హనుమంతుడిని మంగళవారమే ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 10:51 AM IST

Lord Hanuman Puja

Lord Hanuman Puja: హిందూ సంప్రదాయం ప్రకారం మంగళవారం రోజున హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. మరి.. మంగళవారమే ఆంజనేయ స్వామిని ఎందుకు పూజించాలో మీకు తెలుసా? మంగళవారానికీ మారుతికి ఉన్న బంధం ఏంటో తెలుసా??

Reasons for Worship Lord Hanuman on Tuesday: హిందూ ధర్మంలో ఒక్కో దేవుడికి ఒక్కో రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా.. ఇలా ఒక్కోరోజు ఒక్కొక్కరిని పూజిస్తారు. అయితే.. హనుమంతుడికి మంగళవారమే ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారు? మంగళవారానికి మారుతికి ఉన్న అనుబంధం ఏంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం..

సనాతన ధర్మంలో రామ భక్త హనుమాన్​కి ప్రత్యేక స్థానం ఉంది. హనుమంతుడిని ఆరాధిస్తే.. అన్ని కష్టాలనూ తొలగించి, కోరుకున్న కోరికలు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. అంతేకాదు.. ప్రతి యుగంలోనూ పిలిచిన వెంటనే తన భక్తులకు సహాయం చేయడానికి వాయు వేగంతో వస్తాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడిని పూజించడానికి మంగళవారం ఉత్తమమైన, ఫలవంతమైన రోజుగా పండితులు చెబుతారు. ఈ రోజున ఆంజనేయస్వామిని ఆరాధించి, పూజించిన భక్తులకు.. స్వామి ఆశీర్వాదం, అనుగ్రహం లభిస్తాయని అంటారు. మరి.. పూజ మంగళవారమే ఎందుకు చేయాలంటే..

మాఘ పూర్ణిమ - విష్ణుమూర్తికి ఈ పూజ చేస్తే ఎంతో ఫలం!

హనుమాన్​ జయంతి: హనుమాన్.. కేసరి, అంజన దంపతుల కుమారుడు. చైత్ర మాసం మొదటి రోజున జన్మించాడు. ఆ రోజు మంగళవారం. ఆ విధంగా భక్తులు మంగళవారం ఆంజనేయ స్వామికి పూజ జరుపుకుంటారు. మంగళవారం నాడు పవన పుత్రుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. శ్రీరాముని పట్ల విధేయత, భక్తికి పేరుగాంచిన మారుతి, బలం జ్ఞానానికి కూడా ప్రసిద్ధి. అవన్నీ తమకూ సిద్ధిస్తాయని భక్తులు భావిస్తారు.

రామాయణంతోనూ బంధం : మంగళవారానికి, రామాయణానికీ బంధం ఉంది. సీతాదేవిని రావణుడు అపహరించి లంకలో దాయగా.. వాయుపుత్రుడు ఆమె జాడ కోసం వెతికి లంకలో ఉన్నట్టు గుర్తించిన రోజు మంగళవారమని పండితులు చెబుతున్నారు. ఈ కీలక సందర్భం హనుమాన్ దృఢమైన నిబద్ధత, వీరోచిత ధైర్యాన్ని ప్రదర్శిస్తుందని చెబుతారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు భక్తులు హనుమాన్ దేవాలయాలను సందర్శిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు.

దుష్టశక్తుల నుంచి రక్షణ కోసం: హిందూ పురాణాల ప్రకారం.. మంగళవారం అనేది దేవతల అనుగ్రహం కోసం ప్రత్యేకమైన రోజుగా కూడా భావిస్తారు. ఇది చాలా శక్తివంతమైన రోజుగా చెబుతారు. ఈ రోజున భగవంతుడిని శ్రద్ధగా ప్రార్థనలు చేసే వారు దుష్ట శక్తుల నుంచి రక్షణతోపాటు శ్రేయస్సును పొందవచ్చని పండితులు అంటున్నారు.

మహాశివరాత్రి నాడు శివుడిని ఈ పూలతో పూజిస్తే - అష్టైశ్వర్యాలు కలుగుతాయట!

సూర్యుడికి ఇలా నమస్కరించండి - అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

ద్వారక ఎలా మునిగిపోయింది? శ్రీకృష్ణుడి నిర్యాణం కథేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.