ETV Bharat / politics

వైసీపీకి షాక్​ ఇస్తున్న నేతలు, కార్యకర్తలు - ఎన్డీఏలోకి భారీగా కొనసాగుతున్న వలసలు - Joining TDP and Janasena from YCP

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 9:38 PM IST

YCP Leaders and Activists Joining TDP and Janasena: రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి వలసలు కొనసాగతూనే ఉన్నాయి. ఆ పార్టీ నాయకుల అక్రమాలు భరించలేక వైసీపీని వీడుతున్నట్లు తెలిపారు. వారికి టీడీపీ- జనసేన నేతలు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు.

joining_tdp_and_janasena
joining_tdp_and_janasena

YCP Leaders and Activists Joining TDP and Janasena: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ నుంచి టీడీపీ-జనసేనలోకి వలసలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నాయకుల అక్రమాలు భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీను వీడి టీడీపీ- జనసేనలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ- జనసేన నేతలు వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు.

వైసీపీకి షాక్​ ఇచ్చిన మరో ఎమ్మెల్యే- షర్మిల సమక్షంలో కాంగ్రెస్ గూటికి - YCP MLA Eliza joined Congress

Tirupati District: తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని అనుపల్లిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం అరాచకాలు భరించలేక ఇన్నాళ్లు అవస్థలు పడ్డామని అందుకే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు చెవిరెడ్డికి అత్యంత సన్నిహితుడు తాటిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పులివర్తి నాని ఆధ్వర్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా వైసీపీ పాలనలో ఎప్పుడు లేని దౌర్జన్యాలు దాస్టికాలు చూసామని ఇక తమ పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే అది ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని అందుకోసమే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వెంకటేశ్వరరెడ్డితో పాటు ఆయన అనుచరులు, 100 వైసీపీ సానుభూతి కుటుంబాలు పసుపు కండువాలు కప్పుకున్నారు.

West Godavari District: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు పంచాయతీకి చెందిన 9వ వార్డు సభ్యులు కొక్కిరాల రంగారావు ఆయన అనుచరులు, అభిమానులతో సహా పలు చేనేత కుటుంబాలకు చెందినవారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. రంగారావు పంచాయతీ ఎన్నికల సమయంలో వైసీపీ సానుభూతిపరులుగా పోటీ చేసి గెలుపొందారు. పార్టీలో చేరిన వారందరికీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పార్టీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.

27 నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారం - 'ప్రజాగళం' పేరుతో సభలు, రోడ్ షోలు - Chandrababu Election Campaign

Vizianagaram District: విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇప్పలవలసలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి 300 కుటుంబాలు చేరారు. జనసేన పార్టీ సిద్దాంతాలు ఆశయాలు నచ్చి చేరుతున్నట్లు తెలిపారు. వీరితో పాటుగా ఈ కార్యక్రమంలో ఇప్పలవలస మాజీ సర్పంచ్​తో పాటు పలు పంచాయతీల మాజీ సర్పంచ్​లు, వార్డ్ మెంబర్లు జనసేనలోకి చేరారు. వీరంతా జనసేన రాష్ట్ర పొలిటికల్ జనరల్ సెక్రటరీ శివశంకర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. మరోచోట గుండాలపేటకు చెందిన వైసీపీ సర్పంచ్ జగదీశ్వరితో పాటు వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. వారికి టీడీపీ అభ్యర్థి పూసపాటి అదితి గజపతి రాజు కండవా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Kurnool District: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి షాక్ తగిలింది. కల్లూరు మండలం తడకనపల్లె గ్రామానికి చెందిన 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. సర్పంచ్ సహరాబీ సహా పలువురిని గౌరు చరిత దంపతులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశంతోనే అభివృద్ధి సాధ్యమని గౌరు చరిత తెలిపారు.

ఎన్నికల్లో వీర మహిళలు క్రియాశీలక పాత్ర పోషించాలి: పవన్‌ - Pawan Kalyan on Veera Mahilalu

YSR District: కడపలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవి ముమ్మరంగా ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారంలో భాగంగా కడప రవీందర్ నగర్​కు చెందిన పలువురు ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఆమె కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే కడపను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని ఆమె భరోసా ఇచ్చారు. ముఖ్యంగా కడప బుగ్గవంక వాసులకు ఏళ్ల తరబడి ఉన్న వంతెనల కష్టాలన్నింటిని అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే తీరుస్తామని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.