ఆ రాశుల వారికి కొత్త అవకాశాలు- సమాజంలో మంచి గుర్తింపు పక్కా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 5:09 AM IST

Horoscope Today February 13th 2024

Horoscope Today February 13th 2024 : ఫిబ్రవరి 13న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today February 13th 2024 : ఫిబ్రవరి 13న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : ఈ రోజు మేష రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందిపడతారు. వ్యాపార, వ్యవహారాలు అంతగా రాణించవు. మీ పనుల్లో ఇతరుల జోక్యం ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

.

వృషభం (Taurus) : ఈ రోజు వృషభ రాశివారి నక్షత్రబలం చాలా బాగుంది. కనుక వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం ఫర్వాలేదు. విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు.

.

మిథునం (Gemini) : ఈ రోజు మిథున రాశివారి ఆరోగ్యం, మానసిక స్థితి బాగుంటాయి. పనులు అన్నీ సక్రమంగా పూర్తవుతాయి. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కార్యాలయంలో మీ స్థానం మెరుగవుతుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. మీకు భారీ ఎత్తున లాభాలు కూడా వస్తాయి.

.

కర్కాటకం (Cancer) : ఈ రోజు కర్కాట రాశివారు ప్రారంభించిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతారు. మీకు పదోన్నతి లభించే ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంటి మరమ్మతులు చేస్తారు.

.

సింహం (Leo) : ఈ రోజు సింహ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ధ్యానం, ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను అందిస్తాయి.

.

కన్య (Virgo) : ఈ రోజు కన్య రాశివారికి చాలా బాగుంటుంది. ప్రజాదరణ, అధికారం, గౌరవం అన్నీ లభిస్తాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు పొందుతారు. వాహనం లేదా ఖరీదైన ఆభారణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

.

తుల (Libra) : ఈ రోజు తుల రాశివారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. మీ కింది స్థాయి అధికారులు పూర్తి సహకారం అందిస్తారు. మానసిక, శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి లాభాలు సంపాదిస్తారు.

.

వృశ్చికం (Scorpio) : ఈ రోజు వృశ్చిక రాశివారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధిత ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. విద్యార్థులు మాత్రం చదువుల్లో రాణిస్తారు. రచయితలకు, శిక్షకులకు ఇవాళ బాగా కలిసివస్తుంది. నూతన అవకాశాలు కూడా లభించవచ్చు.

.

ధనుస్సు (Sagittarius) : ఈ రోజు ధనుస్సు రాశివారికి జీర్ణ సంబంధమైన సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. ఇవాళ మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మేధోపరమైన చర్చలకు దూరంగా ఉండాలి. అయితే కళలు, సాహిత్యంపై ఆసక్తి ఉన్నవారు మంచిగా రాణిస్తారు.

.

మకరం (Capricorn) : ఈ రోజు మకర రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అది విజయవంతం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. మీలోని సృజనాత్మకతను, ఆలోచనలను అమలు పరిచి దానిని ఫలవంతం చేసుకుంటారు.

.

కుంభం (Aquarius) : ఈ రోజు కుంభ రాశివారికి ఏ మాత్రం బాగుండదు. మీలో రగులుతున్న కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వృత్తి, వ్యాపారాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. దైవ ప్రార్థన చేయడం మంచిది.

.

మీనం (Pisces) : ఈ రోజు మీన రాశివారు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఉత్సాహంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ కుటుంబ జీవితం బాగుంటుంది. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధార్మిక కార్యకలాపాలకు, తీర్థయాత్రలకు బాగా ఖర్చు చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.