ETV Bharat / spiritual

ఆ రాశి వారికి కోపమే పెద్ద శత్రువు! అదుపులో పెట్టుకోకుంటే ఇక అంతే! - Horoscope Today April 21th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 5:01 AM IST

Horoscope Today April 21th 2024 : ఏప్రిల్​ 21న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today April 21th 2024
Horoscope Today April 21th 2024

Horoscope Today April 21th 2024 : ఏప్రిల్​ 21న (ఆదివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. గతంలో ఇబ్బంది పెట్టిన పరిస్థితుల నుంచి బయట పడతారు. మంచి కాలం నడుస్తోంది. అందరినీ మీ ప్రతిభతో ఆకట్టుకుంటారు. ధర్మమార్గంలో నడుస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. ఉద్యోగులు మంచి శుభవార్త వింటారు. వ్యాపారులకు పెట్టుబడులు లాభిస్తాయి. శివారాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు ఉంటాయి. కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ రంగాల వారికి ఈ రోజు విశేషమైన ఫలితాలు ఉన్నాయి. మీ వాక్చాతుర్యంతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కష్టానికి తగిన ఫలితం ఉండదు. అయితే నిరాశ పడవద్దు. ఆర్థిక ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. అన్ని ఆటంకాలను అధిగమించి ఇతరులు అసూయ పడేలా ముందుకెళ్లడం మీ నైజం. దుర్గారాధనతో మరిన్ని శుభఫలితాలు పొందవచ్చు.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. చెడు అలవాట్లకు బానిస కావద్దు. ఇంట్లో గొడవలు అశాంతికి కారణం అవుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. మనసును అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నించండి. అన్నీ కుదుట పడతాయి. నీటి గండం ఉంది జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయస్వామి ప్రార్థనతో పరిస్థితులు చక్కబడతాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆనందంగా గడిచిపోతుంది. బంధుమిత్రులను కలుసుకోవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులు అంగీకరిస్తారు. ఉత్సాహంగా పని చేసి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీ పోటీదారులు మీ ముందు తమ ఓటమిని అంగీకరించి పక్కకు తప్పుకుంటారు. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. గృహంలో శాంతి, సౌఖ్యం నెలకొంటాయి. స్నేహితుల అండదండలు ఉంటాయి. ఆర్థికంగా అంత అనుకూలంగా లేదు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వ్యాపారులు మరింత శ్రద్ధగా పని చేస్తేనే లాభాలు వస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులు వేచి చూసే ధోరణి అవలంబిస్తే మేలు. మెరుగైన ఫలితాల కోసం సూర్య ఆరాధన చేయండి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. విందువినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈ రోజు మీకు లక్ష్మీ కటాక్షం ఉంది. అనుకోని సంపదలు మిమ్మల్ని వరిస్తాయి. తీర్థయాత్రలకు ప్రణాళిక వేస్తారు. ఈ అదృష్టకరమైన ఘడియల్ని మనసారా ఆనందించండి. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

తుల (Libra) : తులరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఆవేశం, కోపం, ఆగ్రహం ఈ రోజు మీకు బద్ధ శత్రువులుగా మారుతాయి. ప్రయత్నపూర్వకంగా మీరు వాటిని అదుపులో ఉంచుకోవాలి లేకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆరోగ్యం సహకరించదు. అందరితో మంచిగా ఉండటానికి ప్రయత్నించండి. కాలం కలిసి రానప్పుడు మౌనమే శ్రేయస్కరం. మెరుగైన ఫలితాల కోసం ఆంజనేయ స్వామి ప్రార్థన చేయండి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందువినోదాలతో కాలక్షేపం చేస్తారు. మీ జీవితంలో కీలకమైన ఘట్టం త్వరలోనే రానుంది. ఉద్యోగులకు మంచి కాలం. మీ ప్రతిభనుపై అధికారులు గుర్తిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు మంచి సమయం. వ్యాపారులకు పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. శివారాధన మేలు చేస్తుంది.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళతారు. ఇంట్లో శాంతి, సౌఖ్యం ఉంటాయి. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. అన్నివృత్తుల వారికి ఈ రోజు విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పరోశోధన రంగంలో పని చేసే వారికి ఈ రోజు విశేషమైన ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. ఆర్థికంగా బలపడతారు. ఆరోగ్యం బాగుంటుంది. తగు విశ్రాంతి అవసరం. అన్ని పనులు సాఫీగా జరిగిపోతాయి. శని స్తోత్రం పఠిస్తే మేలు.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. పని ప్రదేశంలో సమస్యలు, ఒత్తిడి కారణంగా ఆందోళన చెందుతారు. యోగా, ధ్యానం చేస్తూ మౌనంగా ఉండడం శ్రేయస్కరం. మీ సన్నిహితులను నొప్పించేలా మాట్లాడకండి. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మేలు. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఖర్చులు ఉంటాయి. శివారాధనతో పరిస్థితులు కుదుట పడతాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పని ఒత్తిడి నుంచి విరామం తీసుకొని సరదాగా గడపండి. మీ ఆరోగ్యానికి ఇది అవసరం. స్నేహితులతో సరదాగా గడపండి. వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెడితే విజయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.