ETV Bharat / politics

పులివెందులలో సింగల్ ప్లేయర్​గా ఉండేందుకే వివేకా హత్య- భారతీరెడ్డిపై వైఎస్ సునీత ఆగ్రహం - Viveka daughter Sunitha Interview

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 4:03 PM IST

Updated : May 10, 2024, 6:09 PM IST

YS Viveka daughter Sunitha Interview: పులివెందులలో సింగల్ ప్లేయర్​గా ఉండేందుకే వివేకానంద రెడ్డిని హత్య చేశారని సీఎం జగన్ సతీమణి భారతిపై వైఎస్ సునీత నిప్పులు చెరిగారు. తనను నరికేస్తారో, లేక షర్మిలను నరికేస్తారో తెలియదు గానీ సింగల్ ప్లేయర్​గా ఉండాలంటే అదొక్కటే పాజిబిలిటీ అంటూ వ్యాఖ్యానించారు.

YS_Viveka_Daughter_Sunitha_Interview
YS_Viveka_Daughter_Sunitha_Interview (ETV Bharat)

భారతీరెడ్డిపై వైఎస్ సునీత ఆగ్రహం (ETV Bharat)

YS Viveka daughter Sunitha Interview: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో సింగల్ ప్లేయర్​గా ఉండేందుకే వివేకానంద రెడ్డిని హత్య చేశారని భారతిని ఉద్దేశించి మాట్లాడారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. భారతి 'నన్ను నరికేస్తారో, లేక షర్మిలను నరికేస్తారో తెలియదు గానీ సింగల్ ప్లేయర్​గా ఉండాలంటే అదొక్కటే పాజిబిలిటీ' అంటూ వైఎస్ సునీత వ్యాఖ్యానించారు.

సీఎం జగన్​ను ఎదిరించి మాట్లాడే సత్తా వివేకాకు ఉంది కాబట్టే కోపంతో హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని, అన్నింటికీ తెగించే పోరాడుతున్నానని సునీత స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డి చెప్పిన మాటలు నమ్ముతున్నట్లు జగన్ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ ఏమైనా పోలీసా లేక సీబీఐనా లేక కోర్టా అంటూ నిలదీశారు. నిందితుడు అవినాష్ రెడ్డి చెబుతున్న మాటలు నమ్ముతున్న జగన్ నా ఆవేదన ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

'ఒక వైపు వైఎస్సార్ బిడ్డ - మరో వైపు వివేకా హత్య నిందితుడు - ఏవరికి ఓటు వేస్తారు?' - YS SHARMILA ELECTION speech

జగన్ తనతో మాట్లాడి హత్య చేయించారని అప్రూవర్ దస్తగిరి చెబుతున్నాడని అవి జగన్మోహన్ రెడ్డికి వినిపించలేదా అని మండిపడ్డారు. మొదట సాక్షిలో గుండెపోటు అని వచ్చిందని దానికి ఎందుకు వివరణ ఇవ్వలేదో చెప్పాలన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డికి న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని సూచించారు. వివేకా కేసును తప్పుదారి పట్టించేందుకు అబద్దాలు చెబుతున్నారన్న సునీత నిందితులను జగన్ ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.

దేశమంతా ఎన్నికలు సాధారణంగా జరుగుతుంటే కడప ఎన్నికలకు మాత్రం ప్రత్యేకత ఉందన్నారు. కడపలో న్యాయానికి, నిందితులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రజలు న్యాయం, అభివృద్ధి వైపు ఉంటారా లేదా అనేది ప్రపంచం మొత్తం చూస్తోందని తెలిపారు. షర్మిలను ఎంపీగా చేయాలని వివేకానంద రెడ్డి అనుకున్నా కుదరలేదన్నారు. ఆయన కోరికను నెరవేర్చేందుకు ప్రజలు కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిలకు ఓటు వేసి న్యాయం వైపు నిలవాలని సునీత విజ్ఞప్తి చేశారు.

"దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థపైనే నమ్మకం లేని జగన్, నిందితుడు చెప్పిందే నిజమనే విధంగా మాట్లాడుతున్నారు. నిందితుడు అవినాష్​రెడ్డి చెబుతున్న మాటలు నమ్ముతున్న జగన్ నా ఆవేదన ఎందుకు పట్టించుకోవడం లేదు?. జగన్ తనతో మాట్లాడి హత్య చేయించారని అప్రూవర్ దస్తగిరి చెబుతున్నాడని అవి జగన్మోహన్ రెడ్డికి వినిపించలేదా?. మొదట సాక్షిలో గుండెపోటు అని వచ్చింది, దానికి ఎందుకు వివరణ ఇవ్వలేదు? నిందితులను జగన్ ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి?. కడపలో న్యాయానికి, నిందితులకు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు న్యాయం, అభివృద్ధి వైపు ఉంటారా లేదా అనేది ప్రపంచం మొత్తం చూస్తోంది. షర్మిలను ఎంపీ చేయాలన్నది వివేకానందరెడ్డి కల. కడప ప్రజలు దాన్ని తప్పకుండా నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం" - వైఎస్ సునీత, మాజీ మంత్రి వివేకా కుమార్తె

పులివెందులలో వైఎస్ భారతికి సమస్యల స్వాగతం - YS Bharti Election Campaign

Last Updated : May 10, 2024, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.