ETV Bharat / sports

చెస్​లో రేర్ రికార్డు - 37 ఏళ్ల గ్రాండ్‌ మాస్టర్​ని ఓడించిన 8 ఏళ్ల చిన్నారి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 7:51 PM IST

Updated : Feb 21, 2024, 8:14 PM IST

Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్‌ కౌశిక్‌ తాజాగా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఓపెన్‌ చెస్‌ టోర్నీలో 37 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ జాక్‌ స్టోవాను ఓడించాడు.

Ashwath Kaushik Chess
Ashwath Kaushik Chess

Ashwath Kaushik Chess : స్విట్జర్లాండ్​ వేదికగా జరిగిన బర్గ్‌డోర్ఫర్ స్టాడ్‌థాస్ ఓపెన్ చెస్​ టోర్నమెంట్‌లో ఎనిమిదేళ్ల అశ్వత్ కౌశిక్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. . సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఈ కుర్రాడు ఆట నాలుగో రౌండ్‌లో 37 ఏళ్ల ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌, జాసెక్ స్టోపాను చిత్తు చేసి క్లాసికల్ చెస్‌లో గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.

అలా అంతకమందు సెర్బియాకు చెందిన లియోనిడ్‌ ఇవానోవిచ్‌ నెలకొల్పిన రికార్డును అశ్వత్‌ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ఫిడే ర్యాంకింగ్స్‌లో 37,338 ర్యాంక్‌తో ఉన్న ఈ యంగ్ ప్లేయర్ గురించి ఇప్పుడు నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. భారత సంతతికి చెందిన వాడే అయినప్పటికీ అతడి కుటుంబం 2017లో సింగపూర్‌కు వలస వెళ్లడం వల్ల ఆ దేశానికి అశ్వత్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఈస్ట్రన్‌ ఆసియా యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-8 కేటగిరిలో పోటీపడ్డ ఈ కుర్రోడు, అందులోని మూడు విభాగాల్లోనూ గెలుపొందాడు. 2022లో ఆసియా యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో అండర్‌-8 క్లాసిక్‌, ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టైటిళ్లు గెలుచుకున్నాడు.

ఇక ఈ గెలుపులో ఎంతో మంది స్టార్స్ ఈ చిన్నారిని నెట్టింట కొనియాడుతున్నారు. అందులో భాగంగా సింగపూర్‌ చెస్‌ ఫెడరేషన్‌ సీఈవో, మాజీ గ్రాండ్‌మాస్టర్‌ కెవిన్‌ గో ఈ చిన్నారిపై ప్రశంసల జల్లును కురిపించాడు. అతడి విజయం ఎంతో మంది చిన్నపిల్లలకు స్ఫూర్తినిస్తుందంటూ కొనియాడాడు. మరోవైపు అశ్వత్​ విజయంపై అతడి తండ్రి శ్రీరామ్‌ కౌశిక్‌ కూడా ట్విటర్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది అత్యంత గర్వించదగ్గ క్షణాల్లో ఒకటంటూ ఎమోషనలయ్యారు.

Praggnanandhaa Sister Vaishali Grand Master : ఇంటర్నేషనల్​ చెస్ ఫెడరేషన్​ తాజాగా ర్యాంకింగ్స్​ వెల్లడించింది. ఈ ర్యాంకింగ్స్​లో.. చెస్ సంచలనం ఆర్‌ ప్రజ్ఞానంద సోదరి ఆర్ వైశాలి 2500+ రేటింగ్స్​తో గ్రాండ్‌మాస్టర్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన మూడో భారతీయ మహిళగా నిలిచింది. అయితే ఆర్‌ ప్రజ్ఞానంద.. ఇదివరకే గ్రాండ్‌మాస్టర్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఒకే ఇంట్లో ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లుగా నిలిచి రికార్డ్​ సృష్టించారు. అంతేకాకుండా తమిళనాడు v నుంచి గ్రాండ్‌ మాస్టర్‌గా నిలిచిన తొలి మహిళ కూడా వైశాలీనే. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

కొత్త టెక్నిక్​లతో హంపి అదుర్స్​- ఆంధ్రప్రదేశ్​ గ్రాండ్​మాస్టర్​ ఎప్పటికీ క్వీనే!

Divya Desmukh Chess : భారత చెస్​లో కొత్త రాణి​.. ఈ చిన్నది పావులు కదిపితే రికార్డే!

Last Updated : Feb 21, 2024, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.