ETV Bharat / spiritual

ఈ వారం ఉద్యోగులు, వ్యాపారులకు అంతా శుభమే- ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త! - Weekly Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 3:53 AM IST

Weekly Horoscope From 21st April to 27th April 2024 : 2024 ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

WEEKLY HOROSCOPE IN TELUGU
WEEKLY HOROSCOPE IN TELUGU

Weekly Horoscope From 21st April to 27th April 2024 : 2024 ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి సంతోషం నెలకొంటాయి. అవివాహితులకు కల్యాణం జరుగుతుంది. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. ఈ రాశివారికి ఈ వారం ఆర్ధిక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. సామాజిక సేవాకర్తలకు సంఘంలో పరపతి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని అభీష్టాలు నెరవేరుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇంటి అలంకరణ నిమిత్తం ధనవ్యయం ఉంటుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు విజయావకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు కోరుకున్న చోటుకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా శ్రీకారం చుట్టబోతున్న పనుల విషయంలో అప్రమత్తంగా ఉంటే మేలు. నూతన వాహనప్రాప్తి. ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం విశేషమైన శుభఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. వ్యాపారులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు వలన మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. షేర్ మార్కెట్లు లావాదేవీలు మంచి లాభాలను తీసుకు వస్తాయి. ఇంటికి అతిధులు వస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్​కు కలిసి వచ్చే కాలం. క్రీడారంగం వారు గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. రాజకీయనాయకులకు కలిసి వచ్చే కాలం. ఈ రాశివారికి ఈ వారం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. హనుమాన్ చాలీసా పఠిస్తే సత్ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం కలిసి వచ్చే కాలం. వ్యాపారులు వ్యాపార విస్తరణలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యకు అనుకూలమైన సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు విజయం సాధిస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఆర్ధికంగా అనేక ప్రయోజనాలున్నాయి. రాజకీయ నాయకులకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. పూర్వీకుల ఆస్తి కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు కొన్ని ఒడి దుడుకులు ఉన్నా సహనంతో ఉంటే గట్టెక్కుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రకు వెళతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశీయానం చేస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. రాజకీయ నాయకులకు ఉన్నత పదవీ యోగం ఉంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. వ్యాపారులు శ్రమతోనే విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు పనిలో పురోగతి ఉంటుంది. సామాజిక సేవ చేసే వారికి పరపతి పెరుగుతుంది. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. మిత్రుల సాయంతో నూతన ఆదాయ వనరులను సమకూర్చుకుంటారు. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి వ్యాపారం చేసేవారికి గడ్డుకాలం. ఆరోగ్యం సహకరిస్తుంది. రాజకీయ నాయకులకు పదవీ యోగం ఉంటుంది. ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. గృహంలో పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారు తప్పనిసరిగా అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. లేకుంటే నష్టపోతారు. వ్యాపారులకు వ్యాపార సంబంధిత ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త ఒప్పందాలు వ్యాపార వృద్ధిని, ఆర్థిక ప్రయోజనాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగస్తులు పనులు సకాలంలో పూర్తి చేయకపోతే మాట పడాల్సి వస్తుంది. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే కాలం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి. శివారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఇంతా బయట కొంత ఒత్తిడి ఉంటుంది. పరిస్థితులు అనుకూలించే వరకు సహనంగా ఉంటే మేలు. రాజకీయ నాయకులకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులు ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రయోజనాలు చేతికి అందుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ లోపిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ శ్రేయస్సు కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. శివాష్టకం పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పని చేసే చోట కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు చాకచక్యంతో ఎదుర్కొంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చి పెడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అవివాహితులకు కల్యాణ ఘడియలు సమీపించాయి. రాజకీయ నాయకులకు అందరి నుంచి సహకారం ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. ఆంజనేయ స్వామి పూజ చేస్తే మరిన్ని శుభఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ద్వారా నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకొని విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పై అధికారుల ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలపై శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. రాజకీయనాయకులకు విజయం తధ్యం. శనిస్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. ఆర్ధికంగా బలపడతారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారస్తులకు ప్రయాణాలు లాభిస్తాయి. రాజకీయ నాయకులు తమ ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కోసం ధనవ్యయం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నూతన వాహన ప్రాప్తి ఉంది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు అందుకుంటారు. ఇంటి అలంకరణ కోసం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. గతంలో రావాల్సిన బకాయిలు చేతికి అందుతాయి. పూర్వీకుల ఆస్థి కలిసి వస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంది. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. పొదుపు ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తేనే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలరు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులకు విజయప్రాప్తి ఉంది. మరిన్ని శుభ ఫలితాల కోసం గణపతి ప్రార్ధన చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.