాడు. మ్యాచ్‌ల పరంగా మురళీధరన్‌ (87) ఆ తర్వాత, బంతుల పరంగా మెక్‌గ్రాత్‌, ఆ తర్వాత (25,528) టెస్టుల్లో 500 వికెట్ల ఘనత అందుకున్న బౌలర్​గా అశ్విన్‌ రికార్డుకెక్కాడు. అశ్విన్‌ తన 98వ టెస్టులో 25,714 బంతుల్లో ఈ రికార్డును సాధించాడు.

ఈ ఘనత ఆయనకే అంకితం- అశ్విన్ ఎమోషనల్- మోదీ స్పెషల్ ట్వీట్

వికెట్ నెం.500- టెస్టుల్లో 'అశ్విన్' ఘనమైన రికార్డ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.