ETV Bharat / politics

వైఎస్సార్సీపీలో ఆరని అసమ్మతి - ప్రత్యేక కార్యాచరణలో పలువురు నేతలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2024, 10:19 PM IST

Updated : Jan 29, 2024, 10:31 PM IST

YSRCP Dissident Leaders Meetings: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార వైఎస్సార్సీపీలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా పుట్టగొడుగుల్లా బయటకు వస్తున్నారు. రాష్ట్రం వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశాలు నిర్యహిస్తున్నారు. ఎమ్మెల్యేలు ఈ ఐదేళ్లలో ఏ ఒక్క రోజు నియోజకవర్గంలో తిరగలేదని ఆరోపించారు. వారికే టిక్కెట్ ఇస్తే ప్రత్యేక కార్యాచరణకు దిగుతామని అసమ్మతి నేతలు హెచ్చరిస్తున్నారు.

YSRCP_Dissident_Leaders_Meetings
YSRCP_Dissident_Leaders_Meetings

వైఎస్సార్సీపీలో ఆరని అసమ్మతి - ప్రత్యేక కార్యాచరణలో పలువురు నేతలు

YSRCP Dissident Leaders Meetings : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార వైఎస్సార్సీపీలో అసమ్మతి నేతలు ఒక్కొక్కరుగా పుట్టగొడుగుల్లా బయటకు వస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లాలో మరోసారి వర్గ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్​ రెడ్డికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసి రాచమల్లుకు టిక్కెట్ ఇస్తే తాము ప్రత్యేక కార్యాచరణకు దిగుతామని అసమ్మతి నేతలు హెచ్చరించారు. ఈ సమస్య తీరక ముందే బద్వేలు వైఎస్సార్సీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.

ఎమ్మెల్యే సుధాకు నాయకులెవరో తెలీదు : బద్వేలు ఎమ్మెల్యే సుధాకు మరోసారి టిక్కెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో విభేదాలు తలెత్తాయి. వైఎస్సార్సీపీ నేత నల్లేరు విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు సమావేశం అయ్యారు. ఎమ్మెల్యే సుధా ఈ ఐదేళ్లలో ఏ ఒక్క రోజు నియోజక వర్గంలో తిరగలేదని, ఆమెకు కార్యకర్తలెవరో, పార్టీ నేతలెవరో తెలియదని తెలిపారు. నేతలలో పరిచయ కార్యక్రమం సక్రమంగా చేసుకోలేదని అన్నారు.

వైఎస్సార్సీపీ అసమ్మతి నేతల రహస్య సమావేశం - పార్టీలో కలకలం

పార్టీలో పని చేసే వారికే గుర్తింపు లేదు : బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి చెప్పిన విధంగా ఎమ్మెల్యే నడుచుకుంటున్నారని విశ్వనాథరెడ్డి ఆరోపించారు. నియోజవర్గంలో తెలుగుదేశం బలంగా ఉన్న రోజుల నుంచి వైసీపీకి అండగా ఉన్నామని, తాము ఏ పదవులు ఆశించలేదని తెలిపారు. పార్టీలో పని చేసే వారికే గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు. జగన్ మోహన్ రెడ్డి మారువేషంలోనైనా వచ్చి డీసీ గోవిందరెడ్డి వ్యవహార శైలిని తెలుసుకోవాలని ఆయన సూచించారు.

ఎమ్మెల్యే తిప్పేస్వామి ఎలాంటి అభివృద్ధి చేయలేదు : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే వైటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తిప్పేస్వామిపై అసమ్మతి నేతలు నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళితే ఒక్క ఓటు పడదని వైటి ప్రభాకర్ రెడ్డి అన్నారు. అధికారులను గుప్పెట్లో పెట్టుకున్న ఎమ్మెల్యే తిప్పేస్వామి ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, లక్షల రూపాయల్లో వసూళ్లు చేసి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ముక్కలుగా మారి మూల్గుతున్న మంగళగిరి వైఎస్సార్​సీపీ - ఆదిపత్యపోరుతో పెరుగుతున్న అసమ్మతి

అన్నా కావాలి అన్ననే రావాలి : ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు ఆరోగ్య సమస్యల కారణంగా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని బహిరంగంగా ప్రకటించారు. కానీ ఆయన సానుభూతిపరులు మాత్రం వైఎస్సార్సీపీ అధిష్టానం మరో మారు అన్నాకే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వాలని కోరూతూ బేస్తవారిపేట పట్టణంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అన్నా కావాలి అన్ననే రావాలి అని కార్యకర్తలు, నాయకులు నినాదాలు చేశారు. సీఎం జగన్ మరో మారు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకు అవకాశం ఇస్తే భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు తెలిపారు.

విశాఖలో వైఎస్సార్సీపీని ఖాళీ చేయడమే మా ప్రధాన ధ్యేయం : అసమ్మతి కార్పొరేటర్లు

Last Updated : Jan 29, 2024, 10:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.